E-Paper
Advertisement

Sitting in Car: గమ్యానికి చేరినా కాసేపు కారులోనే కూర్చుంటున్నారా? సైకాలజీ చెప్పే షాకింగ్ నిజాలు ఇవే!

Sitting in Car: గమ్యానికి చేరినా కాసేపు  కారులోనే కూర్చుంటున్నారా? సైకాలజీ చెప్పే షాకింగ్ నిజాలు ఇవే!
Advertisement

కారు నడిపే చాలా మందికి ఓ కామన్, క్రేజీ అలవాటు ఉంటుంది. ఎక్కడికైనా వెళ్లి కారు పార్క్ చేసిన తర్వాత, వెంటనే బయటకు రావకుండా కొంతసేపు అదే కారులో కూర్చుని ఉంటారు. అది రెండు నిమిషాలు కావచ్చు. అరగంట కూడా కావచ్చు. ఈ సమయంలో కొందరు  ఫోన్‌ లో స్క్రోల్ చేస్తారు.  మరికొందరు పాటలు వింటారు. ఇంకొందరు ఏమీ చేయకుండా సైలెంట్ గా కూర్చుంటారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో కూడా ఈ అలవాటు గురించి చాలామంది మాట్లాడుతున్నారు. పనికి వెళ్లినా, ఇంటికి వచ్చినా, జిమ్‌కి చేరుకున్నా, డెస్టినేషన్ కు చేరుకున్న తర్వాత కూడా కొంతసేపు కారులోనే ఉండిపోవడం చాలా మందికి కామన్ అయిపోయింది.

ఇలా ఎందుకు చేస్తారంటే?

ఇలా ఎందుకు చేస్తారనే అంశానికి సంబంధించి ఓ సైకాలజికల్ కారణం ఉంది. మన రోజువారీ జీవితంలో ఒక పని నుంచి మరొక పనికి మారేటప్పుడు, మనసుకు కొంత సమయం అవసరం అవుతుంది. పని ముగించుకుని ఇంటికి వచ్చేటప్పుడు ఆఫీస్ ఒత్తిడిని వెంటనే వదిలేయడం కష్టం. అప్పుడు కారులో కూర్చునే ఆ కొద్ది నిమిషాలు మనసుకు ఒక చిన్న బ్రేక్‌లా పని చేస్తాయి. ఇది ఒక దశ నుంచి మరో దశకు మారడానికి మధ్యలో ఉండే చిన్న ఆహ్లాదకర సమయం లాంటిది.

కారులో ఒంటరిగాకూర్చుంటే ఇన్ని లాభాలా?

Advertisement

కారు ఓ ప్రత్యేకమైన ప్రదేశం కూడా. అక్కడ ఒంటరిగా ఉంటారు. నచ్చినట్టుగా ఉండవచ్చు. మ్యూజిక్ పెట్టుకోవచ్చు. కిటికీలు మూసుకోవచ్చు. ఎవరూ ఇబ్బంది పెట్టరు. అందుకే చాలా మందికి కారు  చిన్న వ్యక్తిగత స్థలంలా భావిస్తారు. ఈ చిన్న విరామం సరైన విధంగా ఉపయోగిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొద్ది నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మనసు రిలాక్స్ అవుతుంది.  తర్వాతి పనికి సిద్ధమవ్వడం ఈజీ అవుతుంది. కొందరు ఈ సమయంలో ఆ రోజు జరిగిన విషయాల గురించి ఆలోచిస్తారు. ఇంకొందరు ముందున్న పనుల కోసం ప్లాన్ చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.

మంచితో పాటు చెడుకూడా!

ఈ అలవాటు ఎప్పుడూ మంచిదే అనుకోవద్దు. మీరు కారులో కూర్చుని ఫోన్‌ లో నిరంతరం స్క్రోల్ చేస్తూ, టెన్షన్ కలిగించే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే, రిలాక్స్ కాకుండా మరింత ఒత్తిడిని పెంచుతుంది. అప్పుడు ఆ విరామం ఉపయోగం ఉండదు. అందుకే, ఈ సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నామో గమనించడం ముఖ్యం. ఇష్టమైన పాట వినడం, సైలెంట్‌ గా కూర్చుని మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం లాంటి పనులు చేయాలి. ఐదు నిమిషాలైనా సరే, మనసుకు రిలాక్స్ అయ్యేలా ఉండాలి. సరైన విధంగా ఉపయోగిస్తే, ఈ చిన్న అలవాటు రోజును మరింత ప్రశాంతంగా మార్చే అవకాశం ఉంటుంది.

Advertisement

Read Also: ఓర్ని.. హ్యూందాయ్ i10 కారును ఇలా మార్చేశారా? వీడియో చూస్తే షాకవుతారు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×