E-Paper
Advertisement

Social Media: జోసెఫ్ అరెస్ట్‌పై మాజీ సీఎం జగన్ ఫైర్.. ఏపీలో ముదిరిన సోషల్ మీడియా వార్!

Social Media: జోసెఫ్ అరెస్ట్‌పై మాజీ సీఎం జగన్ ఫైర్.. ఏపీలో ముదిరిన సోషల్ మీడియా వార్!
Advertisement

Social Media: APలో ప్రస్తుతం నడుస్తున్న సోషల్ మీడియా రాజకీయం పెను తుఫానును తలపిస్తోంది.యూట్యూబర్‌ ప్రశ్న జోసెఫ్ అరెస్టుతో పొలిటికల్‌ హీట్‌ పీక్స్‌కు చేరింది. విమర్శలు, ప్రతివిమర్శల స్థాయి దాటి. వ్యక్తిగత దూషణలు, అరెస్టులు, కోర్టు కేసులు ఇలా ఏపీ రాజకీయాలు ఇంతకముందెప్పుడూ లేని విధంగా కాక పుట్టిస్తున్నాయి.

యూట్యూబర్‌ ప్రశ్న జోసెఫ్..

డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. యూట్యూబర్‌ ప్రశ్న జోసెఫ్ అరెస్ట్ అయ్యారు. దానికి మాజీ సీఎం జగన్ తీవ్రంగా స్పందించడం వివాదాన్ని మరింత రాజేసింది. హేరామ్… సేవ్ ఆంధ్రప్రదేశ్… రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందంటూ ట్వీట్ చేశారు.ఇంకేముంది సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా…ప్రతిపక్ష పార్టీ సపోర్ట్‌ ఉంటుందనేలా మెసేజ్‌ వెళ్లిపోయింది. అయితే తమపైన ట్రోల్స్‌కు,అసభ్య పోస్టులకు ఎవరు జవాబుదారీ అనేది వైసీపీ క్వశ్చన్.

Advertisement

Also read: Vizag Metro: వైజాగ్ మెట్రోకు ఇంకా రాని క్లియరెన్స్.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా మారిన ప్రాజెక్ట్!

వైసీపీ భారీగా ఫండింగ్..

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సోషల్ మీడియా దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. తమను, తమ కుటుంబ సభ్యులను క్యారెక్టర్ అస్సాసినేషన్ చేయడానికి వైసీపీ భారీగా ఫండింగ్ ఇస్తూ.. ఒక ప్రత్యేక వ్యవస్థను నడుపుతోందని చంద్రబాబు ఆరోపించారు. కేవలం రాజకీయ విమర్శల వరకు ఓకే కానీ, మహిళలను, కుటుంబాలను టార్గెట్ చేస్తూ అసభ్యకరంగా పోస్టులు పెడితే చట్టపరంగా ఊరుకునేది లేదని ప్రభుత్వం గట్టి వార్నింగ్‌ ఇస్తోంది.

వైసీపీ సోషల్ మీడియా..

Advertisement

ప్రస్తుతం ఏపీ సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలు అన్ని హద్దులు దాటాయనేది నిజం. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం పౌరుల హక్కు. కానీ ఆ నెపంతో బూతులు తిట్టడం, ఫేక్ ప్రచారాలు చేయడం, వ్యక్తిగత జీవితాలపై బురదజల్లడం నాట్‌ రైట్. రెండు ప్రధాన పక్షాలు..అటు కూటమి, ఇటు వైసీపీ తమ సోషల్ మీడియా వింగ్‌లను ప్రత్యర్థులను అణగదొక్కడానికే వాడుకుంటున్నాయి. చట్టం తన పని తాను చేయాలి, కానీ అది కక్షసాధింపు చర్యగా మారకూడదు. అదే సమయంలో, సోషల్ మీడియా వేదికగా సాగే పెయిడ్ ట్రోలింగ్ సంస్కృతికి అన్ని పార్టీలు వాలంటరీగా ఎండ్‌ కార్డ్‌ పెడితేనే రాజకీయాలు ఆరోగ్యకరంగా మారుతాయన్నది అక్షరాల నిజం.

Also read: Property Tax: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. త్వరలో ఆస్తి పన్ను డబుల్..?

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×