E-Paper
Advertisement

మహీంద్రా మాస్టర్ ప్లాన్.. ఒకేసారి 5 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

మహీంద్రా మాస్టర్ ప్లాన్.. ఒకేసారి 5 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!
Advertisement

Mahindra’s Upcoming SUV Strategy: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌ లో మహీంద్రా గత కొన్నేళ్లుగా అదరిపోయే మోడల్స్ తో దుమ్మురేపుతోంది. స్కార్పియో N, థార్ రాక్స్, XUV 3XO, XUV 7XO, BE 6, XEV 9e లాంటి మోడళ్లతో SUV విభాగంలో కంపెనీ మంచి స్థానం సంపాదించింది. అయితే, అక్కడితో ఆగకుండా, రాబోయే 18 నుంచి 24 నెలల్లో మరో ఐదు కొత్త SUVలను తీసుకురావడానికి రెడీ అవుతోంది. ఇందులో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, లైఫ్‌ స్టైల్ SUVలు కూడా ఉండనున్నాయి.

1.మహీంద్రా విజన్ S

సబ్ 4 మీటర్ల SUV సెగ్మెంట్‌ ను లక్ష్యంగా చేసుకుని మహీంద్రా విజన్ Sను తీసుకురానుంది. ఈ మోడల్‌ లో స్కార్పియో తరహా బాక్సీ డిజైన్, ఎత్తైన బోనెట్, బలమైన లుక్ కనిపించే అవకాశం ఉంది. కుటుంబ అవసరాలతో పాటు అడ్వెంచర్ ఇష్టపడే వారిని దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ADAS భద్రతా ఫీచర్లు, పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఎంపికలు ఉండే అవకాశం ఉంది. 2026 చివర్లో లేదంటే 2027 ప్రారంభంలో ఈ SUV మార్కెట్లోకి రావొచ్చని తెలుస్తోంది.

2.స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్

Advertisement

మహీంద్రా అత్యంత ప్రజాదరణ పొందిన SUVల్లో స్కార్పియో N ఒకటి. ఇప్పుడు దీనికి ఫేస్‌ లిఫ్ట్ వెర్షన్ తీసుకురానున్నారు. కొత్త LED లైట్లు, రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, పెద్ద టచ్‌స్క్రీన్, కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మెరుగైన ADAS, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ లాంటి అప్‌డేట్లు ఉండే అవకాశం ఉంది. ఇందులో ప్రస్తుతం ఉన్న ఇంజిన్ ఆప్షన్లను కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

3.మహీంద్రా BE.07

ఎలక్ట్రిక్ SUVలపై మహీంద్రా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే BE 6, XEV 9e తర్వాత ఇప్పుడు BE.07ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇది INGLO ప్లాట్‌ ఫామ్‌పై రూపొందనుంది. ఇందులో 60 kWh నుంచి 80 kWh వరకు బ్యాటరీ ఆప్షన్లు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా రేంజ్, లెవెల్-2 ADAS, ప్రీమియం క్యాబిన్ లాంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

4.మహీంద్రా విజన్ T

Advertisement

ఆఫ్‌ రోడింగ్ అభిమానుల కోసం మహీంద్రా విజన్ T కాన్సెప్ట్‌ ను కూడా సిద్ధం చేస్తోంది. ఇది థార్ కంటే మరింత ప్రీమియం లైఫ్‌ స్టైల్ SUVగా ఉండే అవకాశముంది. బాక్సీ డిజైన్, పెద్ద వీల్ ఆర్చ్‌ లు, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, ఆఫ్‌రోడ్‌కు అనుకూలమైన ఫీచర్లు ఇందులో ఉండొచ్చని సమాచారం.

5.కొత్త తరం బొలెరో

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ బొలెరోకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో మహీంద్రా కొత్త తరం బొలెరోను అభివృద్ధి చేస్తోంది. ఇందులో కొత్త డిజైన్, మెరుగైన ఇంటీరియర్, అధునాతన ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, మెరుగైన భద్రతా ఫీచర్లు, మరింత సౌకర్యవంతమైన క్యాబిన్ అందించే అవకాశం ఉంది.

Read Also: కొనుగోలుదారులకు ఎంజీ షాక్.. కామెట్ ఈవీ ధరల పెంపు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×