E-Paper
Advertisement

యమహా సూపర్ హైబ్రిడ్ బైక్.. దీని డబుల్ పవర్ చూస్తే పిచ్చెక్కడం పక్కా!

యమహా సూపర్ హైబ్రిడ్ బైక్.. దీని డబుల్ పవర్ చూస్తే పిచ్చెక్కడం పక్కా!
Advertisement

Yamaha  Hybrid Superbike: ప్రముఖ టూ వీలర్ సంస్థ యమహా అదిరిపోయే సూపర్ బైక్ ఆవిష్కరించింది. MT-09 PHEV కాన్సెప్ట్ పేరుతో ఈ  బైక్‌ను పరిచయం చేసింది. ఇది సాధారణ బైక్‌ లకంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పెట్రోల్ తో పాటు ఎలక్ట్రిక్ టెక్నాలజీని కలిపిన హైబ్రిడ్ మోడల్‌ గా తయారు చేసింది. PHEV అంటే  ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్. అంటే, అవసరమైనప్పుడు బ్యాటరీని బయట నుంచి కూడా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

హైబ్రిడ్ బైక్ ఇంజిన్ గురించి..

ఈ బైక్‌ లో 890cc సామర్థ్యం ఉన్న CP3 పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది మూడు సిలిండర్లతో పని చేసే పవర్ ఫుల్ ఇంజన్. దీనితో పాటు ఓ ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ కూడా ఉంటుంది. ఈ రెండు కలిసినప్పుడు బైక్‌ కు అడిషనల్ పవర్ లభిస్తుంది. ముఖ్యంగా హైబ్రిడ్ మోడ్‌ లో పెట్రోల్ ఇంజన్‌ తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కూడా పని చేసి మరింత పవర్ అందిస్తుంది.

ఈ బైక్ ప్రత్యేకత ఏంటంటే?

Advertisement

ఈ బైక్‌లో మరో ప్రత్యేకత ఉంది. ఇది రెండు రకాలుగా నడుస్తుంది. ఇందులో ఒకటి పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్. ఈ మోడ్‌ లో బైక్ సైలెంట్ గా నడుస్తుంది. ఎలాంటి పొల్యూషన్ లేకుండా నడుస్తుంది. సిటీల్లో చిన్న ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. రెండవది హైబ్రిడ్ మోడ్. ఈ మోడ్‌ లో పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్ కలిసి పని చేస్తాయి. సాధారణంగా సుమారు 50 కిలోమీటర్ల వేగం దాటినప్పుడు ఈ మోడ్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి బైక్ వెనుక భాగంలో ప్రత్యేకంగా ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. దీనివల్ల ఇంట్లో లేదంటే ఛార్జింగ్ స్టేషన్లలో ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ తో ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెహికల్ గా మార్చుతుంది.

డిజైన్ గురించి..

ఇక ఈ హైబ్రిడ్ బైక్ సాధారణ MT-09 లుక్‌ లాగే ఉంటుంది. కానీ, ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీని అమర్చడానికి మిడ్ సెక్షన్ కొంచెం మందంగా కనిపిస్తుంది. ఈ బైక్‌ కు మరింత మస్కులర్ లుక్ ఇస్తుంది. అడిషనల్ గా బైక్‌ లో కూలింగ్ కోసం రేడియేటర్ స్కూప్‌ లు ఉంటాయి. ఇవి ఇంజన్, మోటార్ వేడిని తగ్గించడంలో సహాయపడతాయి.

Advertisement

టెక్నాలజీ పరంగా కూడా ఈ బైక్ చాలా మోడ్రన్ గా ఉంటుంది. ఇందులో 4.2 అంగుళాల TFT డిస్‌ ప్లే ఉంటుంది.  ఇది స్పీడ్, మోడ్, బ్యాటరీ స్టేటస్ లాంటి వివరాలను డిస్ ప్లే చేస్తుంది. అలాగే, హైబ్రిడ్ పవర్ కంట్రోల్ సిస్టమ్ బైక్ పనితీరును మెయింటెయిన్ చేస్తుంది. ప్రస్తుతం MT-09 PHEV ప్రోటో టైప్ దశలో ఉంది. అంటే, ఇది ఇంకా మార్కెట్లో అమ్మకానికి రాలేదు. అయితే, భవిష్యత్తులో యమహా తీసుకురాబోయే హైబ్రిడ్ టెక్నాలజీకి ఇది ఎంట్రీ పాయింట్ గా చెప్పుకోవచ్చు.

Read Also: ఫ్లయింగ్ టాక్సీలు వచ్చేశాయ్, ఇక హ్యపీగా గాల్లో ఎగిరిపోవచ్చు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×