E-Paper
Advertisement

వోక్స్‌ వ్యాగన్ కొత్త కాంపాక్ట్ SUV వచ్చేస్తోంది.. నెక్సాన్, బ్రెజ్జాకు పోటీ తప్పదా?

వోక్స్‌ వ్యాగన్ కొత్త కాంపాక్ట్ SUV వచ్చేస్తోంది.. నెక్సాన్, బ్రెజ్జాకు పోటీ తప్పదా?
Advertisement

భారత కారు మార్కెట్లో ప్రస్తుతం సబ్-4 మీటర్ SUVలకు భారీ డిమాండ్ ఉంది. తక్కువ ధర, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, ఫ్యామిలీ అవసరాలకు సరిపడే స్థలం ఉండటంతో ఈ వాహనాలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే ఈ సెగ్మెంట్ లో టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ లాంటి మోడళ్లు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు ఈ పోటీలోకి వోక్స్‌ వ్యాగన్ కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.

2027 మధ్య నాటికి  కొత్త కాంపాక్ట్ SUV

వోక్స్‌ వ్యాగన్ 2027 మధ్య నాటికి భారత మార్కెట్ కోసం కొత్త కాంపాక్ట్ SUVను తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కొత్త మోడల్ పొడవు 4 మీటర్లలోపు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం స్కోడా కైలాక్ సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుని, అదే ప్లాట్‌ ఫారమ్ ఆధారంగా వోక్స్‌ వ్యాగన్ తన కొత్త SUVను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్కోడా కుషాక్, వోక్స్‌ వ్యాగన్ టైగన్ మాదిరిగానే ఈ రెండు బ్రాండ్లు టెక్నికల్ అంశాలను షేర్ చేసుకుంటున్నాయి. అదే విధానాన్ని ఈ కొత్త SUVలో కూడా కొనసాగించే అవకాశం ఉంది. అయితే డిజైన్ పరంగా మాత్రం వోక్స్‌ వ్యాగన్ ప్రత్యేకతను చూపించనుంది.

టెరా మోడల్ లా కనిపించే అవకాశం

Advertisement

ఈ SUV రూపకల్పనలో బ్రెజిల్ మార్కెట్లో ప్రదర్శించిన వోక్స్‌ వ్యాగన్ టెరా మోడల్ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. కొత్త గ్రిల్, ఆకర్షణీయమైన LED హెడ్‌ ల్యాంప్స్, ప్రత్యేకమైన DRL డిజైన్, మస్కులర్ బాడీ లైన్స్, కొత్త టెయిల్ ల్యాంప్స్ ఇందులో ఉండనున్నాయి. ఫీచర్ల పరంగా కూడా ఈ మోడల్ ఆధునిక సాంకేతికతతో రానుంది. 10 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, సన్‌ రూఫ్, వైర్‌ లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్ అందుబాటులో ఉండవచ్చు. భద్రత విషయంలో కూడా కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవకాశం ఉంది. మల్టిపుల్ ఎయిర్‌ బ్యాగ్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఇందులో ఉండవచ్చని సమాచారం.

ఇంజిన్ గురించి..

ఇంజిన్ విషయానికి వస్తే, స్కోడా కైలాక్‌ లో ఉపయోగిస్తున్న 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ను ఇందులో కూడా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇంజిన్ 115 బీహెచ్‌పీ పవర్, 178 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఆప్షన్స్ కూడా అందుబాటులో  ఉండవచ్చు.  భారత మార్కెట్లో వోక్స్‌ వ్యాగన్ కొత్త కాంపాక్ట్ SUV రాకతో సబ్ 4 మీటర్ SUV సెగ్మెంట్‌లో పోటీ మరింత పెరగనుంది. ముఖ్యంగా నెక్సాన్, బ్రెజ్జా, వెన్యూ లాంటి  మోడళ్లకు ఇది గట్టి సవాల్‌ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Read Also: హ్యుందాయ్ కస్టమర్లకు షాక్.. జూన్ 1 నుంచి కార్ల ధరల పెంపు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×