E-Paper
Advertisement

Vespa 946 Horse Scooter: వెస్పా 946 హార్స్ ఎడిషన్ లాంచ్, లుక్ చూస్తే మతిపోతోంది బ్రో!

Vespa 946 Horse Scooter:  వెస్పా 946 హార్స్  ఎడిషన్ లాంచ్, లుక్ చూస్తే మతిపోతోంది బ్రో!
Advertisement

Vespa reveals 946 Horse Limited Edition: ప్రముఖ స్కూటర్ కంపెనీ వెస్పా తాగా మరో సూపర్ స్కూటర్ ను లాంచ్ చేసింది. గుర్రపు స్వారీ ప్రేరణతో డిజైన్ చేసిన ఈ స్కూటర్ ప్రత్యేక వి మోనోగ్రామ్, రాలీ ఇన్ స్పైర్డ గ్రాఫిక్స్ తో స్టైలిష్ గా ఆకట్టుకుంటుంది. డ్రాగన్, స్నేక్ ఎడిషన్స్ తర్వాత లూనార్ కలెక్షన్ లో మూడో మోడల్ గా మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది. వెస్పా 946 హార్స్ క్రేజీ డిజైన్, ఇటాలియన్ క్రాప్ట్ మెన్ షిప్, లిమిటెడ్ ఎడిషన్ గా అందుబాటులోకి వచ్చింది. టూవీలర్ కలెక్టర్స్ ను మరింతగా ఆకట్టుకుంటుంది.

లిమిటెడ్ ఆప్షన్ గా వెస్పా 946 హార్స్

వెస్పా 946 హార్స్ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ ను ఒకేసారి ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేసింది కంపెనీ. లూనార్ కలెక్షన్స్ లో భాగంగా ఇయర్ ఆఫ్ ది హార్స్ కు గుర్తుగా ఈ ప్రత్యేక మోడల్ ను తీసుకొచ్చింది. ఈ స్కూటర్ డిజైన్ హార్స్ గ్లోసీ కోట్ నుంచి స్పూర్తి పొందింది. గుర్రం లాగే కనిపించేలా గోధుమ కలర్ లో ఈ స్కూటర్ ను తయారు చేసింది. ఈ స్కూటర్ ప్రీమియం టచ్ లను కలిగి ఉంది. హ్యాండ్ క్రాఫ్ట్ లెదర్ సాడిల్, గోల్డ్ యాక్సెంట్స్ తో వచ్చింది.

 ఆకట్టుకుంటున్న వెస్పా 946 హార్స్

Advertisement

ఈ స్కూటర్ అదిరిపోయే ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. స్టీల్ బాడీ మ్యాట్, గ్లోస్ ఫినిషింగ్ ను కలిగి ఉంటుంది. ఈ ప్రత్యేక ఎడిషన్ పరిమిత సంఖ్యలోనే తయారు కానున్నాయి. ఇది ప్రయాణాలకు మాత్రమే కాకుండా, ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకుంటుంది. వాస్తవానికి వెస్పా కంపెనీ ప్రతి ఏటా లూనార్ క్యాలండర్ ఆధారంగా ప్రత్యేక ఎడిషన్ ను ఆవిష్కరిస్తుంది. అందులో భాగంగానే లూనార్ కలెక్షన్ లో డ్రాగన్, స్నేక్ ఎడిషన్ తర్వాత హార్స్ ఎడిషన్ ను లాంచ్ చేసింది. దీనితో పాటు గర్రపు స్వారీ చేసే వ్యక్తిలా ఉండే క్లోత్స్, హెల్మెట్, యాక్సెసరీస్ ను విడుదల చేసింది.

Read Also:  ఓకేసారి 5 కార్లు లాంచ్.. వోక్స్‌ వ్యాగన్ స్పీడ్ మామూలుగా లేదుగా!

Advertisement

ఫిబ్రవరి 10 నుంచి అమ్మకాలు

వెస్పా 946 హార్స్ స్పెషల్ ఎడిషన్ 125cc సింగిల్ సిలిండర్ ఇంజిన్, డ్యూయల్ ఛానల్ ABS, ఐదు ప్లేస్ ప్రీలోడ్ అడ్జెస్టబుల్ బ్యాక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. ఇటాలియన్ క్రాఫ్ట్ మెన్ షిన్, లూనార్ థీమ్ మిక్సింగ్ స్టైల్ తో వస్తుంది. కలెక్టర్స్ కూడా ఈ ఎడిషన్ మోడల్ మీద ఎక్కువ  ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక వెస్పా 146 హార్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన హెల్మెట్ జెట్ స్టైల్ హెల్మెట్ వెనుక భాగంలో గోల్డ్ V ఎంబ్లమ్ తో వస్తుంది. ఈ హెల్మెట్ పరిమిత సంఖ్యలో తయారవుతాయి. వీటిని కూడా ఫిబ్రవరి 10 నుంచి అమ్మనున్నారు.

Read Also: TVS నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్, డిజైన్ అదిరింది భయ్యా!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×