E-Paper
Advertisement

Trading Scam: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో రూ. 25 కోట్ల భారీ స్కామ్.. షాక్‌లో బాధితులు..?

Trading Scam: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో రూ. 25 కోట్ల భారీ స్కామ్.. షాక్‌లో బాధితులు..?
Advertisement

Trading Scam: స్టాక్‌మార్కెట్‌ ట్రేడింగ్ ఒకప్పుడు మెట్రో సిటీల‌కు మాత్రమే ప‌రిమిత‌ం. కానీ ఇప్పుడు అనేక పట్టణాలకు కూడా విస్తరించింది. కొంద‌రు స్టాక్ మార్కెట్ గురించి త‌మ‌కు పూర్తి అవ‌గాహ‌న ఉందంటూ బంధువులు, స్నేహితుల‌తో పెట్టుబ‌డులు పెట్టిస్తారు. వారి డ‌బ్బుతో ట్రేడింగ్ చేస్తారు. చివరికి పూర్తిగా నష్టపోయి. చెతులెత్తేస్తారు. సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది ఉమ్మడి అనంత‌పురం జిల్లాలో బుక్కరాయ స‌ముద్రం మండ‌లం వెంక‌టాపురం గ్రామానికి చెందిన దొంగ‌ల న‌రేష్ రెడ్డి ఆరిజ‌న్ సొల్యూష‌న్స్ పేరుతో అనంత‌పురంలో ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. కార్పొరేట్ త‌ర‌హాలో హంగూ ఆర్భాటాల‌తో ఉండేది ఆ ఆఫీస్.

అధిక వడ్డీలతో మాయ..

నరేష్ రెడ్డి తీరు ఆ ఆఫీస్‌ మెయింటనెన్స్‌ చూసి స్నేహితులు, బంధువుల‌తో మొద‌ట కొద్ది మొత్తంలో పెట్టుబ‌డి పెట్టించారు. వారి పెట్టిన పెట్టుబడిపై మూడు రూపాయ‌ల వ‌డ్డీ ఇచ్చాడు. దీంతో వారిలో న‌మ్మకం పెంచాడు. న‌రేశ్ రెడ్డి హంగూ ఆర్భాటాలు చూసి నిజంగా సంపాదిస్తున్నాడ‌నే భ్రమలోకి బంధువులు, స్నేహితులు వెళ్లిపోయారు. మొద‌ట్లో ఇచ్చిన లాభాలు తిరిగి పెట్టుబ‌డిగా పెడితే.. ప‌ది, ప‌దిహేను రూపాయ‌ల వ‌డ్డీ ఇస్తానంటూ న‌మ్మించాడు. ఇలా ఒకరిని కాదు ఇద్దరిని కాదు దాదాపు 120 మంది నుంచి పెట్టుబడులు పెట్టించాడు.

పరారీలో నరేష్..

Advertisement

మొద‌ట్లో అంతా బాగానే ఉండేది. న‌మ్మకంగా లాభాల‌ను పంచాడు. కానీ ఆ తర్వాతే కథ మారింది. ప‌ది, ప‌దిహేను రూపాయ‌ల వ‌డ్డీ ఆశ‌జూపించి మరింత డబ్బు వసూలు చేసినప్పుడే కథ అడ్డం తిరిగింది. డబ్బులు ఇవ్వడం మానేశాడు. తమ డబ్బులు ఎక్కడ అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. తాను న‌ష్టాల్లో ఉన్నాన‌ని త్వర‌లో డబ్బు మొత్తం ఇస్తాన‌ని హామీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత నరేష్‌ రెడ్డి పరారయ్యాడు. ఫోన్‌లో కూడా స్పందించ‌డం లేద‌ని బాధితులు నెత్తినోరూ కొట్టుకుంటున్నారు. మొత్తంగా 25 కోట్ల వరకు బాధితుల నుంచి వసూలు చేశార‌ని తెలుస్తోంది.

Also read: తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

25 కోట్ల దాక అప్పు..

Advertisement

మరి ఏమైనా నష్టం వచ్చిందా అంటే అదీ లేదని చెబుతున్నాడట నరేష్ రెడ్డి. త‌న‌కు స్టాక్ మార్కెట్లో ఎలాంటి న‌ష్టం రాలేదు.. కానీ 25 కోట్ల దాక అప్పు ఉన్నట్టు చెబుతున్నాడ‌ని బాధితులు చెబుతున్నాడు. అతని బాధితుల ఆవేదన ఏంటో ఓసారి వినండి. స్టాక్ మార్కెట్ అనేది చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఒక్క రోజులో భారీ స్థాయిలో డబ్బు ఎలా వస్తుందో.. అదే స్థాయిలో డబ్బు కూడా పోతుంది. ఇదంతా జరగడానికి అనుభవం లేకపోవడం అత్యాశ ఉంటే చాలు. కథ ఒక్క రోజులో మారిపోతుంది. నరేష్ రెడ్డి కూడా భారీ స్థాయిలో ట్రేడ్ చేసి అత్యాశకు పోయి నిండా మునిగి ఉండొచ్చు.. లేదా వచ్చిన డబ్బుతో జెండా తిప్పేసి ఉండొచ్చు.

పోలీసుల‌కు ఫిర్యాదు..

ఈ కథలో మరో దారుణమైన విషయం ఏంటంటే.. తన కంపెనీలో దాదాపు 50 మంది అమ్మాయిల‌కు ఉద్యోగం ఇచ్చాడు న‌రేష్ రెడ్డి. వారికి ప‌దివేలు జీతం ఇచ్చి వారికి కూడా డ‌బ్బు ఆశ‌జూపి, పెట్టుబ‌డి పెట్టించాడని తెలుస్తోంది. ఆ త‌ర్వాత వారికి కూడా బంధువుల‌కు, స్నేహితుల‌కు ఇచ్చిన స‌మాధాన‌మే ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. బాధితులు న‌రేష్ రెడ్డిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

తస్మాత్ జాగ్రత్త..

అందుకే కష్టపడకుండా కోట్లు వస్తాయంటే అది కరెన్సీ నోటు కాదు, మిమ్మల్ని ముంచేసేస్కెచ్ అని మనం తెలుసుకోవాలి రెప్పపాటులో ధనవంతులు అయిపోవచ్చు అనే అత్యాశే మీ జీవితకాల సంపాదనను బూడిదలో పోసిన పన్నీరు చేస్తోందని ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలి. అప్పటి వరకు ఇలాంటి నరేష్‌ రెడ్డిలు వస్తూనే ఉంటారు మీ జేబులను గుళ్ల చేస్తూనే ఉంటారు. సో తస్మాత్ జాగ్రత్త.

Also read: ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×