E-Paper
Advertisement

TVS Bikes Price Hike: వినియోగదారులకు టీవీఎస్ షాక్.. ఆ రెండు బైక్ ధరలు పెంపు!

TVS Bikes Price Hike: వినియోగదారులకు టీవీఎస్ షాక్.. ఆ రెండు బైక్ ధరలు పెంపు!
Advertisement

TVS Star City Plus And TVS Radeon Bikes Prices Hiked: ప్రముఖ టూ వీలర్ కంపెనీ టీవీఎస్ ధర పెంపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 2026 సంవత్సరానికి గాను, స్టార్ సిటీ ప్లస్, రేడియన్ ధరలను సవరించింది. ఈ రెండు మోడళ్ల శ్రేణిలోని అన్ని వేరియంట్ల ధర పెరిగినట్లు తెలిపింది. ఇన్ ఫుట్స్ ధర పెరగడంతో పాటు గ్లోబల్ మార్కెట్ లో రూపాయి మారకం విలువ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. పెరిగిన ధరలు ఎలా ఉన్నాయి? ఏ వేరియంట్ మీద ఎంత పెరిగింది? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

TVS స్టార్ సిటీ ప్లస్

⦿ డ్రమ్ వేరియంట్: దీని ధర గతంలో రూ. 72,200 ఉండగా, ఇప్పుడు రూ. 72,500కు పెరిగింది. ఈ వేరియంట్ మీద రూ. 300 పెరిగింది.

Advertisement

⦿ డిస్క్ వేరియంట్: ఈ బైక్ ధర గతంలో రూ. 74,900 ఉండగా, ఇప్పుడు రూ. 75,200కు చేరింది. ఈ వేరియంట్ మీద రూ. 300 హైక్ అయ్యింది.

TVS రేడియన్

⦿ ఆల్ బ్లాక్ ఎడిషన్: ఈ బైక్ ధర గతంలో రూ. 55,100 ఉండగా, ఇప్పుడు రూ. 55,400కి చేరింది. సుమారు రూ. 300 పెరిగింది.

Advertisement

⦿ బేస్ ఎడిషన్: ఈ బైక్ ధర గతంలో రూ. 61,600 ఉండగా, ఇప్పుడు రూ. 61,900కి చేరింది. దీని మీద కూడా రూ. 300 పెరిగింది.

Read Also: కొనుగోలుదారులకు మారుతి సుజుకి షాక్, ధరల పెంపు తప్పదా?

⦿ డిజి డ్రమ్: ఈ బైక్ ధర గతంలో రూ. 74,200 ఉండగా, ఇప్పుడు రూ. 74,500కి చేరింది. సుమారు రూ. రూ. 300 పెరిగింది.

⦿ డిజి డిస్క్: ఈ బైక్ ధర గతంలో రూ. 77,900 ఉండగా, ఇప్పుడు రూ. 78,200కి చేరింది. దీని మీద కూడా రూ. 300 పెరిగింది.

Read Also: యమహా నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది, ఒకే ఛార్జ్ తో ఎంత దూరం వెళ్లొచ్చంటే?

ఓవరాల్ గా రూ. 300 పెంపు

TVS స్టార్ సిటీ ప్లస్, TVS రేడియన్ మోడళ్ల ధరల పెరుగుదల అన్ని వేరియంట్లలో కేవలం రూ. 300 ఉంది. పెరిగిన ఉత్పత్తి ఖర్చులను భర్తీ చేయడానికి టీవీఎస్ ధరలను పెంచాలని నిర్ణయించింది. మొత్తం మీద, ఈ ధర పెరుగుదల నామమాత్రంగా ఉంటుంది. కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం లేదు. ధరలో మార్పు కాకుండా, రెండు బైక్‌లు యాంత్రికంగా ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. రెండు బైక్స్ 109.7cc, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ను కలిగి ఉంటాయి. ఇవి  8bhp పవర్, 8.7Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి.

Read Also: హ్యుందాయ్ ఫస్ట్, టాటా నెక్ట్స్.. వామ్మో.. ఒక్క నెలలో ఇన్ని కార్లు అమ్మాయా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×