E-Paper
Advertisement

Volkswagen Tayron vs Tiguan: టేరాన్ vs టిగువాన్.. వీటిలో ఏది బెస్ట్ కారు అంటే?

Volkswagen Tayron vs Tiguan: టేరాన్ vs టిగువాన్.. వీటిలో ఏది బెస్ట్ కారు అంటే?
Advertisement

Volkswagen Tayron vs Tiguan Comparison:  టేరాన్, టిగువాన్ కార్లు వోక్స్‌ వ్యాగన్ నుంచి విడుదలైన ప్రీమియం ఎస్‌యూవీలు. అయితే, టేరాన్.. టిగువాన్ కంటే పెద్దది. 7-సీటర్ గా ఆప్షన్ తో అందుబాటులో ఉంది. ఎక్కువ బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది. టిగువాన్ 5-సీటర్ గా విడుదల అయ్యింది. కాంపాక్ట్ డిజైన్‌ తో స్పోర్టీగా ఉంటుంది. రెండూ ఒకే రకమైన 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ తో అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఏ కారు ప్రత్యేకత ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..

టేరాన్ vs టిగువాన్ కీలక తేడాలు   

⦿ పరిమాణం, స్థలం: టేరాన్, టిగువాన్ కంటే 11 సెం.మీ ఎక్కువ వీల్‌ బేస్‌ను కలిగి ఉండి. కారు లోపల ఎక్కువ స్థలాన్ని కలిగి ఉంటుంది. టేరాన్ 7 సీట్లతో వస్తుండగా, టిగువాన్ 5 సీట్లను కలిగి ఉంటుంది. కొద్దిగా చిన్నగా, సౌకర్యవంతమైన ఎస్‌యూవీగా ఉంటుంది.

Advertisement

⦿ డిజైన్: టేరాన్ మరింత బాక్సీ,  అట్లాస్ తరహా డిజైన్‌ను కలిగి ఉంటుంది. టిగువాన్ మరింత రౌండెడ్ గా,  అధునాతన డిజైన్‌ తో కనిపిస్తుంది.

⦿ బూట్ స్పేస్: టేరాన్ 7 సీటర్ వెర్షన్‌ లో టిగువాన్ కంటే సుమారు 185-198 లీటర్ల ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, అయితే సీట్లు మడిచినప్పుడు టిగువాన్ ఎక్కువ స్థలాన్ని అందిస్తుంది.

Advertisement

⦿  ఇంజిన్,  పనితీరు:  రెండు మోడళ్లు 2.0-లీటర్ TSI (టర్బో-పెట్రోల్) ఇంజిన్‌ లను కలిగి ఉంటాయి. ఈ ఇంజిన్లు మరింత పవర్ ఫుల్ గా ఉంటాయి.  దాదాపు 187 bhp కంటే పవర్ ను కలిగి ఉంటాయి. ఎక్కువ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తాయి. రెండు కార్లు DSG ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ తో వస్తాయి. ఇవి వేగవంతమైన, మృదువైన గేర్ మార్పులను అందిస్తాయి. AWD  సిస్టమ్ రెండింటిలోనూ లభిస్తుంది.

⦿ ఫీచర్లు: టేరాన్‌లో ఎర్గోయాక్టివ్ సీట్లు, మెరుగైన ఆంబియంట్ లైటింగ్, లగ్జరీ ఫీచర్లు ఎక్కువగా ఉంటాయి. టిగువాన్ R-Line స్పోర్టీ లుక్, మెరుగైన కంఫర్ట్‌ ఉంటుంది.

⦿  ధర: వోక్స్‌ వ్యాగన్ టేరాన్ తో పోల్చితే, టెర్రాన్ మరింత ప్రీమియం, 7-సీటర్ ఎంపికతో రావడంతో ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. టిగువాన్ సుమారు రూ.35 లక్షల నుంచి రూ. 45 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కొత్తగా వస్తున్న 7-సీటర్ టేరాన్ ధర సుమారు రూ. 50 లక్షల వరకు ఉంటుంది.

Read Also:  టాటా లవర్స్ కు పండుగే, లాంచ్ కు ముందే పంచ్ EV ఫేస్‌ లిఫ్ట్ ఆవిష్కరణ!

ఎవరికి ఏ కారు అనుకూలంగా ఉంటుందంటే?

ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉండి, ఎక్కువ బూట్ స్పేస్ కావాలనుకుంటే టేరాన్ మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.  చిన్న కుటుంబం, స్పోర్టీ, సిటీలో ఈజీగా నడిపేందుకు అనుకూలంగా ఉండాలంటే టిగువాన్ అనుకూలంగా ఉంటుంది.

Read Also: రెనాల్ట్ డస్టర్ To కియా సోరెంటో.. 2026లో లాంచ్ కానున్న క్రేజీ హైబ్రిడ్ కార్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×