E-Paper
Advertisement

Trending EV Cars Feb 2026: మారుతి To టాటా.. ఫిబ్రవరి ట్రెండింగ్ కార్లు ఇవే!

Trending EV Cars Feb 2026:  మారుతి To టాటా.. ఫిబ్రవరి ట్రెండింగ్ కార్లు ఇవే!
Advertisement

భారతీయ ఆటో మార్కెట్ లో ఎలక్ట్రిక్ కార్లపై వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. పెట్రో కార్లకు సమానంగా ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు చేస్తున్నారు. ఫిబ్రవరి 2026లో మారుతి e Vitara, మహీంద్రా BE 07, అప్ డేట్ చేసిన టాటా పంచ్ ఈవీ లాంటి కీలక కార్లు లాంచ్ కాబోతున్నాయి. ఆయా ఈవీ కార్ల ధరలు సుమారు రూ. 8 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉండబోతున్నాయి.

ఫిబ్రవరి 2026లో ట్రెండింగ్ ఎలక్ట్రిక్ కార్లు   

⦿మారుతి సుజుకి ఇ విటారా: ఈ కారు అంచనా ధర రూ. 17 లక్షల నుంచి రూ. 22.5 లక్షల వరకు ఉంటుంది. ఫిబ్రవరి 2026లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ కారు ఒకే ఛార్జ్ మీదీ ఏకంగా 543 కి.మీ వరుకు ప్రయాణిస్తుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కారు బ్యారటీ 48.8- 61.1 kWh సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 142-172 bhp పవర్ ను ఉత్పత్తి చేయనుంది.

Advertisement

⦿ టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్: ఈ కారు అంచనా ధర రూ.10 లక్షల నుంచి రూ. 15 లక్షలు ఉంటుంది. ఫిబ్రవరి 20, 2026న ఈ కారు లాంచ్ కానుంది. ఈ కాంపాక్ట్ EV రిఫ్రెష్ చేసిన డిజైన్, కొత్త ఫీచర్లతో అందుబాటులోకి రానుంది.

⦿ మహీంద్రా BE 07: ఈ కారు అంచనా ధర రూ. 29 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. INGLO ప్లాట్‌ ఫామ్‌ పై నిర్మించబడిన ప్రీమియం SUVగా అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి 15, 2026 నాటికి ఈ కారు విడుదల కానుంది.

Advertisement

⦿ లీప్‌మోటర్ C10, T03: ఈ కార్ల అంచనా ధర రూ. 45 లక్షలు, రూ.8 లక్షలుగా ఉంటుందని భావిస్తున్నారు.  అంతర్జాతీయ బ్రాండ్ లీప్‌మోటర్ భారత్ లోకి ప్రీమియం SUV (C10), సరసమైన సిటీ కారు (T03)తో ఎంట్రీ ఇస్తోంది.

⦿ MG 4 EV: ఈ కారు అంచనా ధర రూ. 30 లక్షలు. పనితీరుపై దృష్టి సారించిన ఎలక్ట్రిక్ హ్యాచ్‌ బ్యాక్ ఫిబ్రవరి 2026లో MG పోర్ట్‌ ఫోలియోను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

⦿ స్కోడా ఎల్రోక్: ఈ కారు అంచనా ధర రూ. 50 లక్షల వరకు ఉంటుంది. ప్రీమియం మార్కెట్‌ ను లక్ష్యంగా చేసుకుని తయారు చేయబడిన మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ SUVగా అడుగు పెట్టబోతోంది.

Read Also:  విన్ ఫాస్ట్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఫిబ్రవరి 2026లో మార్కెట్ ట్రెండ్‌ ఎలా ఉందంటే?

⦿ హై ఎండ్ ఎలక్ట్రిక్ SUVలు: ఈ నెలలో ఆడి Q6 ఇ ట్రాన్ లాంటి ప్రీమియం, లాంగ్ రేంజ్ SUVలపై ఎక్కువ ఆసక్తిక కనిపిస్తోంది. దీని ధర సుమారు రూ. 1 కోటి వరకు ఉంటుంది.

⦿ బడ్జెట్, కాంపాక్ట్ ఎంపికలు: అటు  MG కామెట్, టాటా టియాగో EV లాంటి సరసమైన EVల వైపు కూడా ఎక్కకు ఆదరణ లభిస్తోంది.

Read Also: ఇక మరింత చౌకగా ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎందుకో తెలుసా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×