// // విడా నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే! -->
E-Paper
Advertisement

విడా నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

విడా నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Vida VX2 Go FB Launched in India: విడా కంపెనీ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే విడా VX2 Go FB పేరుతో కొత్త మోడల్‌ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో FB అంటే Fixed Battery అని అర్థం. ఇప్పటి వరకు తీసి ఛార్జ్ చేసుకునే బ్యాటరీలతో స్కూటర్లను అందించిన విడా, తొలిసారి ఫిక్స్‌ డ్ బ్యాటరీతో ఈ కొత్త వేరియంట్‌ ను తీసుకొచ్చింది. దీని ఎక్స్‌ షోరూమ్ ధర రూ.1.13 లక్షలు.

సింగిల్ ఛార్జ్ తో 128 కి.మీ రేంజ్

ఈ స్కూటర్‌లో 3.1kWh సామర్థ్యం గల ఫిక్స్‌ డ్ బ్యాటరీని అమర్చారు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే IDC ప్రమాణాల ప్రకారం 128 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. బ్యాటరీని తీసి ఇంట్లో ఛార్జ్ చేసే అవకాశం ఇందులో ఉండదు. స్కూటర్‌ ను నేరుగా ఇంట్లో, పార్కింగ్ ప్రాంతంలో ఉన్న ఛార్జింగ్ పాయింట్‌ కు కనెక్ట్ చేసి ఛార్జ్ చేయాలి. రోజూ బ్యాటరీని మోసుకెళ్లే ఇబ్బంది ఉండకూడదని భావించే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది.

Advertisement

పనితీరు విషయానికి వస్తే, ఈ స్కూటర్‌లో 6kW ఎలక్ట్రిక్ మోటార్ ను అమర్చారు. దీని సాయంతో గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. సిటీలో రోజువారీ ప్రయాణాలకు ఈ వేగం సరిపోతుందని కంపెనీ చెబుతోంది. ఛార్జింగ్ విషయంలో కూడా ఈ స్కూటర్‌కు మంచి సదుపాయాలు ఉన్నాయి. DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఉండటంతో బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు కేవలం 65 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. దీంతో ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.

ఫీచర్ల గురించి..

ఫీచర్ల పరంగా కూడా విడా VX2 Go FB ఆకట్టుకుంటుంది. ఇందులో పొడవైన, సౌకర్యవంతమైన సీటుతో పాటు 27.2 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉంది. ఆఫీస్ బ్యాగ్, హెల్మెట్, టిఫిన్ బాక్స్, రోజువారీ అవసరమైన చిన్న వస్తువులను సులభంగా ఉంచుకోవచ్చు. అంతేకాదు, 4.3 అంగుళాల LCD డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ను అందించారు. ఇది స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. టర్న్ బై టర్న్ నావిగేషన్ లాంటి స్మార్ట్ ఫీచర్లను కూడా ఇందులో ఉపయోగించుకోవచ్చు. సిటీలో కొత్త ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ప్రత్యేకంగా మొబైల్ చూడాల్సిన అవసరం తగ్గుతుంది.

పలు వేరియంట్లలో అందుబాటులో..

Advertisement

విడా ఇప్పటికే VX2 సిరీస్‌ లో 2.2kWh నుంచి 4.4kWh వరకు బ్యాటరీ సామర్థ్యాలు కలిగిన పలు వేరియంట్లను విక్రయిస్తోంది. ఇప్పుడు వాటికి అదనంగా VX2 Go FBను తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా తమకు 5,900కు పైగా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు, 700కుపైగా సర్వీస్ టచ్‌ పాయింట్లు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. కొత్త విడా VX2 Go FB స్కూటర్ ఆగస్టు ప్రారంభం నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న డీలర్‌ షిప్‌ లలో అందుబాటులోకి రానుంది. రోజువారీ వినియోగానికి మంచి రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్, స్మార్ట్ ఫీచర్లు కోరుకునే వారికి ఈ స్కూటర్ మంచి ప్రత్యామ్నాయంగా నిలువనుంది.

Read Also: తక్కువ ధరలో క్రేజీ ఏథర్ స్కూటర్.. లాంచ్ కు ముందే లుక్ రివీల్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×