E-Paper
Advertisement

ఔనా.. నిజమా? EV కారుగా అంబాసిడర్ రీఎంట్రీ?

ఔనా.. నిజమా? EV కారుగా అంబాసిడర్ రీఎంట్రీ?
Advertisement

Ambassador Car Comeback: హిందుస్తాన్ మోటార్స్ సంస్థ అంబాసిడర్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, ఇందులో నిజం ఎంత? అసలు అంబాసిడర్ కారు మళ్లీ వస్తుందా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వైరల్ ఫోటోలు నిజమేనా?

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు, వివరాలు అన్నీ ఈవీ ఇండియా రూపొందించిన ‘What If’ కాన్సెప్ట్ సిరీస్‌ లో భాగం మాత్రమే. అంటే, భవిష్యత్తులో అంబాసిడర్ ఎలక్ట్రిక్ రూపంలో వస్తే ఎలా ఉంటుందనే ఊహతో రూపొందించిన డిజైన్ మాత్రమే. ఈ మోడల్ కు కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ కాన్సెప్ట్‌ లో పాత అంబాసిడర్ కారుకు ఉన్న క్లాసిక్ డిజైన్‌ ను ఎక్కువగా అలాగే ఉంచారు. అయితే, ఎలక్ట్రిక్ కారుకు తగినట్లుగా ముందు భాగంలో ఉండే సంప్రదాయ గ్రిల్‌ ను తొలగించి, మోడ్రన్ లుక్ ఇచ్చారు. దీంతో పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే కొత్త తరం ఎలక్ట్రిక్ కారులా కనిపించేలా డిజైన్ చేశారు.

కాన్సెప్ట్ లో ఏం ఉందంటే?

Advertisement

కాన్సెప్ట్ ప్రకారం ఈ కారులో 85 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుందని ఊహించారు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 550 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని చెప్పారు. 300 హెచ్ పీ పవర్ అందించే ఎలక్ట్రిక్ మోటార్, కేవలం 6.5 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉంటుందని చూపించారు. ఫాస్ట్ ఛార్జింగ్ సాయంతో 10 నుంచి 80 శాతం వరకు బ్యాటరీని కేవలం 28 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చని కూడా ఈ కాన్సెప్ట్‌ లో వెల్లడించారు.

ధర ఎంత ఉంటుందంటే?

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ మోడల్‌ కు రూ.11.99 లక్షల ప్రారంభ ధర  ఉంటుందని ఈవీ ఇండియా అభిప్రాయపడింది. అయితే.. ఈ ధర, స్పెసిఫికేషన్లు, లాంచ్ తేదీ అన్నీ పూర్తిగా ఊహాజనితమైనవే. హిందుస్తాన్ మోటార్స్ నుంచి వీటిపై ఎలాంటి అధికారిక సమాచారం విడుదల కాలేదు. అయితే, ఒకప్పుడు భారతీయ రోడ్లపై తనదైన ముద్ర వేసిన అంబాసిడర్ కారు మళ్లీ ఎలక్ట్రిక్ రూపంలో వస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. పాత డిజైన్‌ను అత్యాధునిక సాంకేతికతతో కలిపితే మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు దక్కే అవకాశం ఉందని కూడా పలువురు భావిస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం వైరల్ అవుతున్న అంబాసిడర్ ఈవీ ఫోటోలు కేవలం ఒక డిజైన్ కాన్సెప్ట్ మాత్రమే. అయినప్పటికీ, హిందుస్తాన్ మోటార్స్ నిజంగానే అంబాసిడర్‌ను ఎలక్ట్రిక్ అవతారంలో తిరిగి తీసుకొస్తే భారత ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుందని ఆటో అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Read Also: జూలై కార్ సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. ఇండియన్ కంపెనీస్ ఏ ప్లేస్ లో ఉన్నాయంటే?

Tags

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×