E-Paper
Advertisement

Range Rover Velar EV: రేంజ్ రోవర్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ కారు, లాంచింగ్ ఎప్పుడు అంటే?

Range Rover Velar EV: రేంజ్ రోవర్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ కారు, లాంచింగ్ ఎప్పుడు అంటే?
Advertisement

Range Rover Velar EV Launch: లగ్జరీ కార్ల తయారీ సంస్థ రేంజ్ రోవర్.. సరికొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయబోతోంది.  ఈ ఏడాది ఫ్లాగ్‌ షిప్ రేంజ్ రోవర్ EV లాంచ్ అవుతుందని వార్తలు వచ్చినా కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.  2026 చివరలో లేదంటే 2027 ప్రారంభంలో ఎలక్ట్రిక్ రేంజ్ రోవర్ మోడల్  లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా స్పై షాట్లు కూపే SUV లాంటి డిజైన్‌ ను వెల్లడించాయి.  కొత్త EMA ప్లాట్‌ ఫామ్‌ పై నిర్మించిన మొదటి మోడల్ కావచ్చని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. రేంజ్ రోవర్ వెలార్ EV పేరుతో ఇది మార్కెట్ కు పరిచయం కానుంది.

2027 ప్రారంభంలో లాంచ్..

ప్రస్తుతం రేంజ్ రోవర్ వెలార్ పెట్రో వెర్షన్‌ లో అందుబాటులో ఉంది. ఈ కారు కాంపాక్ట్ ఎవోక్, రేంజ్ రోవర్ స్పోర్ట్ మధ్య ఉంటుంది. రేంజ్ రోవర్ వెలార్ ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా ఇదే పొజిషన్ లో ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫ్లాగ్‌ షిప్ రేంజ్ రోవర్ మోడల్ త్వరలోనే లాంచ్ కు రెడీ అవుతుందని భావిస్తున్నారు.  ఈ ఏడాది చివరలో లేదంటే, 2027 ప్రాంభంలో పూర్తి ఎలక్ట్రిక్ ఎవోక్‌ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ పూర్తిగా ఎలక్ట్రిక్ రేంజ్ రోవర్ కారు.. పోర్స్చే మకాన్ EVతో పోటీ పడనున్నట్లు తెలుస్తోంది.

రేంజ్ రోవర్ వెలార్ EV గురించి..

Advertisement

రేంజ్ రోవర్ వెలార్ EVకి సంబంధించిన  స్పై షాట్లు కూపే SUV లాంటి డిజైన్‌ ను కలిగి ఉన్నాయి. ముందు ప్యానెల్‌ తో సహా కొన్ని డిజైన్ మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. స్వెప్ట్‌ బ్యాక్ హెడ్‌ లైట్ డిజైన్, ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యమైన అప్ డేట్ వెనుక భాగంలో ఉంది. రూఫ్‌ లైన్ వెలార్ EV సాంప్రదాయ SUV రూపాన్ని మరింత ఫాస్ట్‌ బ్యాక్ డిజైన్ కోసం తొలగించినట్లు తెలుస్తోంది. స్పోర్ట్‌ లో లాగా  రేంజ్ రోవర్ అక్షరాలతో కూడిన ప్లేట్ ద్వారా సన్నని టెయిల్ లైట్లు అనుసంధానించబడి ఉంటాయని తెలుస్తోంది. వెలార్ EV..  ICE వెర్షన్ మాదిరిగానే రేంజ్ రోవర్ లైనప్‌ లో మోస్ట్ రోడ్ ఫోకస్డ్ కారుగా గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది.

EMA ప్లాట్‌ ఫామ్‌పై నిర్మించబడిన తొలి మోడల్

రేంజ్ రోవర్ వెలార్ EV JLR కొత్త 800V EMA ప్లాట్‌ ఫారమ్ మీద రూపొందిన మొదటి మోడల్ కావచ్చని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది టాటా మోటార్స్  రాబోయే అవిన్య శ్రేణికి కూడా మద్దతు ఇస్తుంది. ప్లాట్‌ ఫామ్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్, క్లౌడ్ కనెక్టివిటీ, లెవల్ 2+ ADASకు మద్దతు ఇస్తుంది. మెరుగైన ఇంటీరియర్ స్పేస్ కోసం ఫ్లాట్ ఫ్లోర్‌ తో నిర్మాణం అవుతుంది.

Advertisement

Read Also:  టయోటా To స్కోడా.. మార్చి 2026లో లాంచ్ కానున్న 6 కొత్త కార్లు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×