E-Paper
Advertisement

Upcoming EV Cars Mar 2026: టాటా సియెర్రా EV To మహీంద్రా XUV.e8.. మార్చిలో లాంచ్ కాబోయే క్రేజీ ఈవీలు!

Upcoming EV Cars Mar 2026: టాటా సియెర్రా EV To మహీంద్రా XUV.e8.. మార్చిలో లాంచ్ కాబోయే క్రేజీ ఈవీలు!
Advertisement

ఇండియన్ మార్కెట్ లోకి సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ కాబోతున్నాయి. మార్చి 2026లో టాప్ బ్రాండ్స్ కు చెందిన కార్లు ఈ లిస్టులో ఉన్నాయి. కీలకమైన EV కార్లలో స్కోడా ఎల్రోక్ EV, టాటా సియెర్రా EV,  కియా సైరోస్ EV సహా మరికొన్ని కార్లు ఉన్నాయి. ఇవి ఎలక్ట్రిక్ SUV విభాగంలోకి సత్తా చాటాలని భావిస్తున్నాయి. 2026 Q1 లాంచ్‌ లలో టయోటా అర్బన్ క్రూయిజర్ EV, టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ డెలివరీలు, మెర్సిడెస్ బెంజ్ CLA ఎలక్ట్రిక్ బుకింగ్‌లు కూడా ప్రారంభం కానున్నాయి.

మార్చి 2026లో లాంచ్ కాబోయే ముఖ్యమైన EV కార్లు  

⦿ టాటా సియెర్రా EV: ఈ కారు మార్చి 2026న విడుదల అవుతుందని భావిస్తున్నారు. హారియర్ EV కంటే మెరుడైన అంశాలతో అందుబాటులోకి రానుంది. RWD, AWD ఎంపికలతో 55kWh, 65kWh బ్యాటరీ ప్యాక్స్ తో అందుబాటులోకి రాబోతోంది. V2L, వన్ పెడల్ డ్రైవింగ్ ఫీచర్‌ను కలిగి ఉంటుందని అంచనా.

Advertisement

⦿ స్కోడా ఎల్రోక్ EV: ఈ కారు మార్చి 16న విడుదల కానుంది. దీని ధర దాదాపు రూ. 50 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. ప్రీమియం కారుగా మార్కెట్ లోకి అడుగు పెట్టబోతోంది. ఈ ఎలక్ట్రిక్ SUV, 167.67 bhp మోటారుతో 370 కి.మీ.ల రేంజ్‌ను అందించే అవకాశం ఉంది.

⦿ టయోటా అర్బన్ క్రూయిజర్ EV: ఈ కారు కూడా మార్చిలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. సుజుకి Evx, మారుతి e-విటారా ప్లాట్‌ ఫామ్ ఆధారంగా రూపొందించబడిన ఈ SUV.. 49-61 kWh బ్యాటరీ ఎంపికతో వస్తుంది. దీని ధర రూ. 18 లక్షల నుంచి రూ. 21 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారు ఒకే ఛార్జ్ తో 500 కి.మీ వరకు రేంజ్ ను అందిస్తుంది.

Advertisement

⦿ కియా సైరోస్ EV: ఈ ఎలక్ట్రిక్ కారు కూడా మార్చిలో లాంచ అవుతుందని అంచనా వేస్తున్నారు. ICE సైరోస్ ఆధారంగా స్థానికంగా తయారు చేయబడిన ఎలక్ట్రిక్ SUV, ఏరోడైనమిక్ సామర్థ్యంపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.

Read Also:  బెంజ్ CLA ఎలక్ట్రిక్ కారు రివీల్, 5 క్రేజీ విషయాలు మీ కోసం!

⦿ మహీంద్రా XUV.e8: ఈ కారు మార్చి 2026లో లాంచ్ కానుంది. XUV700 ఆధారంగా రూపొందించబడిన ఎలక్ట్రిక్ SUV, దాదాపు రూ. 25 లక్షల ధరతో ప్రారంభమవుతుందని అంచనా. ఇది హై టెక్ ఫీచర్లు, బలమైన పనితీరును అందిస్తుంది.

⦿ మెర్సిడెస్ బెంజ్ CLA ఎలక్ట్రిక్: ఈ కారు బుకింగ్‌లు మార్చి 10 నుంచి ప్రారంభం కానుంది.  లాంగ్ రేంజ్ కలిగిన ప్రీమియం ఎలక్ట్రిక్ సెడాన్, ఏప్రిల్ 2026లో లాంచ్ కానుంది.

⦿ టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్: ఈ కారుకు సంబంధించిన డెలివరీలో మార్చి 2026లో ప్రారంభం కానున్నాయి. మెరుగైన రేంజ్,  స్టైలింగ్‌తో అప్ డేట్ అయిన ఈ మోడల్, అమ్మకాల్లో దుమ్మురేపుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.

Read Also:  టాటా మోటార్స్ గుడ్ న్యూస్, ఈవీల్లో ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షన్ అవసరం లేదు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×