E-Paper
Advertisement

తక్కువ ధరలో క్రేజీ కార్లు.. రూ. 5 లక్షల్లో టాప్ మోడల్స్ ఇవే!

తక్కువ ధరలో క్రేజీ కార్లు..  రూ. 5 లక్షల్లో టాప్ మోడల్స్ ఇవే!
Advertisement

Top 5 Cheapest Cars in India: దేశంలో రూ. 5 లక్షల లోపు కొత్త కారు కొనాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లో, మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చులు, నమ్మకమైన పనితీరులో ఈ కార్లు మంచి వాల్యూని కలిగి  ఉంటాయి. ప్రస్తుతం భారత్ లో అందుబాటులో ఉన్న చీప్ అండ్ బెస్ట్‌ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ మారుతి సుజుకి ఆల్టో K10

మారుతి సుజుకి ఆల్టో K10  చీప్ అండ్ బెస్ట్ కార్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇది దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన బడ్జెట్ కార్లలో ఒకటి. దీని ప్రారంభ ధర సుమారు రూ. 3.99 లక్షల నుంచి మొదలవుతుంది. చిన్న సైజు కారణంగా ట్రాఫిక్‌లో సులభంగా నడిపే అవకాశం ఉంటుంది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ తో వస్తుంది.  మంచి మైలేజ్‌ ను అందిస్తుంది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు కూడా దీని పెద్ద ప్లస్.

⦿ మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో

Advertisement

మారుతి సుజుకి నుంచి మరో మోడల్ ఎస్- ప్రెస్సో కూడా తక్కువ ధరలో లభిస్తుంది. ఇది కొంచెం ఎత్తుగా ఉండే డిజైన్‌తో SUV లుక్‌ను ఇస్తుంది. దీని ధర సుమారు రూ. 4.26 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల గుంతల రోడ్లపై కూడా సులభంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. 1.0 లీటర్ ఇంజన్‌తో వస్తుంది.

⦿ రెనాల్ట్ క్విడ్

రెనాల్ట్ కంపెనీకి చెందిన క్విడ్.. స్టైలిష్ లుక్‌ తో పాటు మంచి ఫీచర్లను అందిస్తుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 4.70 లక్షలు ఉంటుంది. 8 ఇంచ్ టచ్‌ స్క్రీన్ లాంటి ఫీచర్లు కూడా ఇందులో లభిస్తాయి. 1.0 లీటర్ ఇంజన్‌తో ఇది మంచి మైలేజ్ ఇస్తుంది.

⦿ మారుతి సుజుకి ఆల్టో 800

Advertisement

ఇంకో ఆప్షన్‌ గా మారుతి సుజుకి ఆల్టో 800 గురించి చెప్పుకోవచ్చు. అయితే, ఇది ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే లభించే అవకాశం ఉంది. గతంలో ఇది రూ. 3.5 లక్షల పరిధిలో అత్యంత చౌకైన కారు‌గా ప్రసిద్ధి చెందింది. చాలా సింపుల్, నమ్మకమైన కారుగా గుర్తింపు పొందింది.

Read Also: చెత్త రోడ్ల పైనా చెడుగుడు ఆటుకుంటూ దూసుకెళ్లే క్రేజీ కార్లు ఇవే!

⦿ స్విఫ్ట్, i10

ఇక సెకండ్ హ్యాండ్ మార్కెట్‌ను కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. అదే రూ. 5 లక్షలలో కొంచెం పాత మోడల్ అయినప్పటికీ, పెద్ద కారు, మంచి ఫీచర్లతో కూడిన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. సెకెండ్ హ్యాండ్ స్విఫ్ట్, i10 లాంటి కార్లు ఈ బడ్జెట్‌లో లభిస్తాయి. అయితే, సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసేటప్పుడు దాని స్టేటస్, సర్వీస్ హిస్టరీ తప్పనిసరిగా చెక్ చేయాలి.

Read Also: ఫస్ట్ టైమ్ కారు కొంటున్నారా? ఈ టాప్ 5 మోడల్స్ ట్రై చేయండి!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×