E-Paper
Advertisement

పెట్రోల్ కారులో పొరపాటున డీజిల్ పోశారా? వెంటనే చేయాల్సిన పని ఇదే!

పెట్రోల్ కారులో పొరపాటున డీజిల్ పోశారా? వెంటనే చేయాల్సిన పని ఇదే!
Advertisement

Wrong Fuel Alert: పెట్రోల్ బంక్‌ లో తొందరపాటు, అజాగ్రత్త వల్ల కొన్నిసార్లు పొరపాటుగా ఫ్యూయల్ నింపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెట్రోల్ కారులో పొరపాటున డీజిల్ పోయడం చాలా మంది డ్రైవర్లు చేసే సాధారణ తప్పిదాల్లో ఒకటి. అయితే, ఈ పొరపాటు జరిగినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే సరైన చర్యలు తీసుకుంటే సేఫ్ గా బయటపడే అవకావం ఉంటుంది.   ఇంతకీ ఏం చేయాలంటే?

పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు ఎలా పనిచేస్తాయంటే?

ముందుగా పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. పెట్రోల్ ఇంజిన్‌లో స్పార్క్ ప్లగ్‌ లు పని చేసి ఇంధనాన్ని మండిస్తాయి. పెట్రోల్ చాలా పలుచగా ఉండి త్వరగా ఆవిరవుతుంది. కానీ, డీజిల్ ఇంజిన్ పూర్తిగా భిన్నంగా పనిచేస్తుంది. ఇందులో స్పార్క్ ప్లగ్‌లు ఉండవు. అధిక ఒత్తిడి, వేడి కారణంగా డీజిల్ స్వయంగా మండుతుంది. అంతేకాదు డీజిల్ మందంగా, జిడ్డుగా ఉంటుంది.  అందుకే పెట్రోల్ ఇంజిన్‌ లో డీజిల్ సరిగా పనిచేయదు. డీజిల్ ఫ్యూయల్ సిస్టమ్‌ లోకి వెళ్లిన తర్వాత చాలా సమస్యలు ఏర్పడుతాయి.

Advertisement

ముందుగా, డీజిల్ కారణంగా ఫ్యూయల్ ఫిల్టర్, ఫ్యూయల్ ఇంజెక్టర్లు మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే స్పార్క్ ప్లగ్‌ లపై నూనె లాంటి పొర ఏర్పడి అవి సరిగా పనిచేయకుండా చేస్తుంది. ట్యాంక్‌ లో కొంత పెట్రోల్ మిగిలి ఉంటే కారు కొంతసేపు స్టార్ట్ కావచ్చు. కానీ, కాసేపటికే ఇంజిన్ వణకడం, అసాధారణ సౌండ్స్ చేస్తుంది. ఎగ్జాస్ట్ నుంచి నల్లటి పొగ వస్తుంది. చివరికి ఇంజిన్ పూర్తిగా ఆగిపోతుంది.

తప్పును త్వరగా గుర్తించడం మంచిది!  

పెట్రోల్ బంక్‌ లో ఉండగానే పొరపాటున డీజిల్ పోసిన విషయం తెలిస్తే, కారు స్టార్ట్ చేయకూడదు. అలా చేయడం వల్ల ఇంజిన్ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. కారు స్టార్ట్ కాకపోతే, ఇంజిన్‌లోకి డీజిల్ వెళ్లి ఉండదు. వెంటనే కారు స్టార్ట్ చేయకుండా ఆపేయాలి. కీని కూడా ఆఫ్ చేయాలి. అలా చేస్తే ఫ్యూయల్ పంప్ పని చేయదు. డీజిల్‌ ను ఇంజిన్‌ లోకి పంపకుండా కాపాడుతుంది.

Advertisement

వెంటనే, కారును పక్కకు తీసుకెళ్లి, మెకానిక్, రోడ్‌ సైడ్ అసిస్టెన్స్‌ కు సమాచారం ఇవ్వాలి. మెకానిక్ ట్యాంక్‌లోని డీజిల్‌ను పూర్తిగా తీసివేసి, ఫ్యూయల్ సిస్టమ్‌ను శుభ్రం చేస్తారు. ఆ తర్వాత మళ్లీ పెట్రోల్ నింపి కారు సాధారణంగా ఉపయోగించుకోవచ్చు.

ఒకవేళ కారు స్టార్ట్ చేసిన తర్వాత లేదా కొంత దూరం ప్రయాణించిన తర్వాత తప్పు తెలిసితే పరిస్థితి కొంచెం సీరియస్ అవుతుంది. వెంటనే కారును ఆపి ఇంజిన్‌ ను ఆఫ్ చేయాలి. మళ్లీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించకూడదు.  అలా చేస్తే, ఇంజిన్‌ కు మరింత నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కారును టో ట్రక్ ద్వారా సర్వీస్ సెంటర్‌కు తరలించాలి. అక్కడ మెకానిక్‌లు ట్యాంక్‌ను ఖాళీ చేయడం, ఫ్యూయల్ లైన్లను శుభ్రం చేయడం, ఫ్యూయల్ ఇంజెక్టర్లు, స్పార్క్ ప్లగ్‌లు, ఫ్యూయల్ ఫిల్టర్‌ ను చెక్ చేసి అవసరమైతే మార్చాల్సి ఉంటుంది. అందుకే, ఫ్యూయల్ నింపే ముందు ఒకటికి రెండు చెక్ చేసుకోవడం మంచిది.

Read Also: సియెర్రా To అవిన్యా.. టాటా నుంచి 4 క్రేజీ ఎలక్ట్రిక్ SUVలు వచ్చేస్తున్నాయ్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×