E-Paper
Advertisement

TVS Raider vs Honda SP 125: టీవీఎస్ Raider 125 VS హోండా SP 125.. వీటిలో ఏది బెస్ట్?

TVS Raider vs Honda SP 125: టీవీఎస్ Raider 125 VS హోండా SP 125.. వీటిలో ఏది బెస్ట్?
Advertisement

TVS Raider 125 vs Honda SP 125 Comparison: హోండా SP 125 ,టీవీఎస్ Raider 125 భారతీయ మార్కెట్ లో 125cc సెగ్మెంట్‌లో మంచి దూకుడు కొనసాగిస్తున్నాయి. SP 125 తక్కువ ధర, మంచి ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ, కమ్యూటర్ ఫ్రెండ్లీ బైక్ గా ఆకట్టుకుంది. రైడర్ 125 స్పోర్టీ లుక్, అధునాతన ఫీచర్లు, పవర్ ఫుల్ ఇంజిన్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ రెండు 125cc బైక్స్ ధర, మైలేజ్, ఇంజిన్, ఫీచర్లు సహా పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

TVS Raider vs Honda SP 125 మధ్య పోలికలు  

⦿ ఇంజిన్, పర్ఫార్మెన్స్: టీవీఎస్ రైడర్ 124.8cc, 11.38 PS పవర్, 11.2 Nm టార్క్‌ తో స్పోర్టీగా ఉంటుంది. SP 125 123.94cc, 10.87 PS పవర్, 10.9 Nm టార్క్‌ తో స్మూత్ రైడింగ్‌ను అందిస్తుంది.

Advertisement

⦿ మైలేజ్: హోండా SP 125 సుమారు 65-75 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. టీవీఎస్ రైడర్ సుమారు 60-65 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.

⦿ ఫీచర్లు: రైడర్‌లో TFT, LCD డిస్‌ప్లే, వాయిస్ అసిస్ట్, రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. SP 125 లో LED హెడ్‌ ల్యాంప్, డిజిటల్ కన్సోల్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఉన్నాయి. రెండింటిలో LED హెడ్‌ ల్యాంప్, DRLs, సిగ్నేచర్ LED టెయిల్ ల్యాంప్, ఫుల్ డిజిటల్ రివర్స్ LCD క్లస్టర్, అండర్ సీట్ స్టోరేజ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి . మోనో గ్యాస్ చార్జ్డ్ రియర్ సస్పెన్షన్ హై స్పీడ్‌లో కూడా సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. SBT తో డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. సైడ్ స్టాండ్ ఇండికేటర్ తో ఇంజిన్ ఆఫ్ ఆప్షన్ ఉంటుంది.

Advertisement

⦿ ధర: ఇక ఈ రెండు బైక్స్ ధర విషయానికి వస్తే హోండా SP 125 బేస్ మోడల్ ధర సాధారణంగా టీవీఎస్ రైడర్ బేస్ మోడల్ కంటే తక్కువగా ఉంటుంది. టీవీఎస్ రైడర్ ధర రూ. 87,878 వరకు ఉంటుంది. హోండా SP 125 బేస్ మోడల్ ధర రూ. 82,000 ఉంటుంది. ఆన్ రోడ్ ధర మరికాస్త ఎక్కువగా ఉంటుంది.

⦿ బ్రేకింగ్, సస్పెన్షన్: రెండింటిలోనూ ముందు డిస్క్, డ్రమ్, వెనుక డ్రమ్ బ్రేక్ ఆప్షన్లు ఉన్నాయి,  కాంబి బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది.

Read Also: ఓలా To ఏథర్.. ఫిబ్రవరి 2026లో ట్రెండింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

ఏ బైక్ ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే?

స్టైలిష్ లుక్, ఆధునిక ఫీచర్లు, మంచి పవర్ కావాలనుకునే యువతకు టీవీఎస్ రైడర్ అనుకూలంగా ఉంటుంది.  రోజువారీ ప్రయాణాలు, అద్భుతమైన మైలేజ్, మెయింటెనెన్స్ తక్కువగా ఉండాలనుకునే వారికి హోండా SP 125 బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: హోండా షైన్ vs హోండా SP 125.. ఏది కొంటే బెస్ట్ అంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×