E-Paper
Advertisement

Allu Arjun: ఆఖరి నిమిషంలో అల్లు అర్జున్‌కి సీన్ రివర్స్.. బోనులో నిలబడకుండా పుష్పరాజ్ ఏం చేశారంటే?

Allu Arjun: ఆఖరి నిమిషంలో అల్లు అర్జున్‌కి సీన్ రివర్స్.. బోనులో నిలబడకుండా పుష్పరాజ్ ఏం చేశారంటే?
Advertisement

Allu Arjun: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన. రేవతి అనే మహిళ మృతి.. శ్రీతేజ తీవ్రంగా గాయపడటం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ ఇది. అయితే ఈ కేసులో విచారణకు రావాల్సిందే అని నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా అందరిలో ఒకటే క్వశ్చన్. అల్లు అర్జున్ కోర్టుకు వస్తాడా? రాడా? కానీ ఆఖరి నిమిషంలో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఆయన లీగల్ టీమ్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

ఆబ్సెన్స్ పిటిషన్ దాఖలు..

ఎట్టకేలకు నాంపల్లి కోర్టులో విచారణకు హాజరయ్యారు అల్లుఅర్జున్. అయితే అది వ్యక్తిగతంగా కాదు. ఆయన ముంబైలోనే ఉండిపోయారు. మొదట ఆన్‌లైన్ ద్వారా హాజరవుతారని ప్రచారం జరిగింది. కానీ కోర్టు మొదట అందుకు అంగీకరించలేదు. దీంతో కోర్టు మొట్టికాయలు తప్పవనే చర్చ జరిగింది. అల్లు అర్జున్ న్యాయవాదులు కోర్టులో ఆబ్సెన్స్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో అల్లు అర్జున్ రాకపోవడానికి కారణాలు తెలిపారు. అదే సమయంలో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు రిక్వెస్ట్ చేయడంతో కోర్టు అంగీకరించింది. దీంతో ముంబై నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు అల్లు అర్జున్. కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఈ విచారణ జరిగినట్టు తెలుస్తోంది.

Advertisement

Also read: నేను కేసీఆర్ అంత మంచోడ్ని కాదు! కాంగ్రెస్సోళ్ల‌ని ఉర్కిచ్చి ఉర్కిచ్చి కొడ‌తా! ఇక కేటీఆర్ మార్క్ పాల‌న‌ట‌..

జులై 6కు వాయిదా..

అల్లు అర్జున్ మాత్రమే కాదు. ఈ కేసులో A1 నుంచి A10 గా ఉన్న సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా అనారోగ్య కారణాల వల్ల కోర్టుకు రాలేదు. వారి తరపున కూడా లీగల్ టీమ్స్ మెమోలు సమర్పించాయి. ఈ కేసులో అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా ఉన్నాడు. నిందితులను విచారించిన అనంతరం తదుపరి విచారణను జులై 6కు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. మరి ఆ రోజైన పుష్పరాజ్ కోర్టు బోనులో నిలబడతారా లేదా వర్చువల్‌గానే ఎంట్రీ ఇస్తారా అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Advertisement

Storey By: Appa Rao Big Tv

Also read: Sai Krishna: హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు జగన్ టీమ్ సంచలన ఫిర్యాదు..!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×