E-Paper
Advertisement

స్టైలిష్ డిజైన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్స్.. వోక్స్‌ వ్యాగన్ టైగన్ ఫేస్‌ లిఫ్ట్ వచ్చేసింది!

స్టైలిష్ డిజైన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్స్.. వోక్స్‌ వ్యాగన్ టైగన్ ఫేస్‌ లిఫ్ట్ వచ్చేసింది!
Advertisement

Volkswagen Taigun Facelift 2026 Launched: వోక్స్‌ వ్యాగన్ ఇండియా టైగన్ ఫేస్‌ లిఫ్ట్ SUVని భారతీయ మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర సుమారు రూ.11 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది.  ఈ కొత్త మోడల్‌లో చిన్న చిన్న డిజైన్ మార్పులు, అత్యాధునిక ఫీచర్లు, 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ ను తీసుకొచ్చింది. కుటుంబ అవసరాలు, డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ ను ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

ఆకట్టుకునేలా స్టైలిష్ లుక్

డిజైన్ పరంగా టైగన్ ఫేస్‌ లిఫ్ట్‌ కు లేటెస్ట్ లుక్ ఇచ్చారు. ముందుభాగంలో కొత్త గ్రిల్‌తో పాటు LED లైట్ బ్యాండ్‌ ను యాడ్ చేశారు. ఈ ఛేంజెస్ తో వెహికల్ మరింత వెడల్పుగా కనిపిస్తుంది. ముందు, వెనుక భాగాల్లో షైనింగ్  లోగోలు ఉన్నాయి. కొత్త బంపర్ డిజైన్, పదునైన లైన్స్‌ తో కారు మరింత స్టైలిష్‌ గా కనిపిస్తుంది. LED టెయిల్ లైట్లు కొత్త యానిమేషన్లతో వచ్చాయి. 16,17 అంగుళాల కొత్త అల్లాయ్ వీల్స్ సైడ్ లుక్‌ను మరింత పెంచాయి.  అవకాడో పెర్ల్, స్టీల్ గ్రే లాంటి కొత్త రంగులు కూడా అందుబాటులో ఉన్నాయి.

Advertisement

ఇక ఇంటీరియర్‌ లో పెద్ద మార్పులు చేయకుండా, క్వాలిటీని పెంచే ప్రయత్నం చేశారు. డాష్‌బోర్డ్‌ కు కొత్త ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. సీట్ల డిజైన్ వేరియంట్‌ ను బట్టి ఉంటుంది. GT వేరియంట్లలో స్పోర్టీ ఫీల్ ఉంటుంది. కాంట్రాస్ట్ స్టిచింగ్, మెరుగైన మెటీరియల్స్ క్యాబిన్‌ ను ప్రీమియం లుక్ లో చూపిస్తాయి. మొత్తం లేఅవుట్ డ్రైవర్‌కు సౌకర్యంగా ఉండేలా డిజైన్ చేశారు.

అత్యాధునిక ఫీచర్లు

ఫీచర్ల పరంగా ఈ కొత్త టైగన్‌ లో చాలా అప్ డేట్స్ ఉన్నాయి. 10.1 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ తో వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ ఉంటుంది. 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే ఉంటుంది. హలో వోక్స్‌ వ్యాగన్  వాయిస్ అసిస్టెంట్ ద్వారా వాయిస్ కమాండ్స్ ఇవ్వవచ్చు. పనోరమిక్ సన్‌ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీటు లాంటి సౌకర్యాలు ఉన్నాయి. ప్రీమియం సౌండ్ సిస్టమ్ కూడా ఉంటుంది.

Advertisement

ఈ కారులో బూట్ స్పేస్ కూడా ఎక్కువగా ఉంది. సాధారణంగా 385 లీటర్లు ఉంటుంది. వెనుక సీట్లు మడిస్తే  1405 లీటర్ల వరకు పెరుగుతుంది. దీంతో రోజువారీ ఉపయోగం నుంచి ట్రిప్స్ వరకు సౌకర్యంగా ఉంటుంది.

మంచి భద్రతా ఫీచర్లు

టైగన్ ఇప్పటికే 5 స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్‌ ను కలిగి ఉంది. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌ బ్యాగ్‌ లు స్టాండర్డ్‌ గా వస్తాయి. ESC, హిల్ హోల్డ్, మల్టీ కొలిజన్ బ్రేకింగ్ వంటి అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు డ్రైవింగ్‌ ను మరింత ఈజీగా మార్చుతాయి. ఇక ఇంజిన్ విషయానికి వస్తే, టర్బో పెట్రోల్ ఇంజిన్ కొనసాగుతోంది. కానీ, ఈసారి కొత్తగా 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ను అందించారు. ఇది డ్రైవింగ్‌ను మరింత స్మూత్‌ గా మార్చుతుంది.

Read Also: ఇన్నోవా ఇప్పుడు మరింత చీప్.. ఏకంగా అంత ధర తగ్గిందా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×