// // Hummer H1 X3: ఇది కారు కాదు, చక్రాలపై నడిచే భవంతి.. ఎవరి కోసం తయారు చేశారో తెలుసా? -->
E-Paper
Advertisement

ఇది కారు కాదు, చక్రాలపై నడిచే భవంతి.. ఎవరి కోసం తయారు చేశారో తెలుసా?

ఇది కారు కాదు, చక్రాలపై నడిచే భవంతి.. ఎవరి కోసం తయారు చేశారో తెలుసా?
Advertisement

Guinness Record Giant Hummer H1 X3: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధినేత షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. రెయిన్‌బో షేక్ గా ప్రసిద్ధి చెందిన ఆయన ప్రత్యేకంగా తయారు చేయించిన కారు హమ్మర్ H1 X3. ప్రపంచంలోనే అత్యంత భారీ కస్టమ్ వాహనాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. సాధారణ హమ్మర్ H1తో పోలిస్తే.. ప్రతి కొలతలో మూడు రెట్లు పెద్దగా ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీని పరిమాణం, నిర్మాణం, అంతర్గత సౌకర్యాలు అన్నీ కలిపి చూస్తే, దీనిని వాహనం అనడం కంటే.. కదిలే భవనం అనడం బెస్ట్.

హమ్మర్ H1 X3 గురించి..

హమ్మర్ H1 X3 వాహనం సుమారు 14 మీటర్ల పొడవు, 6.6 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇంత భారీ పరిమాణం ఉన్నప్పటికీ, చక్కగా పని చేస్తుంది. దీనిని యూఎస్ ఆర్మీకి చెందిన LARC-LX అనే నీళ్లలో, నీటి మీద నడిచే వెహికల్  ఫ్రేమ్‌ మీద నిర్మించారు. ఇందులో నాలుగు డీజిల్ ఇంజన్లు ఉంటాయి. ప్రతి వీల్ కు ఒకటి చొప్పున అమర్చారు. ఈ సెటప్ వాహనాన్ని ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ తో నడిచేలా చేస్తుంది. అయితే, దీని భారీ బరువు కారణంగా గరిష్ట వేగం గంటకు సుమారు 30–32 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది.

ప్రత్యేకమైన ఇంటీరియర్

Advertisement

హమ్మర్ H1 X3 లోపలి భాగం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది రెండు అంతస్తులతో నిర్మించబడింది. మొదటి అంతస్తులో టాయిలెట్, సింక్, మెట్లు ఉంటాయి. రెండవ అంతస్తులో సాంప్రదాయ అరబిక్ స్టైల్ మజ్లిస్, అతిథుల కోసం లాంజ్,  డ్రైవింగ్ క్యాబిన్ ఉంటాయి. పై అంతస్తు నుంచి 360 డిగ్రీల వ్యూస్ కనిపించేలా డిజైన్ చేశారు. అంతర్గతంగా చెక్క ఫ్లోరింగ్, విలాసవంతమైన ఇంటీరియర్‌ తో ఓ మోటార్ హోమ్‌లా కనిపిస్తుంది. వాహనంలోకి ఎక్కడానికి కింద నుంచి ముడుచుకునే నిచ్చెన ఉంటుంది.

సాధారణ రోడ్లపై వినియోగం కష్టం

ఈ వాహనం కేవలం ప్రదర్శన కోసం మాత్రమే కాదు.. నిజంగా నడిచే సామర్థ్యం కలిగి ఉండటం దీని ప్రత్యేకత. అయితే, దీన్ని సాధారణ రోడ్లపై వినియోగించడం కష్టం. అందుకే ఈ వాహనం ఎక్కువగా ప్రదర్శనలకే పరిమితం అవుతోంది.

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి..

Advertisement

హమ్మర్ H1 X3, షేక్ హమద్ సేకరించిన 700కు పైగా 4×4 వాహనాల్లో ఒకటి. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ లో కూడా చోటు సంపాదించింది. ప్రస్తుతం ఈ భారీ వాహనం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ లోని షార్జా ఆఫ్ రోడ్ హిస్టరీ మ్యూజియంలో ప్రదర్శనలో ఉంది. హమ్మర్ H1 X3 అనేది కేవలం వాహనం మాత్రమే కాదు, ఇంజనీరింగ్, విలాసం, విభిన్న ఆలోచనల కలయికగా రూపొందిన అద్భుత సృష్టిగా చెప్పుకోవచ్చు. ఇది ప్రపంచంలోనే అత్యంత విభిన్నమైన, ఆకర్షణీయమైన వాహనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

Read Also: రూ.50 లక్షల్లో బెస్ట్ SUVలు.. ఈ టాప్ 5 మోడల్స్ మిస్ అవ్వకండి!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×