E-Paper
Advertisement

8 చక్రాల క్రేజీ కారు.. వింతైన ఆవిష్కరణ ఎందుకు విఫలమైంది?

8 చక్రాల క్రేజీ కారు.. వింతైన ఆవిష్కరణ ఎందుకు విఫలమైంది?
Advertisement

World’s Most Unique Car OctoAuto:  ఆటోమొబైల్ చరిత్రలో ఎన్నో విచిత్రమైన ప్రయోగాలు జరిగాయి. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది ఎనిమిది చక్రాల  ఆక్టోఆటో  వెహికల్. ఇది సాధారణ కార్లకు పూర్తిగా భిన్నంగా, ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చాలనే ఉద్దేశంతో దీనిని రూపొందించబడింది. 1900 ప్రారంభంలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అప్పటి కార్లలో సస్పెన్షన్ సిస్టమ్ కూడా బలంగా ఉండేది కాదు. ప్రయాణం చాలా అసౌకర్యంగా ఉండేది. ఈ సమస్యను పరిష్కరించాలనే ఆలోచనతో అమెరికాకు చెందిన క్రియేటర్ మిల్టన్ రీవ్స్ 1911లో ఆక్టోఆటోను రూపొందించారు.

8 వీల్స్ లో విచిత్రమైన లుక్

ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే, దీనికి ఎనిమిది వీల్స్ ఉంటాయి. సాధారణంగా కార్లకు నాలుగు చక్రాలు ఉంటాయి. కానీ, ఆక్టోఆటోలో నాలుగు యాక్సిల్స్‌ పై ఎనిమిది చక్రాలు అమర్చారు. ముందు భాగంలో రెండు యాక్సిల్స్ ఉండి స్టీరింగ్‌ కు లింకై ఉంటాయి. వెనుక భాగంలో మరో రెండు యాక్సిల్స్ ఉండేవి. ఇందులో ఒక యాక్సిల్ మాత్రమే డ్రైవ్ కోసం పనిచేసేది. ఈ నిర్మాణం వాహన బరువును సమానంగా పంచడానికి ఉపయోగపడుతుంది. రీవ్స్ ఆలోచన ప్రకారం, చక్రాల సంఖ్య పెరిగితే రోడ్డుపై వచ్చే గాట్లు, కుదుపులు తక్కువగా ప్రభావితం చేస్తాయి. ప్రయాణం సాఫీగా ఉంటుంది. అలాగే టైర్లపై పడే ఒత్తిడి కూడా తగ్గి అవి ఎక్కువకాలం పని చేస్తాయని భావించారు. ఈ కారణంగా ఆక్టోఆటోను ప్రపంచంలోనే అత్యంత సౌకర్యవంతమైన కారుగా ప్రచారం చేశారు.

ప్రజాదరణ అంతంత మాత్రమే!

Advertisement

ఈ కారును 1922లో జరిగిన ఇండియానాపోలిస్ 500 రేస్ సందర్భంగా ప్రజలకు పరిచయం చేశారు. అక్కడ ఈ కారు తన ప్రత్యేక డిజైన్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా మంది దీనిని ఆసక్తిగా చూశారు. అయితే, ఆసక్తి ఉన్నంతగా కొనుగోలు మాత్రం జరగలేదు. దానికి ప్రధాన కారణం ధర ఎక్కువగా ఉండటం. అప్పట్లో ఆక్టోఆటో ధర సుమారు 3,200 డాలర్లు ఉండేది. అదే సమయంలో ఫోర్డ్ మోడల్ టి లాంటి కార్లు చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉండేవి. అందువల్ల ప్రజలు చౌకైన వాహనాలవైపు మొగ్గు చూపారు.

అంతేకాదు, ఈ కారును నడపడం కూడా సులభం కాదు. ఎనిమిది చక్రాల నిర్మాణం వల్ల డ్రైవింగ్ కాస్త క్లిష్టంగా మారింది. తర్వాత రీవ్స్ ఈ సమస్యను తగ్గించడానికి ఆరు చక్రాల సెక్స్టోఆటోను కూడా ప్రయత్నించారు. అయినప్పటికీ, మార్కెట్లో పెద్దగా ఆదరణ లభించలేదు. ఇప్పటికీ ఆక్టోఆటో ఒక విఫలమైన ప్రయోగంగా కాకుండా, వినూత్న ఆలోచనకు ఉదాహరణగా గుర్తించబడుతోంది. ఆ కాలంలోనే సౌకర్యాన్ని మెరుగుపరచాలనే ప్రయత్నం ఎంత ముందుచూపుతో జరిగిందో ఈ వాహనం చూపిస్తుంది. ఆధునిక కార్లలో కనిపించే సస్పెన్షన్ సిస్టమ్స్, స్మూత్ రైడ్ టెక్నాలజీలకు ఇవి పరోక్షంగా మార్గం సుగమం చేశాయని చెప్పవచ్చు. ఈ కారు ఆటోమొబైల్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.

Advertisement

Read Also: ఒక్కసారే.. ఎక్కడికక్కడ ఆగిపోయిన వందలాది ట్యాక్సీలు.. ఓర్నీ ఇలా కూడా అవుతుందా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×