E-Paper
Advertisement

Yamaha RX 100: ఐకానిక్ RX100 వచ్చేస్తోంది సరికొత్తగా.. లాంచింగ్ ఎప్పుడంటే?

Yamaha RX 100: ఐకానిక్ RX100 వచ్చేస్తోంది సరికొత్తగా.. లాంచింగ్ ఎప్పుడంటే?
Advertisement

New Yamaha RX 100 Bike: యమహా RX100. ఇండియన్ బైక్ లవర్స్ కు దీనికి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. దేశంలో అత్యంత పాపులర్ ఐకానిక్ బైక్ గా గుర్తింపు తెచ్చుకుంది. 1985- 1996 వరకు అమ్మకాల్లో దుమ్మురేపింది. కుర్రాళ్ల ఫేవరెట్ బైక్ గా మారిపోయింది. ఈ బైక్ సరికొత్తగా మళ్లీ మార్కెట్లోకి అడుగు పెట్టబోతుంది. నిజానికి దీని రీలాంచ్ గురించి చాలా ఏళ్లుగా రూమర్స్ ఉన్నాయి. కానీ, ఇంకా అధికారికంగా లాంచ్ కాలేదు. యమహా నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అయితే.. తాజాగా ఈ బైక్ రీలాంచ్ గురించి ప్రముఖ ఆటో సైట్లు కథనాలు రాస్తున్నాయి.

New Yamaha RX 100 అంచనా లాంచ్ డేట్

ఈ బైక్ 2026 ఎండింగ్ లో లేదంటే 2027 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యమహా చైర్మన్ 2022లో  2026లో రీలాంచ్ అవుతుందని హింట్ ఇచ్చారు. అదే సమయంలో ఎమిషన్ నార్మ్స్ కారణంగా కాస్త ఛాలెంజింగ్ కావచ్చని చెప్పారు. అయితే, వచ్చే ఏడాది చివరికల్లా లాంచ్ అవుతుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు.

New Yamaha RX 100 అంచనా ధర

Advertisement

Yamaha RX 100  బైక్ ధ సుమారు రూ. 1.00 లక్ష నుంచి రూ. 1.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇంచుమించు రూ. 1.40 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

New Yamaha RX 100 ఇంజన్, పర్ఫార్మెన్స్

ఓల్డ్ మోడల్‌లో  మాదిరిగా 98cc టూ-స్ట్రోక్ ఇంజన్ ఉండదు. ఎమిషన్ రూల్స్ కారణంగా, కొత్త మోడల్ లో మోడర్న్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ ఉండవచ్చు. సుమారు 100cc లేదంటే కాస్త పెద్దదిగా ఉండవచ్చు. ఫ్యూయల్ ఇంజెక్షన్‌ తో BS6/BS7లో రానుంది. పవర్ గురించి పరిశీలిస్తే.. ఒరిజినల్‌ లా పంచీ పర్ఫార్మెన్స్ ఇవ్వడం కష్టం అని యమహా చెప్పింది.  కానీ హై-పర్ఫార్మెన్స్,  లైట్‌వెయిట్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. టాప్ స్పీడ్ సుమారు 110 kmph ఉండవచ్చు. మైలేజ్ 35-40 kmpl అంచనా వేస్తున్నారు.

New Yamaha RX 100 ఫీచర్లు

Advertisement

కొత్త బైక్ రెట్రో డిజైన్‌తో మోడర్న్ టచ్ తో రానుంది. రౌండ్ హెడ్‌ ల్యాంప్, కర్వీ ఫ్యూయల్ ట్యాంక్, క్రోమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. LED లైటింగ్ లేదంటే హాలోజెన్. సెమీ-డిజిటల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. అల్లాయ్ వీల్స్ లేదంటే స్పోక్ వీల్స్ తో రానుంది. డ్రమ్ బ్రేక్స్, మోనోషాక్ సస్పెన్షన్ కలిగి ఉంటుంది. ట్యూబ్, ట్యూబ్‌ లెస్ టైర్స్ తో రానుంది. కాంపాక్ట్ సైజ్, నింబుల్ హ్యాండ్లింగ్ ఒరిజినల్ RX100లా ఉంటాయి.

Read Also: అమ్మకాల్లో దుమ్మురేపిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

బాడీ టైప్ నేకెడ్/స్ట్రీట్/కమ్యూటర్ బైక్ గా ఉంటుంది. Honda Unicorn, Bajaj Pulsar 150, Hero Glamour లాంటి బైక్స్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.  చాలా మంది ఒరిజినల్ లుక్, సౌండ్, పికప్ కావాలని కోరుకుంటున్నారు. మోడర్న్ టెక్నాలజీతో తక్కువ ధరలో రావాలని ఆశిస్తున్నారు.

Read Also: దేశీ మార్కెట్లో లాంచ్ కాబోతున్న క్రేజీ యమహా బైక్స్.. లైనప్ చూస్తే అదిరిపోవాల్సిందే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×