E-Paper
Advertisement

టయోటా హైరైడర్ vs హ్యుందాయ్ క్రెటా.. ఏది బెస్ట్ SUV?

టయోటా హైరైడర్ vs హ్యుందాయ్ క్రెటా..  ఏది బెస్ట్ SUV?
Advertisement

Hyryder vs Creta Comparison: భారత మార్కెట్‌ లో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు భారీ డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్‌ లో బాగా పాపులర్ అయిన రెండు మోడల్స్ టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హ్యుండాయ్ క్రెటా. ఇవి రెండూ ధర, ఫీచర్లు, పనితీరు పరంగా కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఎస్‌యూవీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ధర గురించి..

ఇక ఈ రెండు కార్ల ధర విషయానికి వస్తే, ఈ రెండు వాహనాలు దాదాపు ఒకే రేంజ్ లో ఉంటాయి. హైరైడర్ ప్రారంభ ధర సుమారు రూ. 10.99 లక్షలు కాగా, క్రెటా ధర రూ. 10.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అంటే, ధరలో పెద్దగా తేడా లేదు. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు ఎక్కువగా ఫీచర్లు, పనితీరు, మైలేజ్ లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఇంజిన్ సామర్థ్యం ఎలా ఉందంటే?

Advertisement

ఇంజిన్ సామర్థ్యం పరంగా చూస్తే, క్రెటా కొద్దిగా ముందు ఉంటుంది. ఇది 1497 సిసి ఇంజన్‌ తో వస్తుంది. అటు హైరైడర్‌ లో 1462 సిసి ఇంజన్ ఉంటుంది. పవర్ విషయంలో కూడా క్రెటా కొంచెం ఎక్కువగా 113 బిహెచ్‌పి అందిస్తే, హైరైడర్ 102 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నగరంలో వేగంగా డ్రైవ్ చేయాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది.

ఫ్యూయెల్ ఆప్షన్స్!

హైరైడర్ ప్యూయెల్ ఆప్షన్స్ లో ప్రత్యేకతను చూపిస్తుంది. ఇది పెట్రోల్‌ తో పాటు సిఎన్‌జి ఆప్షన్‌ తో కూడా అందుబాటులో ఉంటుంది. దీని వల్ల ఇంధన ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా మారుతుంది. మరోవైపు, క్రెటా ప్రస్తుతం ప్రధానంగా పెట్రోల్ ఇంజన్ ఎంపికతో మాత్రమే అందుబాటులో ఉంది. మైలేజ్ విషయంలో కూడా హైరైడర్ కొంత ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది సుమారు 21.11 కిలోమీటర్ల మైలేజీని అందించనుంది. రోజువారీ ప్రయాణాలకు ఉపయోగించే వారికి ఇంధన ఖర్చులో కొంత ఆదా చేస్తుంది. క్రెటా మైలేజ్ కూడా సరాసరి స్థాయిలో ఉన్నప్పటికీ, హైరైడర్‌తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది.  ట్రాన్స్‌ మిషన్ విషయానికి వస్తే, రెండూ మాన్యువల్ గేర్‌ బాక్స్‌ తో వస్తాయి. డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ దాదాపు సమానంగా ఉంటుంది. అయితే, వేరే వేరియంట్లలో ఆటోమేటిక్ ఆప్షన్లు కూడా లభిస్తాయి.

పనితీరు గురించి..

Advertisement

మొత్తంగా చూస్తే, హ్యుండాయ్ క్రెటా పవర్, పనితీరు విషయంలో కొంచెం మెరుగ్గా ఉంటుంది. కానీ, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మైలేజ్, ఇంధన ఎంపికల విషయంలో బలంగా ఉంటుంది. ఎక్కువ పవర్ కావాలనుకునే వారు క్రెటాను ఎంచుకోవచ్చు. ఇంధన ఆదా, మంచి మైలేజ్ కావాలనుకునే వారు హైరైడర్ తీసుకోవడం మంచిది. అవసరాలు, డ్రైవింగ్ విధానం, బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు మోడళ్లలో సరైనదాన్ని ఎంచుకోవడం మంచిది.

Read Also: భారత్‌లోకి ఎంజి మెజెస్టర్ ఎంట్రీ, ఫార్చ్యూనర్‌కు కొత్త పోటీ తప్పదా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×