E-Paper
Advertisement

కారు రూఫ్ డిజైన్‌ లో గీతలు.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోకతప్పదు!

కారు రూఫ్ డిజైన్‌ లో గీతలు.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోకతప్పదు!
Advertisement

Car Roof Lines Explained: కారు పైకప్పుపై కనిపించే పొడవాటి గీతలు లేదంటే గట్లను చూసి చాలా మందికి కేవలం డిజైన్ కోసం పెట్టినవిగా భావిస్తారు. కానీ, వాస్తవానికి ఇవి కారు నిర్మాణంలో కీలక పాత్ర పోషించే పార్ట్స్. మేకర్స్ వీటిని స్పష్టమైన ఉద్దేశంతోనే రూపొందించారు.

ఇంతకీ ఆ గీతల వెనుక కారణం ఏంటి?

ఈ ఉబ్బెత్తు గీతలు కారు బాడీ బలాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఒక సాదా, పూర్తిగా చదునైన మెటల్ షీట్‌ పై ఒత్తిడి పడితే అది ఈజీగా వంగిపోతుంది. కానీ, అదే ఉపరితలంపై చిన్న గీతలు, ఉబ్బెత్తు ఆకారాలు ఉంటే, మరింత దృఢంగా మారుతుంది. దీంతో అదనపు బరువు పెంచకుండా కారు బలం పెరుగుతుంది. ప్రమాదాల సమయంలో, ముఖ్యంగా వాహనం బోల్తా పడినప్పుడు, బలమైన పైకప్పు ప్రయాణికుల భద్రతకు తోడ్పడుతుంది.

వెయిట్ కంట్రోల్

Advertisement

ఇక మరో ముఖ్యమైన అంశం బరువు నియంత్రణ. కార్లను తయారు చేసే సమయంలో తక్కువ బరువుతో ఎక్కువ బలం కలిగించడం ఇంజనీరింగ్‌ లో పెద్ద సవాలు. మందమైన ఇనుమును వాడితే బలం పెరుగుతుంది. కానీ, బరువు కూడా పెరుగుతుంది. అలాంటి పరిస్థితిలో, పలుచని లోహాన్ని ఉపయోగించి కూడా బలంగా ఉండేలా ఈ ఉబ్బెత్తు గీతలు ఉపయోగపడతాయి. దీనివల్ల కారు తేలికగా ఉండి ఇంధన వినియోగం కూడా తగ్గుతుంది.

వర్షం నీరు కిందికి జారేలా…

ఇక వర్షాకాలంలో కూడా ఈ గట్లు ఉపయోగకరంగా ఉంటాయి. పూర్తిగా స్మూత్‌గా ఉన్న పైకప్పుపై నీరు నిలిచిపోవచ్చు. కానీ, గట్లు ఉన్నప్పుడు నీరు సులభంగా కిందికి జారిపోతుంది. దీంతో నీరు నిలవకుండా ఉండటమే కాకుండా, కారు లోపలికి చొరబడే ప్రమాదం కూడా తగ్గుతుంది.

రూఫ్ రైల్స్ ఏర్పాటుకు అనుకూలంగా..

Advertisement

ఇకపై, రూఫ్ రైల్స్, లగేజ్ క్యారియర్లు, ఇతర యాక్సెసరీస్ అమర్చే సందర్భంలో కూడా ఈ గట్లు బాగా ఉపయోగపడతాయి. అవి బరువును సమానంగా పంచడంలో సహాయపడటంతో పాటు, పైకప్పుకు అదనపు సపోర్టును అందిస్తాయి.  దీని వల్ల ప్రయాణాల్లో పైకప్పుపై సామాను తీసుకెళ్లడం మరింత సేఫ్ గా ఉంటుంది.

స్టైలిష్ లుక్ కోసం

డిజైన్ పరంగా కూడా ఈ గట్లు ఒక ప్రత్యేక ఆకర్షణను ఇస్తాయి. పూర్తిగా సాదా  పైకప్పు కంటే, ఈ చిన్న గీతలు వాహనానికి కొంచెం స్టైలిష్ లుక్‌ను తీసుకువస్తాయి. అయితే, వీటి అసలు ప్రయోజనం మాత్రం అందం కంటే ఎక్కువగా పనితీరులోనే ఉంటుంది. మొత్తంగా కారు పైకప్పుపై ఉండే ఈ గట్లు కేవలం అలంకరణ కోసం మాత్రమే కావు. వాహనం బలం, భద్రత, బరువు నియంత్రణ, యాక్సెసరీస్ మద్దతు లాంటి అనేక కీలక అంశాల్లో సహాయపడతాయి.

Read Also: సమ్మర్ లో లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తున్నారా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 7 విషయాలు మర్చిపోకండి!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×