E-Paper
Advertisement

Expensive Car Number Plate: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు నంబర్ ప్లేట్.. ధర అక్షరాలా రూ. 136 కోట్లు!

Expensive Car Number Plate: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు నంబర్ ప్లేట్.. ధర అక్షరాలా రూ. 136 కోట్లు!
Advertisement

World’s Most Expensive Car Number Plate: కారు కొనుగోలు చేసిన తర్వాత ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కోసం చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ధర ఎంతైనా ఫర్వాలేదు.. నచ్చిన నెంబర్ కావాలని కోరుకుంటారు కొంత మంది. అయితే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు నెంబర్ ప్లేట్ ఏది? దాని ధర ఎంత? అనే ప్రశ్న ఎప్పుడైనా ఎదురయ్యిందా? లేకపోతే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయండి.

ప్రపంచంలోనే ఖరీదైన నెంబర్ ప్లేట్ ‘P-7’  

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు నెంబర్ ప్లేట్ ‘P-7’. దీని ధర ఏకంగా 55 మిలియన్ UAE దిర్హామ్‌లు. అంటే భారత కరెన్సీలో ఏకంగా రూ. 136 కోట్లు. ఇది ప్రపంచం లోనే ఇప్పటి వరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఎమిరేట్స్ ఆక్షన్ భాగస్వామ్యంతో నిర్వహించబడిన మోస్ట్ నోబుల్ నంబర్స్  వేలం అనే ఛారిటీ కార్యక్రమంలో ఈ ధర పలికింది. మొత్తం ఆదాయాన్ని UAE ప్రభుత్వం ప్రారంభించిన ఫుడ్ సాయం కోసం వినియోగించారు.

ఈ నంబర్ ప్లేట్‌ను ఎవరు కొన్నారు?

Advertisement

‘P-7’ నెంబర్ ప్లేట్  కచ్చితమైన కొనుగోలుదారులను అధికారికంగా వెల్లడించబడలేదు. కానీ, ఒక ప్రైవేట్ బిడ్డర్ గెలిచినట్లు నివేదికలు చెప్తున్నాయి. ఈ రకమైన వేలం పాటలు తరచుగా ధనవంతులైన కలెక్టర్లు, వ్యాపార దిగ్గజాలు, ఔత్సాహికులు కొనుగోలు చేస్తారు. వారు అరుదైన, ప్రత్యేకమైన నంబర్ ప్లేట్లను స్టేటస్ సింబల్ గా భావిస్తారు. ఇందుకోసం ఎంత అయినా ఖర్చు చేస్తారు.

ఈ వేలం పాటలు ఎలా నిర్వహిస్తారు?

UAEలో, హై ఎండ్ వెహికిల్స్ ప్లేట్ల కోసం వేలం పాటలు తరచుగా జరుగుతుంటాయి. ఈ ఈవెంట్లను సాధారణంగా ఎమిరేట్స్ ఆక్షన్ లేదంటే రవాణా అధికారులకు ఆధ్వర్యంలో ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తాయి. వేలం పాటలో సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్, ప్రత్యేక కాంబినేషన్ ప్లేట్లు ఉంటాయి. పాల్గొనేవారు ముందుగానే నమోదు చేసుకుంటారు. ఒకదాని తర్వాత మరొకటి వేలం వేస్తారు. అత్యధిక ఆఫర్ గెలిచే వరకు వేలం కొనసాగుతుంది.

Advertisement

చాలా నంబర్ ప్లేట్లను ఛారిటీ కోసం లేదంటే ముఖ్యమైన సీజన్లలో ఫుడ్ డొనేషన్ కోసం ఉపయోగిస్తారు. ప్రజా అవసరాలను తీర్చేందుకు వీటిని వేలం వేస్తుంటారు. ఇతర వేలం పాటలు ప్రైవేట్ కలెక్టర్లు, పెట్టుబడిదారులకు అరుదైన ప్లేట్లను అమ్మడానికి మాత్రమే నిర్వహించబడతాయి.

ధరను ప్రభావితం చేసే అంశాలు

నంబర్ ప్లేట్ ఎంత ధరను పలు అంశాలు ప్రభావితం చేస్తాయి. తక్కువ అంకెలు, ప్రత్యేక నమూనాలతో ప్లేట్లను పొందడం చాలా కష్టం. వాటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. సింగిల్ డిజిట్ ప్లేట్లు చాలా అరుదు. అందుకే వాటి ధర చాలా ఉంటుంది. కొన్ని సంఖ్యలు సాంస్కృతిక, వ్యక్తిగత, సింబాలిక్ ప్రాముఖ్యతను కలిగి  ఉంటాయి. ఇవి కూడా ఎక్కువ ధర పలుకుతాయి. ప్రత్యేకమైన నెంబర్ ప్లేట్ కలిగి ఉండటం సంపద, ప్రత్యేకతను సూచిస్తుంది. ముఖ్యంగా లగ్జరీ కార్ కమ్యూనిటీలలో ఈ ప్లేట్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది.

Read Also:  కొత్త కారు కొంటున్నారా? ఈ 8 ఫీచర్లు కచ్చితంగా ఉండేలా చూసుకోండి!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×