// //
The Science Behind Green Road Signs: హైవే మీద ప్రయాణిస్తున్నప్పుడు సైన్ బోర్డులు కనిపిస్తాయి. ఇవి సాధారణంగా ఆకుపచ్చ కలర్ లో ఉంటాయి. చాలా మంది పెద్దగా వీటి కలర్ గురించి పట్టించుకోరు. కానీ, హైవే మీద సైన్ బోర్డులన్నీ గ్రీన్ కలర్ లోనే ఉంటాయి. ఈ కలర్ సెలెక్షన్ వెనుక స్పష్టమైన కారణాలు ఉన్నాయి. ట్రాఫిక్ కంట్రోల్, భద్రత, డ్రైవర్ సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆకుపచ్చ రంగును ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం గ్రీన్ కలర్ ఉపయోగించడం వెనుక అసలు రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
గ్రీన్ కలర్ ప్రధానంగా డైరెక్షన్స్, రూట్ సమాచారం కోసం ఉపయోగిస్తారు. హైవేలపై, ప్రధాన రహదారులపై నగరాల పేర్లు, దూరాలు, ఎగ్జిట్ మార్గాలు ఆకుపచ్చ బోర్డులపైనే కనిపిస్తాయి. డ్రైవర్‌కు ఇది చూసిన వెంటనే ఈజీగా సమాచారం తెలిసిపోతుంది. గందరగోళం లేకుండా ప్రయాణం కొనసాగించే అవకాశం ఉంటుంది.
గ్రీన్ కలర్ అనేది దూరం నుంచే స్పష్టంగా కనిపిస్తుంది. గ్రీన్ కలర్ మీద తెల్ల అక్షరాలు ఉండటం వల్ల కంటికి ఈజీగా పడతాయి. ముఖ్యంగా హైవేలపై వేగంగా వెళ్తున్నప్పుడు, డ్రైవర్‌కు ముందుగానే సమాచారం తెలిసేలా సాయపడుతుంది. అకస్మాత్తుగా బ్రేక్ వేయడం, లేన్ మార్చడం తగ్గుతుంది.
హైవే రకం గుర్తించడంలో ఉపయోగపడుతుంది. సాధారణంగా ఆకుపచ్చ బోర్డులు జాతీయ, రాష్ట్ర హైవేలను సూచిస్తాయి. పట్టణ ప్రాంతాల్లో అయితే నీలం రంగు బోర్డులు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ రంగుల ద్వారా డ్రైవర్ తన ప్రయాణం ఏ రహదారిపై కొనసాగుతుందో వెంటనే అర్థం చేసుకుంటాడు.
ఆకుపచ్చ రంగు మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఎరుపు, పసుపు రంగులు హెచ్చరికలకు ఉపయోగిస్తారు. అవి కాస్త టెన్షన్ కలిగిస్తాయి. కానీ, ఆకుపచ్చ రంగు మాత్రం చూడ్డానికి సౌకర్యంగా ఉంటుంది. దీర్ఘకాల ప్రయాణంలో డ్రైవర్ అలసట తగ్గించడంలో సాయపడుతుంది.
అంతర్జాతీయ ప్రమాణాలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి అనేక దేశాల్లో కూడా డైరెక్షన్స్ సైన్ బోర్డుల కోసం గ్రీన్ కలర్ ను ఉపయోగిస్తారు. ఈ కారణంగా ఇతర దేశాల డ్రైవర్లు కూడా భారత రహదారులపై సులభంగా ప్రయాణించగలుగుతారు.
మొత్తంగా హైవే సైన్ బోర్డుల కలర్ అనేది అనుకోకుండా ఉపయోగించిన కలర్ కాదు. భద్రత, స్పష్టత, డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరచడం కోసం ప్రత్యేకంగా సెలెక్ట్ చేశారు. రహదారిపై ఆకుపచ్చ బోర్డు, కేవలం ఒక సైన్ మాత్రమే కాదు, ప్రయాణాన్ని సులభంగా, సురక్షితంగా చేసే ఒక ముఖ్యమైన మార్గదర్శి అని గుర్తుంచుకోవాలి.