E-Paper
Advertisement

అల్యూమినియం ఫాయిల్ లో కారు కీ.. దొంగలకు ముచ్చెమటలు పట్టాల్సిందే!

అల్యూమినియం ఫాయిల్ లో కారు కీ.. దొంగలకు ముచ్చెమటలు పట్టాల్సిందే!
Advertisement

The Foil Trick for Car Keys: గత కొద్ది కాలంగా చాలా మంది డ్రైవర్లు తమ కారు తాళాలను అల్యూమినియం ఫాయిల్‌ లో చుట్టిపెట్టడం కనిపిస్తోంది. చూడ్డానికి వింతగా అనిపించినా, దాని వెనుక ఓ కీలకమైన కారణం ఉంది. ప్రస్తుత కార్లలో ఉన్న కీలెస్ ఎంట్రీ సిస్టమ్‌ ను దుర్వినియోగం చేస్తూ దొంగలు కొత్త పద్ధతుల్లో వాహనాలను దొంగిలిస్తున్నారు. ముఖ్యంగా రిలే దాడులతో కారు యజమానులకు తెలియకుండానే వాహనాలు అన్‌ లాక్ అవుతున్నాయి.

ఏంటీ కీలెస్ ఎంట్రీ సిస్టమ్

కీలెస్ ఎంట్రీ సిస్టమ్ అనేది తాళం లేకుండానే కారు తలుపులు తెరవడానికి ఉపయోగించే టెక్నాలజీ. కీ ఫాబ్ నుంచి సిగ్నల్స్ వెలువడుతూ ఉంటాయి. కారు దగ్గరికి వచ్చినప్పుడు ఆ సిగ్నల్‌ ను గుర్తించి తలుపులు ఆటోమేటిక్‌ గా అన్‌లాక్ అవుతాయి. ఇది సౌకర్యంగా అనిపించినా, అదే సిస్టమ్‌ను దొంగలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రిలే దాడిలో సాధారణంగా ఇద్దరు వ్యక్తులు పనిచేస్తారు. ఒకరు కారు దగ్గర ఉంటే, మరొకరు కీ ఫాబ్ ఉన్న ఇంటి దగ్గర ఉంటారు. వారు ప్రత్యేక పరికరాలతో కీ ఫాబ్ నుంచి వచ్చే సిగ్నల్‌ను పట్టుకుని,  వాటిని కారుకు పంపిస్తారు. దీంతో కారు యజమాని దగ్గరే కీ ఉందని భావించి తలుపులు తెరుచుకుంటాయి. ఈ విధంగా ఎలాంటి గాజు పగలగొట్టకుండానే కారు లోపలికి వెళ్లడం, దొంగతనం చేయడం ఈజీగ అవుతుంది.

అల్యూమినియం ఫాయిల్‌ తో లాభం ఏంటి?

Advertisement

ఈ దొంగతనాల నుంచి బయటపడేందుకు కొంతమంది డ్రైవర్లు అల్యూమినియం ఫాయిల్‌ ను ఉపయోగిస్తున్నారు. కీ ఫాబ్‌ ను ఫాయిల్‌ తో చుట్టడం ద్వారా అది ఫారడే కేజ్ లా పని చేస్తుంది. అంటే, కీ నుంచి వచ్చే రేడియో సిగ్నల్స్ బయటకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఇలా చేస్తే దొంగలు ఆ సిగ్నల్‌ను పట్టుకోవడం కష్టమవుతుంది.  ఇది పూర్తిగా సురక్షితమైన పరిష్కారం కాదు. ఫాయిల్‌ ను సరైన విధంగా చుట్టకపోతే చిన్న గ్యాప్‌ ల ద్వారా కూడా సిగ్నల్స్ బయటకు వెళ్లే అవకాశం ఉంది. అందుకే ఫాయిల్‌ ను బాగా కప్పి, పూర్తిగా మూసివేయడం ముఖ్యం. కీని ఫాయిల్‌ లో ఉంచి కార్ దగ్గరకు వెళ్లి చూడాలి. కారు అన్‌ లాక్ కాకపోతే, అప్పుడు ఇది పని చేస్తున్నట్టు అర్థం.

తాళాలను జాగ్రత్తగా భద్రపరచాలి!

తాళాలను ఇంటి తలుపులు, కిటికీల దగ్గర ఉంచకూడదు. అక్కడ ఉంచితే బయట ఉన్న దొంగలు సిగ్నల్‌ ను సులభంగా గుర్తిస్తారు. చగలరు. వీలైనంత లోపల, సురక్షితమైన ప్రదేశంలో ఉంచడం మంచిది. భద్రత కోసం ఫాయిల్ మీదే ఆధారపడకూడదు. నిపుణులు చెప్పినట్లుగా, సిగ్నల్ బ్లాకింగ్ పౌచ్‌ లు వాడటం, అవసరంలేనప్పుడు కీ ఫాబ్‌ ను ఆఫ్ చేయడం, అలాగే కారులోని భద్రతా ఫీచర్లను అప్‌ డేట్‌ గా ఉంచడం మంచిది. చిన్న జాగ్రత్తలు కూడా పెద్ద సమస్యలను నివారిస్తాయి.

Advertisement

Read Also: హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మోడల్స్ పై ఏకంగా రూ. 2.12 లక్షల తగ్గింపు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×