E-Paper
Advertisement

మతిపోగొట్టే రేంజ్.. సూపర్ లుక్.. మేలో రిలీజయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

మతిపోగొట్టే రేంజ్.. సూపర్ లుక్.. మేలో రిలీజయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
Advertisement

Upcoming EV Scooters May 2026:  భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ రోజు రోజుకు మరింత విస్తరిస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, లో మెయింటెనెన్స్ ఖర్చులు, పర్యావరణంపై అవగాహన పెరగడం వల్ల EV స్కూటర్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది.  ఈ నేపథ్యంలో, పలు కంపెనీలు కమ్యూటర్ నుంచి ప్రీమియం వరకు అన్ని విభాగాల్లో కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగానే మే 2026లో పలు ఈవీ స్కూటర్లు రాబోతున్నాయి. వాటిలో టాప్ మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ అల్ట్రావయోలెట్ టెసరాక్ట్

అల్ట్రావయోలెట్ టెసరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మేలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది పెర్ఫార్మెన్స్‌ తో ఆకట్టుకుంటుంది.  ప్రీమియం మోడల్‌గా మార్కెట్ కు పరిచయం కానుంది. 3.5 kWh నుంచి 6 kWh వరకు బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి. ఒకే ఛార్జ్ తో 162 కిలోమీటర్ల నుంచి 261 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. 2026 మిడ్ ఇయర్ నుంచి డెలివరీలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

⦿  ఏథర్ EL01 

Advertisement

ఏథర్ కంపెనీ నుంచి వచ్చే EL01 మోడల్ సాధారణ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. తక్కువ ధరలో అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఎక్కువ లోకలైజేషన్‌ కారణంగా ధరను తగ్గించాలని కంపెనీ భావిస్తోంది. సుమారు రూ. 99,000 ప్రారంభ ధరతో ఈ స్కూటర్ మార్కెట్ లోకి రానుంది.

⦿  హీరో ఎలక్ట్రిక్ AXLHE-20,  AE-75

హీరో ఎలక్ట్రిక్ కూడా రెండు కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. AXLHE-20, AE-75. వీటిని రోజువారీ ప్రయాణాలకు ఉపయోగపడేలా డిజైన్ చేస్తున్నారు. ధర పరంగా అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ స్కూటర్ మే మధ్యలో విడుదల కావచ్చని అంచనా వేస్తున్నారు.

⦿  గోగోరో పల్స్

Advertisement

గోగోరో పల్స్ మరో క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో వస్తుంది. అంటే బ్యాటరీ ఖాళీ అయినప్పుడు ఛార్జ్ చేయడం కోసం వేచి చూడకుండా, వెంటనే మరో బ్యాటరీతో మార్చుకోవచ్చు. ఈ మోడల్ 2026 మే చివరలో అందుబాటులోకి రావచ్చని సమాచారం.

Read Also: టాటా SUVలపై భారీ ఆఫర్లు, ఆ మోడల్ పై ఏకంగా రూ.3.5 లక్షల డిస్కౌంట్!

వీటితో పాటు మరికొన్ని కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాయి. సుజుకి బర్గ్మాన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ 2026 చివరలో మార్కెట్లోకి రానుంది. ఇది మ్యాక్సీ స్కూటర్ స్టైల్‌ తో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. టీవీఎస్ జూపిటర్ ఎలక్ట్రిక్ కూడా విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే పెట్రోల్ వెర్షన్‌లో జూపిటర్ మంచి ఆదరణ పొందింది. అదే మోడల్ ను EV సెగ్మెంట్‌ లోకి తీసుకురావాలని భావిస్తోంది.

Read Also: టాటా To టయోటా.. కళ్లు చెదిరే ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×