E-Paper
Advertisement

ఎలక్ట్రిక్ To లగ్జరీ వరకు.. జూన్ 2026లో మార్కెట్ ను షేక్ చేయబోతున్న క్రేజీ SUVలు ఇవే!

ఎలక్ట్రిక్ To లగ్జరీ వరకు.. జూన్ 2026లో మార్కెట్ ను షేక్ చేయబోతున్న క్రేజీ SUVలు ఇవే!
Advertisement

6 Upcoming SUVs June 2026: జూన్ 2026లో భారత మార్కెట్ లోకి అదిరిపోయే కార్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఎలక్ట్రిక్, హైబ్రిడ్, ప్రీమియం, పెర్ఫార్మెన్స్ SUVల విభాగాల్లో పలు కొత్త మోడళ్లు అడుగుపెట్టనున్నాయి. పాపులర్ బ్రాండ్స్ తమ లేటెస్ట్ కార్లను ఈ నెలలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కొత్త SUV కొనాలని ఆలోచిస్తున్న వారికి ఈ మోడల్స్ మంచి ఆప్షన్ కానున్నాయి.

⦿ BYD ప్లగ్ ఇన్ హైబ్రిడ్ SUV

మొదటిగా BYD తన తొలి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ SUVని భారత్ లో జూన్ 9న ఆవిష్కరించనుంది. కంపెనీ ఏ మోడల్‌ను తీసుకురాబోతోందో అధికారికంగా ప్రకటించకపోయినా, సీలియన్ 6 లేదంటే అట్టో 2 పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ తో పాటు ఎలక్ట్రిక్ మోటార్‌ ను అందించే అవకాశం ఉంది. ఒకసారి పూర్తి ట్యాంక్, పూర్తి ఛార్జ్‌ తో దాదాపు 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ మోడల్ తో హైబ్రిడ్ SUV విభాగంలో BYD కొత్త పోటీని తీసుకురానుంది.

⦿ కంట్రీమ్యాన్ C

Advertisement

మినీ ఇండియా కూడా జూన్ 17న కంట్రీ మ్యాన్ Cను విడుదల చేయబోతోంది. ఈ SUV స్థానికంగా అసెంబుల్ చేయబడటం వల్ల ఇతర కంట్రీమ్యాన్ వెర్షన్లతో పోలిస్తే మరింత అందుబాటు ధరలో వచ్చే అవకాశం ఉంది. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 134 bhp పవర్, 230 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, కాంపాక్ట్ సైజ్ కారణంగా నగరాల్లో ఉపయోగించడానికి మంచి ఆప్షన్ గా మారనుంది.

⦿ హోండా ZR-V హైబ్రిడ్

హోండా ZR-V హైబ్రిడ్ SUVను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ SUV ధరలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఎలివేట్ కంటే ప్రీమియం సెగ్మెంట్‌ లో ఉండే ఈ మోడల్‌ ను పూర్తిగా దిగుమతి చేసుకుని విక్రయించనున్నారు. ఇందులో 2.0 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఉండగా, 184 hp పవర్, 315 Nm టార్క్‌ ను అందిస్తుంది. బోస్ ఆడియో సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, పవర్డ్ సీట్లు, లెవెల్-2 ADAS లాంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

⦿ BMW X6

Advertisement

లగ్జరీ SUV అభిమానుల కోసం BMW X6 మళ్లీ భారత మార్కెట్లోకి రానుంది. కొత్త ఫేస్‌ లిఫ్ట్ వెర్షన్ M60i xDrive రూపంలో అందుబాటులోకి వస్తోంది. ఇందులో 4.4 లీటర్ ట్విన్ టర్బో V8 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 523 bhp పవర్, 750 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 4.9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉంది.

⦿ సియెర్రా EV  

టాటా మోటార్స్ నుంచి ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సియెర్రా EV కూడా జూన్ చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. పాత సియెర్రా మోడల్‌ కు లేటెస్ట్ రూపాన్ని ఇస్తూ ఈ ఎలక్ట్రిక్ SUVను రూపొందించారు. టాప్ వేరియంట్లలో 75 kWh బ్యాటరీ ప్యాక్, డ్యూయల్ మోటార్ సెటప్ లభించే అవకాశం ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే రేంజ్ అందించవచ్చని అంచనా. ADAS, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ప్రీమియం క్యాబిన్ లాంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

⦿ కోడియాక్ RS

ఇక స్కోడా కూడా తన కోడియాక్ RS SUVను త్వరలో పరిచయం చేయనుంది. ఇది కంపెనీ నుంచి దేశంలో విడుదలయ్యే తొలి RS బ్యాడ్జ్ SUVగా నిలవనుంది. శక్తివంతమైన 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్, ప్రత్యేక RS డిజైన్ అంశాలతో ఈ SUV పెర్ఫార్మెన్స్ ప్రియులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

Read Also: భారత్‌ లో ఈవీ స్కూటర్ల జోరు.. మేలో 1.70 లక్షల అమ్మకాలతో సరికొత్త రికార్డు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×