E-Paper
Advertisement

Anuroop Reddy: నీ త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ.. సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ ట్వీట్..!

Anuroop Reddy: నీ త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ.. సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ ట్వీట్..!
Advertisement

Anuroop Reddy: చావుబతుకుల్లో ఉన్న ముగ్గురి ప్రాణాలు కాపాడాడు.. కానీ ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. అంతలోనే అనుకోని ప్రమాదం అతని ప్రాణం తీసింది. కన్నవారికి తీరని శోకం మిగిల్చింది. మనం మాట్లాడుకుంటున్నది అనురూప్ రెడ్డి గురించి. అతని భౌతికకాయం అమెరికా నుంచి హైదరాబాద్‌కు చేరింది. అందరి గుండెలను మరింత బరువెక్కించింది.

గత నెల 29న..

తమ కళ్లముందే పెరిగి, అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుంటూ అంతలోనే అనంత లోకాలకు వెళ్లిన అనురూప్‌ను చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. అనురూప్‌ రెడ్డి ఇటీవలే అమెరికాలో ఎంఎస్‌ పూర్తి చేశాడు. గత నెల 29న ఫ్రెండ్ బర్త్‌డే ఉందని చెప్పి టొలెడోబెండ్ రిజర్వాయర్‌కు వెళ్లారు. అక్కడే తన ఫ్రెండ్స్‌ నది ప్రవాహంలో కొట్టుకుపోతుండటం చూసి వెంటనే నదిలోకి దూకి ముగ్గురిని కాపాడాడు. కానీ తాను ఒడ్డుకు చేరే టైమ్‌లో ఫిషింగ్ నెట్‌ కాళ్లకు చుట్టుకొని నీటిలో మునిగిపోయాడు. తన ఫ్రెండ్స్ ప్రాణాలను కాపాడి మరీ ప్రాణాలను వదిలిన రెడ్డి ఒక హీరో అంటున్నారు అతని ఫ్రెండ్స్.

Advertisement

Also Read: Tata Tiago: టాటా టియాగో క్రియేటివ్ vs క్రియేటివ్ ప్లస్.. ఏ వేరియంట్ కొనడం బెస్ట్?

చరిత్రలో చిరస్థాయిగా..

23 ఏళ్ల వయసులోనే అనురూప్‌ చూపించిన తెగువపై సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. అనురూప్ చూపిన ధైర్యసాహసాలు, మానవత్వం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు ఆయన. ఆయన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ కష్టసమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనురూప్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రజల తరఫున ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించిన సీఎం.. అనురూప్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

కోటి రూపాయల ప్యాకేజీతో..

Advertisement

అనురూప్ రెడ్డి భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. స్నేహితుల కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన అనురూప్‌రెడ్డిని ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. అనురూప్ రెడ్డికి ఇటీవల కోటి రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం కూడా వచ్చింది. ఉద్యోగంలో చేరి కుటుంబ భారాన్ని మోస్తాడనుకుంటే ఇలా నిర్జీవంగా ఇంటికి తిరిగి వస్తాడనుకోలేదంటూ అంతా కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read: Cyber Hacking: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అకౌంట్ హ్యక్ కలకలం

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×