E-Paper
Advertisement

VIDA V2 vs VIDA VX2: విడా V2 vs విడా VX2.. రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది కొంటే బెస్ట్?

VIDA V2 vs VIDA VX2: విడా V2 vs విడా VX2.. రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది కొంటే బెస్ట్?
Advertisement

ఇండియన్ స్కూటర్ మార్కెట్ లోకి అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ ధరలో మంచి రేంజ్ తో ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ మోటార్ సైకిల్ కంపెనీ హీరో నుంచి కూడా చక్కటి ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల అయ్యాయి. వాటిలో ముఖ్యమైనవి విడా V2, విడా VX2. విడా V2 ధర సుమారు రూ. 1.30 లక్షల నుంచి రూ. 1.44 లక్షల వరకు ఉంటుంది. ఒరే ఛార్జ్ తో 165 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది. 90 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణించే అవకాశం ఉంటుంది. ప్రీమియం, హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా కొనసాగుతోంది. అయితే వీడా VX2 ధర సుమారు రూ. 99 వేల నుంచి రూ. 1.20 లక్షల వరకు ఉంటుంది. ఇది ఒకే ఛార్జ్ తో 142 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది. 80 కి.మీ./గం. వేగంతో ప్రయాణించే అవకాశం ఉంటుంది. సరసమైన, పట్టణ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. V2 మెరుగైన పనితీరును అందిస్తుంది.  VX2 7 మంచి కలర్స్, మంచి యాక్సెసబుల్ వేరియంట్ గా కొనసాగుతోంది.

విడా V2 vs విడా VX2 కీలక పోలికలు

⦿ ధర: V2 ధర సుమారు గా రూ. 1.30 లక్షల నుంచి రూ. 1.44 లక్షల వరకు ఉంటుంది. అటు VX2 బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. దీని ధర సుమారు రూ. 99,490 నుంచి రూ. 1.20 లక్షల వరకు ఉంటుంది.

Advertisement

⦿ పరిధి,  బ్యాటరీ: V2 ఒకే ఛార్జ్ తో  165 కి.మీ ప్రయాణ పరిధిని అందిస్తుంది. VX2 ఒకే ఛార్జ్ తో 92 కి.మీ నుంచి 142 కి.మీ వరకు బ్యాటరీ ఎంపికల ఆధారంగా లిస్తుంది. వీటిలో బ్యాటరీ సామర్థ్యం 2.2 kWh, 3.4 kWh ఉంటుంది.

⦿ పనితీరు: విడా V2 గంటకు 90 కి.మీ.ల వేగాన్ని అందుకోగా, విడా VX2 గంటకు 85 కి.మీ.ల వేగాన్ని అందుకుంటుంది. విఎక్స్2 ప్లస్ గంటకు 80 కి.మీ.ల వేగాన్ని అందుకుంటుంది. విఎక్స్2 గో గంటకు 70 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.

Advertisement

⦿ ఫీచర్లు: V2 సాధారణంగా పెద్ద TFT డిస్ ప్లే, కొన్ని సందర్భాల్లో, మెరుగైన యాప్ కనెక్టివిటీ లాంటి ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. VX2 అవసరమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. LED లైటింగ్‌ తో వస్తుంది.

⦿ ఛార్జింగ్: రెండు స్కూటర్లు ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కానీ, V2 సాధారణంగా కొంచెం పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది. ఫలితంగా ఛార్జింగ్ సమయాలు భిన్నంగా ఉంటాయి.

Read Also: బజాజ్ రికి To మహీంద్రా గోగో.. మార్చిలో లాంచ్ కాబోయే క్రేజీ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ఇవే!

ఏ స్కూటర్ కొనుగోలు చేస్తే మంచిది?

ఎక్కువ రేంజ్, ఎక్కువ టాప్ స్పీడ్, ప్రీమియం ఫీచర్లు కావాలంటే విడా V2ను తీసుకోవడం మంచిది. విభిన్న బ్యాటరీ ఎంపికలతో మరింత సరసమైన, స్టైలిష్ సిటీ కమ్యూటర్ కోసం చూస్తున్నట్లయితే విడా VX2ని కొనుగోలు చేయడం మంచిది.

Read Also: కొత్త టాటా పంచ్ EV vs నెక్సాన్ EV.. రెండు కార్ల మధ్య తేడాలు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×