E-Paper
Advertisement

New Hyper Car: షియోమి అద్భుతం.. ఏకంగా హైపర్‌ కార్ కాన్సెప్ట్‌ లాంచ్ చేసింది!

New Hyper Car: షియోమి అద్భుతం.. ఏకంగా హైపర్‌ కార్ కాన్సెప్ట్‌ లాంచ్ చేసింది!
Advertisement

Xiaomi Vision Gran Turism Hypercar Concept: చైనీస్ ఆటో దిగ్గజం షియోమి మరో సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తన విజన్ గ్రాన్ టురిస్మో (GT) కాన్సెప్ట్ హైపర్‌ కార్‌ ను అధికారికంగా ఆవిష్కరించింది.   గ్రాన్ టురిస్మో నిర్మాత కజునోరి యమౌచి ఈ కాన్సెప్ట్ ను రూపొందించారు. ప్రముఖ ప్లే స్టేషన్ రేసింగ్ గేమ్ గ్రాన్ టురిస్మో 7 కోసం ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ కార్లను రూపొందించడానికి ఆటోమేకర్లను షియోమి ఆహ్వానిస్తుంది. ఫెరారీ, పోర్షే, మెర్సిడెస్ బెంజ్ లాంటి కంపెనీలు ఉన్న ఈ ఎలైట్ గ్రూప్‌ లో చేరిన మొదటి టెక్నాలజీ బ్రాండ్ గా షియోమి గుర్తింపు తెచ్చుకుంది.

కళ్లు చెదిరేలా కారు లుక్

షియోమి విజన్ GT సొగసైన టియర్ డ్రాప్ ఆకారపు కాక్‌ పిట్, డైనమిక్ లుక్ కోసం ఎయిర్ డక్ట్స్, కటౌట్లతో లైట్ వెయిట్, డైనమిక్ లుక్ ను కలిగి ఉంటుంది. బాడీతో ఫ్యూచరిస్టిక్, ఏరోడైనమిక్స్ ఫోకస్డ్ డిజైన్‌ తో ఆకట్టుకుంటుంది. ఇది మ్యాచింగ్ యాక్సెంటెడ్ వీల్స్‌ తో లేత నీలం రంగు ఫినిషింగ్ ను కలిగి ఉంది. ఎయిర్ అవుట్‌ లెట్‌ గా పని చేసే హాలో స్టైల్ టెయిల్‌ లైట్, సీజర్ డోర్స్, షార్క్ ఫిన్ రూఫ్, T ఆకారపు హెడ్‌ లైట్లు, పెద్ద రియర్ డిఫ్యూజర్ లాంటి బోల్డ్ స్టైలింగ్ ను కలిగి ఉంది.

షియోమి విజన్ GT ఇంజిన్ పవర్..

Advertisement

ఈ కారు 0.29 డ్రాగ్ కోఎఫీషియంట్‌ను సాధించనుంది. అదే సమయంలో 1.2 డౌన్‌ ఫోర్స్‌ ను ఉత్పత్తి చేస్తుంది.  విండ్ ఫోర్స్ ను ఆప్టిమైజ్ చేయడానికి, ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి షియోమి యాక్టివ్ వేక్ కంట్రోల్ సిస్టమ్, అక్రెషన్ రిమ్స్ ను పరిచయం చేసింది. హైపర్‌ కార్ దాదాపు 1,900 హార్స్‌ పవర్‌ కు సపోర్ట్ చేస్తుంది. బలమైన శక్తిని అందించేందుకు  కార్బన్ సిరామిక్ బ్రేక్‌ లు, సెంటర్ లాక్ వీల్స్ లాంటి  అడ్వాన్స్ డ్ కాంపోనెంట్స్ ను ఉపయోగిస్తుంది.

Read Also: ఒకే ఛార్జ్ తో ఏకంగా 1,000 కి.మీ ప్రయాణం, కళ్లు చెదిరే ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది!

షియోమి విజన్ GT ఇంటీరియర్

Advertisement

షియోమి విజన్ GT ఇంటీరియర్‌ సౌకర్యం, సాంకేతికతను కలిగి ఉంటుంది. డాష్‌ బోర్డ్, సీట్లు, తలుపులు సజావుగా కలిసిపోయే కోకన్ లాంటి సోఫా రేసర్ క్యాబిన్‌ ను కలిగి ఉంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ డిస్‌ ప్లేతో సీతాకోకచిలుక ఆకారపు స్టీరింగ్ వీల్, పనోరమిక్ స్క్రీన్, షియోమి పల్స్ సిస్టమ్ ఉన్నాయి. ఈ కారు షియోమి హ్యూమన్ x కార్ x హోమ్ ఎకోసిస్టమ్‌కు కనెక్ట్ అవుతుంది. ఇది డ్రైవర్ మానసిక స్థితి, ప్రవర్తన ఆధారంగా అనుకూల డ్రైవింగ్ అనుభవావన్ని అందిస్తుంది. ఈ కాన్సెప్ట్ బార్సిలోనాలో జరిగే MWC 2026లో ప్రదర్శించబడుతుంది. త్వరలో గ్రాన్ టురిస్మో 7లోని ఆటగాళ్లకు అందుబాటులోకి వస్తుంది.

Read Also: భారత్ లో క్రేజీ ఎలక్ట్రిక్ SUV లాంచ్.. హోండా కీలక ప్రకటన!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×