E-Paper
Advertisement

Rolls-Royce Cars: రోల్స్ రాయిస్ కార్లకు ఎందుకు అంత ధర.. అల్టిమేట్ లగ్జరీ వెనుక రహస్యం ఇదే!

Rolls-Royce Cars: రోల్స్ రాయిస్ కార్లకు ఎందుకు అంత ధర.. అల్టిమేట్ లగ్జరీ వెనుక రహస్యం ఇదే!
Advertisement

ప్రపంచ వ్యాప్తంగా రోల్స్ రాయిస్ కార్లుకు ఉన్న విలువ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అద్భతమైన లగ్జరీ, క్రాఫ్ట్స్ మాన్సిప్, ప్రెస్టీజ్ కు పర్యాయపదంగా కొనసాగుతోంది. మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి లాంటి లగ్జరీ బ్రాండ్లకు మార్కెట్ లో మంచి ఆదరణ ఉన్నప్పటికీ, రోల్స్ రాయిస్ ముందు ఆ కార్లు తట్టుకోలేవని చెప్పుకోవచ్చు. ప్రత్యేకత, లెగసీని కోరుకునే వాళ్లు ఈ కార్లను కొనుగోలు చేస్తారు. అయితే, రోల్స్ రాయిస్ కార్లకు అంత ఎక్కువ ధర ఎందుకు ఎక్కువగా ఉంటుంది? ధరను ప్రభావితం చేసే అంశాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ ప్రతి కారు చేతితో నిర్మించబడుతుంది!

ప్రతి రోల్స్ రాయిస్ చేతితో ప్రత్యేకంగా రూపొందించబడుతుంది. కొనుగోలుదారుడి నచ్చినట్లుగా తయారు చేయబడుతుంది. రోల్స్ రాయిస్ కు చెందిన ఏ రెండు కార్లు ఒకేలా ఉండవు. డిజైన్ నుంచి ఫైనల్ పాలిష్ వరకు  ఏకంగా ఆరు నెలల వరకు టైమ్ తీసుకుంటుంది. ఓ రోల్స్ రాయిస్ కారు తయారీకి మాన్యువల్ గా వందల గంటల పని చేయాల్సి ఉంటుంది.  నిపుణులైన కళాకారులు తోలు అప్హోల్స్టరీని చేతితో కుట్టడం, చెక్క వెనీర్లను చేతితో పాలిష్ చేయడం, సిగ్నేచర్ కోచ్‌లైన్ పిన్‌స్ట్రైప్‌ను చేతితో పెయింట్ చేయడం లాంటి పనులు ఉంటాయి. అత్యంత పాపులర్ టచ్‌లలో ఒకటి స్టార్‌ లైట్ హెడ్‌ లైనర్.  ఇక్కడ 1,600 కంటే ఎక్కువ ఫైబర్ ఆప్టిక్ లైట్లను ఒక్కొక్కటిగా రూఫ్ లైనింగ్‌లో ఉంచి రాత్రి ఆకాశాన్ని ప్రతిబింబించే కస్టమ్ కాన్స్టెలేషన్‌ను క్రియేట్ చేస్తారు. పెయింట్ ప్రక్రియకు కూడా చాలా సమయం పడుతుంది. అద్దం లాంటి ఫినిషింగ్ కోసం 22 లేయర్స్ పాలిష్ చేస్తారు. ఇందు కోసం 10 వారాల సమయం పడుతుంది. కొనుగోలుదారులు 44,000 కంటే ఎక్కువ పెయింట్ షేడ్స్ నుంచి నచ్చిన కలర్ ను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

⦿ మ్యాజిక్ కార్పెట్ రైడ్ ఎక్స్ పీరియెన్స్  

Advertisement

రోల్స్ రాయిస్ వేగం, ట్రాక్ పనితీరుపై ఫోకస్ పెట్టదు.  సౌకర్యం, నిశ్శబ్దం మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. బ్రాండ్ సిగ్నేచర్ V12 ఇంజిన్ అత్యంత స్మూత్ గా ఉంటుంది. చక్కటి పవర్ ను అందిస్తుంది. కారు అధునాతన ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్ ముందు ఉన్న రోడ్డును స్కాన్ చేస్తుంది. గుంతల రోడ్డు ఉన్నప్పటికీ ఆటో మేటిక్ గా సర్దుబాటు చేసుకుంటుంది.  ప్రయాణీకులు గాలిలో జారుతూ ప్రయాణిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే మ్యాజిక్ కార్పెట్ రైడ్ లా ఉంటుంది. ప్రతి రోల్స్ రాయిస్ కారు మంచి సౌండ్‌ ప్రూఫింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ప్రత్యేక ఇన్సులేషన్ మెటీరియల్స్,  డబుల్ గ్లేజ్డ్ విండోలను కలిగి ఉంటుంది. కారు ఎక్కువ వేగంతో వెళ్లినప్పటికీ, క్యాబిన్‌లోకి ఎలాంటి శబ్దం రాదు.

⦿ ప్రతిష్ట, హోదాకు చిహ్నం

రోల్స్ రాయిస్ ఇంజనీరింగ్, నైపుణ్యం అనేది కొనుగోలుదారుడి ప్రతిష్ట హోదాకు చిహ్నంగా ఉంటుంది. ఈ కారుకు ఎక్కువ ధర ఉండటానికి కేవలం ప్రొడక్షన్ ఖర్చుల గురించి మాత్రమే కాదు, బ్రాండ్ ఎలైట్ ఇమేజ్ కు గుర్తింపును కూడా తెలియజేస్తుంది. చాలా మంది కొనుగోలుదారులకు, రోల్స్ రాయిస్ ను కేవలం రవాణా కోసం వాడరు. సక్సెస్, ఇండివిజువాలిటీకి స్టేటస్ గా భావిస్తారు. ఈ కారు రేరిటీ, పర్సనలైజేషన్, సింబాలిక్ వ్యాల్యూ దాన్ని అమూల్యమైనదిగా మర్చేస్తాయి.

Advertisement

Read Also:  టాటా సియెర్రా vs న్యూ కియా సెల్టోస్, ఏ కారు బెస్ట్ అంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×