E-Paper
Advertisement

రోజువారీ ప్రయాణానికి బెస్ట్ హైబ్రిడ్ కార్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్!

రోజువారీ ప్రయాణానికి బెస్ట్ హైబ్రిడ్ కార్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్!
Advertisement

Best Mileage Hybrid Cars 2026: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లపై వినియోగదారుల ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా నగరాల్లో రోజూ ప్రయాణించే వారు తక్కువ ఇంధన ఖర్చుతో పాటు మంచి ఫీచర్లు ఉండే కార్లను కోరుకుంటున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్లో హోండా, టయోటా, మారుతి సుజుకి కంపెనీలు మంచి హైబ్రిడ్ మోడళ్లను అందిస్తున్నాయి. వాటిలో టాప్ మోడల్స్ గురించి ఇప్పుడు చూద్దాం..

⦿ మారుతి సుజుకి గ్రాండ్ విటారా

ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన హైబ్రిడ్ SUVలలో ఇదీ ఒకటి. మైలేజ్ విషయంలో ఈ కారు మంచి గుర్తింపు తెచ్చుకుంది. లీటరుకు సుమారు 27.97 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. టయోటా హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చిన ఈ SUVలో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు e-CVT గేర్‌ బాక్స్ ఉంటుంది. పనోరమిక్ సన్‌ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ లాంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.19.72 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

⦿ హోండా సిటీ e:HEV

Advertisement

హైబ్రిడ్ సెగ్మెంట్‌ లో హోండా సిటీ e:HEV మంచి ఆప్షన్ గా నిలుస్తోంది. SUVల కంటే సెడాన్ కార్లను ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ కారు తక్కువ వేగంలో EV మోడ్‌ లో కూడా నడుస్తుంది. దీంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో మంచి ఇంధన ఆదా లభిస్తుంది. ADAS భద్రతా ఫీచర్లు, డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ ఇన్ఫోటైన్‌ మెంట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ సెడాన్ లీటరుకు 27.13 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని హోండా తెలిపింది. దీని ధర సుమారు రూ.20 లక్షలు ఉంటుంది.

⦿ టయోటా ఇన్నోవా హైక్రాస్

కుటుంబ ప్రయాణాలకు ఈ కారు అనుకూలంగా ఉంటుంది. విశాలమైన క్యాబిన్, సౌకర్యవంతమైన సీట్లు, ఒట్టోమాన్ ఫీచర్, పనోరమిక్ సన్‌ రూఫ్ లాంటి ప్రీమియం ఫీచర్లతో ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. పెద్ద MPV అయినప్పటికీ, దీని హైబ్రిడ్ ఇంజిన్ మంచి మైలేజ్ ఇస్తుంది. లీటరుకు 23.24 కిలోమీటర్ల వరకు ప్రయాణాన్ని అందిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.26.76 లక్షల నుంచి మొదలవుతుంది.

⦿ టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్

Advertisement

మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న హైబ్రిడ్ SUVలలో ఇదీ ఒకటి. ఇది గ్రాండ్ విటారాతో చాలా ఫీచర్లు పంచుకుంటుంది. వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌ లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌ రూఫ్ లాంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. లీటరుకు 27.97 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. దీని ప్రారంభ ధర రూ.16.77 లక్షలు ఉంటుంది.

⦿ టయోటా క్యామ్రీ

లగ్జరీ సెడాన్ కొనాలనుకునే వారికి టయోటా క్యామ్రీ మంచి ఆప్షన్. పెట్రోల్-హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చే ఈ కారు ప్రీమియం అనుభూతి  అందిస్తుంది. వెంటిలేటెడ్ లెదర్ సీట్లు, పెద్ద ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ కారు లీటరుకు 25.49 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. దీని ధర రూ.47.48 లక్షలు.

Read Also: కొత్త కారు కొంటే డబ్బులు వస్తాయా? ఇన్నాళ్లూ ఈ విషయం తెలియదే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×