E-Paper
Advertisement

Volkswagen Discounts: వోక్స్‌ వ్యాగన్ అదిరిపోయే ఆఫర్, ఆ కార్లపై ఏకంగా రూ.4.50 లక్షల తగ్గింపు!

Volkswagen Discounts: వోక్స్‌ వ్యాగన్ అదిరిపోయే ఆఫర్, ఆ కార్లపై ఏకంగా రూ.4.50 లక్షల తగ్గింపు!
Advertisement

Volkswagen Discounts: వోక్స్‌ వ్యాగన్ ఆటో మోబైల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. పలు మోడల్స్ మీద భారీగా డిస్కౌంట్లు అందిస్తుంది. కొన్ని కార్ల మీద సుమారు రూ. 4.5 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది. 2025 మోడల్ ఇయర్ స్టాక్‌ ను క్లియర్ చేసేందుకు ఈ ఆఫర్ ను తీసుకొచ్చింది. మోడల్, వేరియంట్ ను బట్టి డిస్కౌంట్లను అందిస్తుంది. ఫ్లాగ్‌ షిప్ టిగువాన్ ఆర్ లైన్‌లో ఎక్కువగా డిస్కౌంట్ అందిస్తుంది. టైగన్ SUV, వర్టస్ సెడాన్ మీద కూడా భారీగా తగ్గింపు అందిస్తుంది. జనవరి 31 వరకు ఈ ఆఫర్ ను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. ఒకవేళ స్టాక్ క్లియర్ కాకపోతే, మరికొద్ది రోజులు పెంచే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఏ కార్లపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందంటే?

కాంపాక్ట్ SUV విభాగంలో వోక్స్‌ వ్యాగన్ టైగన్ బాగా పాపులర్ అయ్యింది. ఈ కారుపై భారీగా క్యాష్ ఆఫర్, లాయల్టీ బోనస్‌లు, ఎక్స్ఛేంజ్ ప్రోత్సాహకాలను అందిస్తుంది. రూ.20,000 లాయల్టీ ప్రయోజనాలు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు రూ.30,000 వరకు ఇస్తుంది. కార్పొరేట్ కొనుగోలుదారులు రూ.40,000 వరకు విలువైన అదనపు పెర్క్‌ లకు కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్లు కలిపితే భారీగా తగ్గింపు లభిస్తుంది. ఉదాహరణకు, GT ప్లస్ DSG వేరియంట్ దాదాపు రూ. 2.9 లక్షల తగ్గింపు పొందుతుంది. GT ప్లస్ క్రోమ్, స్పోర్ట్ MT, టాప్‌ లైన్ వెర్షన్లు దాదాపు రూ. 2.4 లక్షల పొదుపులను పొందే అవకాశం ఉంది. ఎంట్రీ లెవల్ కంఫర్ట్‌ లైన్ వేరియంట్ కూడా మొత్తం రూ. 1.3 లక్షల కంటే ఎక్కువ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.

వర్టస్ సెడాన్ పైనా భారీగా తగ్గింపు

Advertisement

మిడ్‌ సైజ్ విభాగంలో వోక్స్‌ వ్యాగన్ వర్టస్ సెడాన్ కూడా భారీగా డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్‌పై రూ. 1.8 లక్షల వరకు ఆఫర్లు అందిస్తుంది. చాలా ట్రిమ్‌లలో లాయల్టీ, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు ఉన్నాయి. అయితే హైలైన్, టాప్‌ లైన్,  ఆటోమేటిక్ వెర్షన్‌లలో భారీగా క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. అటు డిస్కౌంట్ చార్ట్‌ లో అగ్రస్థానంలో వోక్స్‌ వ్యాగన్  టిగువాన్ R-లైన్ ఉంది. జనవరి 2026 లో అత్యంత ఎక్కువ డిస్కౌంట్ పొందే కారుగా ఇది గుర్తింపు తెచ్చుకుంది. కొనుగోలుదారులు ఈ కారుపై రూ.3.5 లక్షల క్యాష్ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. అడిషనల్ గా రూ.50,000 లాయల్టీ, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు లభిస్తాయి. మొత్తం రూ.4.5 లక్షల ఆదా అవుతుంది.  దీని వలన టిగువాన్ ఆర్ లైన్ వోక్స్‌ వ్యాగన్ ప్రస్తుత పోర్ట్‌ ఫోలియోలో అత్యంత ఎక్కువ డిస్కౌంట్ పొందే కారుగా గుర్తింపు తెచ్చుకుంది. టిగువాన్ ఆర్ లైన్ డిస్కౌంట్లు ఒక్కో నగరంలో ఒక్కోలా ఉండవచ్చు. ఒకవేళ మీరూ వోక్స్ వ్యాగన్ కారు కొనాలనుకుంటే సమీపంలోని షో రూమ్ కు వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవడం మంచిది.

Read Also: భారత్-ఈయూ మధ్య కీలక ఒప్పందం, భారీగా తగ్గనున్న కార్ల ధరలు!

Advertisement

 

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×