E-Paper
Advertisement

70 కి.మీ స్పీడ్ తో వెళ్తున్న కారులో స్టార్ట్ బటన్ నొక్కితే ఏమవుతుంది? వామ్మో.. అంత డేంజరా?

70 కి.మీ స్పీడ్ తో వెళ్తున్న కారులో స్టార్ట్ బటన్ నొక్కితే ఏమవుతుంది? వామ్మో.. అంత డేంజరా?
Advertisement

Start Button Pressed: సాధారణంగా హైవే మీద కర్లు వేగంగా వెళ్తుంటాయి. గంటకు 70 మైళ్ల వేగంతో జర్నీ చేసే సమయంలో పొరపాటున  స్టార్ట్/స్టాప్ బటన్‌ ను నొక్కితే ఏమవుతుంది? అనేది చాలా మందికి అనుమానం కలుగుతుంది. ఎందుకంటే, ఇప్పుడు వస్తున్న చాలా కొత్త కార్లలో పుష్ బటన్ స్టార్ట్ సిస్టమ్ ఉంటుంది. ఒకవేళ అనుకోకుండా ఈ బటన్ నొక్కితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

కార్ల తయారీ సంస్థలు పుష్ బటన్ స్టార్ట్ సిస్టమ్ వ్యవస్థను చాలా జాగ్రత్తగా రూపొందిస్తాయి. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో పొరపాటున బటన్ తాకినా ఇంజన్ ఆగకుండా సాఫ్ట్‌ వేర్ రక్షణ ఇస్తుంది. కొన్ని పరీక్షల్లో హోండా లాంటి కార్లలో బటన్ ఒక్కసారి నొక్కినప్పుడు కేవలం వార్నింగ్ మాత్రమే కనిపించింది. ఇంజన్ మాత్రం అలాగే పని చేస్తుంది. అంటే కారు  ప్రమాదవశాత్తూ జరిగిన టచ్ గా భావిస్తుంది. కానీ, బటన్‌ ను కొన్ని సెకన్ల పాటు నొక్కి పట్టుకుంటే పరిస్థితి వేరేలా ఉంటుంది. డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా ఇంజన్ ఆపాలని ప్రయత్నిస్తున్నాడని కారు భావిస్తుంది. వోల్వో, జాగ్వార్ లాంటి కొన్ని కార్లలో ఇలా చేస్తే ఇంజన్ పూర్తిగా ఆగిపోతుంది. ట్రాన్స్‌ మిషన్ న్యూట్రల్‌ లోకి వెళ్తుంది. డాష్‌ బోర్డ్ కూడా ఆగిపోతుంది.

ఇంజిన్ ఆగిన తర్వాత అసలు సమస్య

Advertisement

ఇంజన్ ఆగిన తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. పవర్ స్టీరింగ్, బ్రేక్ అసిస్టు లాంటి వ్యవస్థలు పని చేయడం ఆగిపోతాయి. స్టీరింగ్ గట్టిగా మారుతుంది. బ్రేక్ వేయడానికి కూడా ఎక్కువ బలం అవసరం అవుతుంది. కారు వెంటనే నియంత్రణ తప్పకపోయినా, దాన్ని సురక్షితంగా రోడ్డు పక్కకు తీసుకెళ్లడం కష్టమవుతుంది. డ్రైవర్ ప్రశాంతంగా ఉండి జాగ్రత్తగా వాహనాన్ని ఆపాలి.

కొన్ని బ్రాండ్లలో ఈ వ్యవస్థ ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. కొన్ని BMW మోడళ్లలో స్టార్ట్ బటన్‌ ను వరుసగా మూడుసార్లు వేగంగా నొక్కితే కూడా ఇంజన్ ఆగిపోతుంది. అలా జరిగితే కారులో ఫాల్ట్ కోడ్‌ లు రికార్డు అవుతాయి. వాటిని తొలగించడానికి సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సి రావచ్చు. డయాగ్నస్టిక్ చెకప్‌ కే చాలా ఖర్చవుతుంది. అంటే చిన్న పొరపాటు పెద్ద ఖర్చుకు దారితీస్తుంది. అయితే, ఈ ఫీచర్‌ను తయారీదారులు సరదా కోసం ఇవ్వలేదు. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో  ప్రాణాలను కాపాడుతుంది.  యాక్సిలరేటర్ ఇరుక్కుపోయి కారు అదుపు తప్పితే, ఇంజన్‌లో మంటలు వచ్చినా, స్టార్ట్/స్టాప్ బటన్‌ను ఎక్కువసేపు నొక్కి ఇంజన్ పవర్‌ ను ఆపేయొచ్చు. దీనిని అత్యవసర భద్రతా వ్యవస్థలో భాగంగా ఏర్పాటు చేశారు.

Advertisement

సో, డ్రైవింగ్ చేస్తూ ఉన్న సమయంలో ఈ బటన్‌ తో ప్రయోగాలు చేయడం మంచిది కాదు. సాధారణంగా చిన్న టచ్ వల్ల ప్రమాదం ఉండదు. కానీ, ఉద్దేశపూర్వకంగా బటన్ నొక్కి ఇంజన్ ఆపడానికి ప్రయత్నిస్తే కారులోని వారి భద్రత ప్రమాదంలో పడుతుంది.

Read Also: టయోటా హైబ్రిడ్ ధరపై గందరగోళం.. ప్రకటనలో ఒక ధర, వెబ్‌ సైట్‌ లో మరో ధర!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×