E-Paper
Advertisement

Triumph Rocket 3 R: ప్రపంచంలోనే పవర్‌ ఫుల్ క్రూయిజర్ బైక్, దీని ఇంజిన్ పవర్ ఎంతో తెలుసా?

Triumph Rocket 3 R: ప్రపంచంలోనే పవర్‌ ఫుల్ క్రూయిజర్ బైక్, దీని ఇంజిన్ పవర్ ఎంతో తెలుసా?
Advertisement

Triumph Rocket 3 R: ప్రపంచంలో పవర్ ఫుల్ క్రూయిజర్ బైక్స్ ఉన్నాయి. వాటిలో టాప్ లో ఉంటుంది 2024 ట్రయంప్ రాకెట్ 3 R. ఈ బైక్ ఏకంగా 2,458cc ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఇది 182 PS పవర్, 225 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. 2024 మోడల్ మరింత పవర్, మెరుగైన హ్యాండ్లింగ్, డార్క్, స్టైలిష్ కలర్స్‌ తో ఆకట్టుకుంటుంది. ఇది 0 నుంచి 60 మైళ్ల వేగాన్ని జస్ట్ 2.67 సెకన్లలో అందుకుంటుంది. త్వరగా అత్యంత వేగాన్ని అందుకునే బైక్ గా గిన్నిస్ బుక్ ఆఫర్ వరల్డ్ రికార్డ్ ఉంది. 2024 ట్రయంప్ రాకెట్ 3 R బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. రాకెట్ 3 R, GT వేరియంట్లలో లభిస్తుంది. గతంతో పోల్చితే 15 hp ఎక్కువ పవర్ తో వచ్చింది.

2024 ట్రయంప్ రాకెట్ 3 R గురించి..  

⦿ ఇంజిన్, పనితీరు: 2,458 cc ఇన్‌ లైన్ 3 ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 180 bhp పవర్, 225 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేసే ప్రపంచంలోనే పవర్ ఫుల్ క్రూయిజర్ బైక్.

Advertisement

⦿ ఫీచర్లు: రైన్, స్పోర్ట్, రోడ్ మోడ్స్, ABS, ట్రాక్షన్ కంట్రోల్,  Showa సస్పెన్షన్ ఉంటుంది.

⦿వేరియంట్లు: రాకెట్ 3 R  రోడ్‌స్టర్ శైలి, మిడ్-మౌంటెడ్ పెగ్స్తో వస్తుంది. రాకెట్ 3 GT టూరింగ్ స్టైల్, వెనుకకు ఉండే హ్యాండిల్ బార్, విండ్‌ షీల్డ్, బ్యాక్‌ రెస్ట్, ఫార్వర్డ్ ఫేసింగ్ పెగ్స్ ఉంటాయి.

Advertisement

⦿ స్పెసిఫికేషన్లు: కొత్త 10 స్పోక్ క్యాస్ట్ వీల్స్, డార్క్ స్కీమ్ లుక్ తో ఆకట్టుకుంటుంది.

⦿ టెక్నాలజీ: కార్నర్ సెన్సిటివ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ బై వైర్, రెయిన్, రోడ్, స్పోర్ట్, ఇండివిడ్యువల్ రైడ్ మోడ్స్  ఉన్నాయి.

⦿ హ్యాండ్లింగ్: అల్యూమినియం ఫ్రేమ్, షోవా  అడ్జస్టబుల్ సస్పెన్షన్, బ్రెంబో బ్రేక్‌లు ఉన్నాయి. ఇవి బెస్ట్ కంట్రోల్ ను అందిస్తాయి.

⦿ స్టైల్: రాకెట్ 3 R స్పోర్టియర్ పొజిషన్‌ను, R-స్టైల్ హ్యాండిల్‌ బార్‌ను కలిగి ఉంటుంది.

⦿ కల్సర్: సఫైర్ బ్లాక్, కార్నివాల్ రెడ్, సిల్వర్ ఐస్ లాంటి డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

Read Also: యమహా Tmax 560 సూపర్ స్కూటర్, దీని స్పీడ్ ఎంతో తెలుసా భయ్యా!

2024 ట్రయంఫ్ రాకెట్ 3R  ధర

2024 ట్రయంఫ్ రాకెట్ 3R ధర భారత్ లో సుమారు రూ. 24.03 లక్షల నుంచి రూ. 28 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో లభిస్తుంది. ఈ ప్రీమియం క్రూయిజర్ బైక్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొడక్షన్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఈ బైక్ భారీగా ఉన్నప్పటికీ, దీని ఇంజన్, డిజైన్ కారణంగా నడపడానికి చాలా సులభంగా,  వేగంగా ఉంటుంది.

Read Also: ఐదు దశాబ్దాలు అద్భుత ప్రయాణం, ఇప్పటికీ ఈ బైక్ స్కూటర్ హాట్ కేక్ లా అమ్ముడవుతోంది!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×