E-Paper
Advertisement

TVS Tangent: TVS టాంజెంట్ RR కాన్సెప్ట్ డిజైన్‌కు పేటెంట్, అపాచీ RR 450కు అదే డిజైన్ వాడుతారా?

TVS Tangent: TVS టాంజెంట్ RR కాన్సెప్ట్ డిజైన్‌కు పేటెంట్, అపాచీ RR 450కు అదే డిజైన్ వాడుతారా?
Advertisement

TVS Tangent RR Concept Design: భారత్ లో TVS టాంజెంట్ RR కాన్సెప్ట్ డిజైన్ అధికారికంగా పేటెంట్ లభించింది. ఏరోడైనమిక్ వివరాలతో పూర్తి ఫెయిర్డ్ సూపర్‌ స్పోర్ట్ సిల్హౌట్‌ ను ఈ డిజైన్ కలిగి ఉంటుంది. ముందు భాగంలో పెద్ద ఎయిర్ డక్ట్‌లతో ఉన్న ఫెయిరింగ్‌ లో చక్కగా ఇంటిగ్రేట్ చేయబడిన లో సెట్ LED హెడ్‌ ల్యాంప్ ఆకట్టుకుంటుంది. లేయర్డ్ బాడీ ప్యానెల్స్, షార్ప్మడతలు, ట్రాక్ ఫోకస్డ్ లుక్ అందిస్తాయి. సైడ్ ప్రొఫైల్ సమానంగా డ్రమటిక్ గా ఉంటుంది. ఫెయిరింగ్ డీప్ కట్స్, చెక్కబడిన సర్ఫేజ్ ను కలిగి ఉంటుంది. టెయిల్ విభాగం సన్నగా పైకి లేస్తుంది. స్ప్లిట్ సీట్ సెటప్, హై మౌంటెడ్ టెయిల్ రేస్ బైక్ లుక్ ను కలిగి ఉన్నాయి. మొత్తం డిజైన్ మోడ్రన్ మిడిల్‌ వెయిట్ సూపర్‌ స్పోర్ట్ మోటార్‌ సైకిళ్ల నుంచి ప్రేరణ పొందినట్లుగా కనిపిస్తుంది.

ప్రీమియం హార్డ్‌ వేర్ ప్యాకేజీ

పేటెంట్ ఇమేజెస్ కూడా ప్రీమియం హార్డ్‌ వేర్ ప్యాకేజీని సూచిస్తున్నాయి. ఈ కాన్సెప్ట్ ట్విన్ స్పార్ ఫ్రేమ్‌ను ఉపయోగించినట్లు కనిపిస్తుంది. బహుశా అల్యూమినియం, ఇన్‌ వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్, రియర్ మోనోషాక్‌ తో జత చేయబడింది. రేడియల్ మౌంటెడ్ ఫ్రంట్ కాలిపర్‌ తో పాటు రెండు చివర్లలో పెటల్ డిస్క్‌ లు బ్రేకింగ్ డ్యూటీస్ ను నిర్వహిస్తాయి. ఇక ఇతర  అంశాలను పరిశీలిస్తే, స్టీరింగ్ డంపర్‌ తో కూడిన క్లిప్ ఆన్ హ్యాండిల్‌ బార్లు, రౌండ్ TFT కలర్ డిస్‌ ప్లే, ట్విన్ ఫ్రంట్ డిస్క్‌లు, తేలికైన అల్యూమినియం స్వింగార్మ్ లాగా కనిపించేవి ఉన్నాయి.

Advertisement

Read Also: సుజుకి అదిరిపోయే ఆఫర్, ఎలక్ట్రిక్ యాక్సెస్ పై ఏకంగా రూ. 20,000 బెనిఫిట్స్!

ఇదే డిజైన్ మీద TVS అపాచీ RR 450 నిర్మాణం

టాంజెంట్ RR ఒక కాన్సెప్ట్‌ గా ఉంటుంది. ఈ మోడల్ కు సంబంధించిన పవర్‌ ట్రెయిన్ గురించి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ, నెక్ట్స్ జెనరేషన్ TVS అపాచీ RR 450కి ఆధారం కావచ్చని భావిస్తున్నారు. రాబోయే మోడల్ ఇదే డిజైన్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్ రాబోయే BMW F 450 GSతో దాని ప్లాట్‌ ఫామ్‌ను పంచుకుంటుందని భావిస్తున్నారు. ఇది టాంజెంట్ RRని రాబోయే మోడల్ కు సంబంధించి ఆసక్తికరమైన ప్రివ్యూను అందిస్తుంది.

Advertisement

Read Also: సుజుకి అదిరిపోయే ఆఫర్, ఎలక్ట్రిక్ యాక్సెస్ పై ఏకంగా రూ. 20,000 బెనిఫిట్స్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×