E-Paper
Advertisement

లో కాస్ట్, హై రేంజ్.. ఇది స్కూటర్ కాదు, ఫ్యూచర్!

లో కాస్ట్, హై రేంజ్.. ఇది స్కూటర్ కాదు, ఫ్యూచర్!
Advertisement

Ultraviolette Tesseract Electric Scooter: భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లోకి సరికొత్త ఈవీలు అడుగు పెడుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇస్తూ ఆకట్టుకుంటున్నాయి. త్వరలో మరో సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అల్ట్రావయోలెట్ కంపెనీకి చెందిన టెస్సరాక్ట్ అత్యాధునిక ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మార్కెట్లోకి రానుంది. F77 సూపర్‌ బైక్‌ ను తయారు చేసిన సంస్థ నుంచే ఇది వస్తుండటంతో మార్కెట్ లో మంచి అంచనాలు ఉన్నాయి. పనితీరు, టెక్నాలజీ పరంగా ఇది ప్రీమియం సెగ్మెంట్‌ కు చెందిన స్కూటర్‌ గా రానుంది. 2026 సెకెండ్ క్వార్టర్ లో ఈ స్కూటర్ మార్కెట్లోకి అడుగు పెట్టే అవకాశం కనిపిస్తోంది.

టెస్సరాక్ట్ స్కూటర్ ప్రత్యేకత ఏంటంటే?

ఈ స్కూటర్‌ ను మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి వీటి ధరలు మారుతాయి. 3.5 kWh వేరియంట్ ప్రారంభ ధర సుమారు రూ.1.20 లక్షలు కాగా, ప్రారంభ ఆఫర్‌ లో కొంత తగ్గింపు ధరకు కూడా అందిస్తున్నారు. 5 kWh వేరియంట్ ధర సుమారు రూ.1.70 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ఇక టాప్ వేరియంట్ అయిన 6 kWh ధర సుమారు రూ. 2 లక్షల వరకు ఉండగా, మొదట కొనుగోలు చేసే కస్టమర్లకు తగ్గింపు ధరను కూడా కంపెనీ ప్రకటించింది. ఆన్‌ రోడ్ ధరలు రాష్ట్రాలను బట్టి మారవచ్చు.

ఒకే ఛార్జ్ తో 162-261 కి.మీ ప్రయాణం

Advertisement

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, టెస్సరాక్ట్ ఒకే ఛార్జ్‌ తో మంచి రేంజ్ ను అందిస్తుంది. చిన్న వేరియంట్ సుమారు 162 కిలోమీటర్ల వరకు వెళ్లగలిగితే, పెద్ద బ్యాటరీ వేరియంట్ 261 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వనుంది. గరిష్ట వేగం గంటకు 125 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అలాగే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం కొన్ని సెకన్లలోనే అందుకుంటుంది. దీని స్పోర్టీ నేచర్‌  వినియోదారులను ఆకట్టుకుంటుంది.

రూ. 100 ఖర్చుతో 500 కి.మీ ప్రయాణం

ఛార్జింగ్ కూడా వేగంగా పూర్తి అయ్యేలా రూపొందించారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ తో, బ్యాటరీని తక్కువ సమయంలోనే 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. సుమారుగా కిలోమీటరుకు రూ.0.14 నుంచి  రూ. 0.20 వరకు ఖర్చు అవుతుంది. రూ. 100 ఖర్చుతో ఏకంగా 500 కిలో మీటర్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది.  రోజువారీ వినియోగానికి ఈ స్కూటర్ చాలా సౌకర్యంగా ఉంటుంది. అలాగే, మెయింటెనెన్స్ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. ఒక కిలోమీటర్‌కు ఖర్చు చాలా తక్కువగా ఉండటం వల్ల దీన్ని ఉపయోగించడం వల్ల చాలా మేలు కలుగుతుంది.

అత్యాధునిక ఫీచర్లు

Advertisement

ఫీచర్ల విషయానికి వస్తే, ఈ స్కూటర్‌లో అధునాతన సాంకేతికతను ఉపయోగించారు. రాడార్ ఆధారిత సేఫ్టీ సిస్టమ్స్, బ్లైండ్ స్పాట్ అలర్ట్స్, ఢీకొనే ప్రమాదాలపై ముందస్తు హెచ్చరికలు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 7 ఇంచుల డిజిటల్ స్క్రీన్‌లో నావిగేషన్, అప్డేట్స్ లాంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. అదనంగా, పెద్ద స్టోరేజ్ స్పేస్ ఉండటం వల్ల రోజువారీ అవసరాల కోసం ఉపయోగపడుతుంది. డిజైన్ పరంగా కూడా టెస్సరాక్ట్ ఆకర్షణీయంగా ఉంటుంది. లేటెస్ట్ లుక్, LED లైటింగ్, పెద్ద వీల్స్ ఆకట్టుకుంటాయి. ఈ స్కూటర్ ఏథర్ 450X, సింపుల్ వన్, TVS iQube ST లాంటి హైఎండ్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడుతుంది.

Read Also: భారత్‌లో టెస్లా సేల్స్ షాక్.. జస్ట్ 342 కార్ల అమ్మకం!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×