E-Paper
Advertisement

Upcoming Royal Enfield Bikes: లాంచ్ కు రెడీ అవుతున్న4 రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు, ఒక్కోదాని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Upcoming Royal Enfield Bikes:  లాంచ్ కు రెడీ అవుతున్న4 రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు, ఒక్కోదాని స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Advertisement

Upcoming Royal Enfield Bikes 2026:  రాయల్ ఎన్‌ఫీల్డ్ కు సంబంధించి త్వరలో నాలుగు బైక్‌లు లాంచ్ కు రెడీ అవుతున్నాయి. వాటిలో ఫ్లయింగ్ ఫ్లీ, హిమాలయన్ 750, బుల్లెట్ 650, హిమాలయన్ ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయి. వీటిలో 3  క్రూయిజర్ బైక్‌లు, ఒక అడ్వెంచర్ బైక్ ఉన్నాయి. ఫ్లయింగ్ ఫ్లీ రాబోయే 10 నెలల్లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ బైక్స్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి లాంచ్ కాబోయే బైక్స్  

 

⦿ ఫ్లయింగ్ ఫ్లీ- అక్టోబర్ 2026

Advertisement

ఈ బైక్ అక్టోబర్ 2026లో లాంచ్ కానుంది. ధర  సుమారు రూ.  4.00 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఫ్లయింగ్ ఫ్లీ బైక్ 1940ల నాటి చారిత్రక బైక్ నుంచి ప్రేరణ పొందింది. ఆధునిక టెక్నాలజీతో రూపొందించబడిన కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ ఇది.  తేలికైన డిజైన్, రెట్రో-ఫ్యూచరిస్టిక్ లుక్, అధునాతన రైడింగ్ ఫీచర్లతో యువతను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ WD/REను రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ పారాట్రూపర్లు ఉపయోగించారు. కొత్త ఫ్లయింగ్ ఫ్లీ (C6, S6) రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ఎలక్ట్రిక్ సబ్ బ్రాండ్. ఇది టెక్నాలజీ, స్టైల్, సులభమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఎకో, రెయిన్, టూరింగ్, ఆఫ్‌రోడ్, పెర్ఫార్మెన్స్, కస్టమ్ రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. ABS, ట్రాక్షన్ కంట్రోల్‌ను సర్దుబాటు చేసుకోవచ్చు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ అనేది పాతకాలపు ఆకర్షణను, అత్యాధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీతో కలిపి, ఆధునిక పట్టణ రైడర్‌ల కోసం రూపొందించబడిన ఒక వినూత్న మోటార్‌సైకిల్ గా చెప్పుకోవచ్చు.

⦿ హిమాలయన్ 750- అక్టోబర్ 2026

ఈ బైక్ అక్టోబర్ 2026లో లాంచ్ కానుంది. దీని ధర రూ.  4.00 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. శక్తివంతమైన అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌ సైకిల్ గా గుర్తింపు తెచ్చుకోనుంది. హిమాలయన్ 450 కంటే పెద్దదిగా ఉంటుంది. 650cc ఇంజిన్ ఆధారంగా రూపొందించబడుతుంది. ఇది మరింత ఎక్కువ పవర్, టార్క్, పెద్ద ఫ్యూయల్ ట్యాంక్, టూరింగ్ కోసం అనుకూలమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. డ్యూయల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్, 19-అంగుళాల ఫ్రంట్, 17-అంగుళాల రియర్ ను కలిగి ఉంటుంది. హై-స్పీడ్ హైవేలు, సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

⦿ బుల్లెట్ 650- నవంబర్ 2026

Advertisement

ఈ బైక్ నవంబర్ 2026లో లాంచ్ కానుంది. దీని ధర రూ. 3.50 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. క్లాసిక్ బుల్లెట్ డిజైన్‌ తో కొత్త 650cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌తో వచ్చే మోటార్‌ సైకిల్.  ఇది బుల్లెట్ 350, క్లాసిక్ 650 స్టైలింగ్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉంటుంది. శక్తివంతమైన పెర్ఫార్మెన్స్, ఆధునికీకరించిన ఫీచర్లతో వస్తుంది. LED లైటింగ్, సెమీ డిజిటల్ కన్సోల్, 43mm ఫ్రంట్ ఫోర్క్స్, ట్విన్ రియర్ షాక్స్, 19 అంగుళాల ఫ్రంట్ వీల్, 18 అంగుళాల రియర్ వీల్, 320mm ఫ్రంట్, 300mm రియర్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఇది ఎక్స్‌ట్రీమ్ స్టైలింగ్, సౌకర్యవంతమైన రైడ్, క్లాసిక్ ఫీల్‌ను అందిస్తుంది. ఇది బుల్లెట్ సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన మోడల్. క్లాసిక్ బుల్లెట్ డిజైన్‌ను ఆధునిక 650cc ఇంజిన్‌ తో మిక్స్ చేస్తుంది.

⦿ హిమాలయన్ ఎలక్ట్రిక్- డిసెంబర్ 2026

ఈ బైక్ డిసెంబర్ 2026లో అందుబాటులోకి వస్తుంది. దీని ధర రూ. 1.90 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.  రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఎలక్ట్రిక్ అనేది రాయల్ ఎన్‌ఫీల్డ్ అభివృద్ధి చేస్తున్న ఎలక్ట్రిక్ అడ్వెంచర్ బైక్.  ఇందులో శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్. సుమారు 150-200 కి.మీ రేంజ్, అధునాతన టెక్ ఫీచర్లు ఉంటాయి. ఇది సాంప్రదాయ హిమాలయన్‌ను పోలిన అగ్రెసివ్ డిజైన్‌తో, సురక్షితమైన రైడింగ్ అనుభవాన్ని అందించేలా రూపొందించబడుతోంది. ఇందులో 13.3 kWh/  14 kWh బ్యాటరీ ప్యాక్ ఉండవచ్చు. ఇది 100 hp (74.5 kW) ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడి ఉంటుంది.

Read Also: సెకన్ల వ్యవధిలో రంగులు మార్చే కారు.. మీరు ఏ కలర్ డ్రెస్ వేస్తే ఆ రంగులోకి.. అద్భుతం కదూ!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×