E-Paper
Advertisement

టాటా ఆల్ట్రోజ్ To హోండా అమేజ్.. గుంతల రోడ్లపైనా సూపర్ కంఫర్ట్ ఇచ్చే టాప్ 5 కార్లు ఇవే!

టాటా ఆల్ట్రోజ్ To హోండా అమేజ్.. గుంతల రోడ్లపైనా సూపర్ కంఫర్ట్ ఇచ్చే టాప్ 5 కార్లు ఇవే!
Advertisement

Most Comfortable Affordable Cars: భారతీయ రోడ్ల పరిస్థితులు ఇప్పటికీ అంతగా సౌకర్యవంతంగా లేవు. గుంతలు, స్పీడ్ బ్రేకర్లు, ఎగుడుదిగుడుగానే ఉన్నాయి. అందుకే, రోజూ కారు ప్రయాణం చేసే వాళ్లు కంఫర్ట్ ను కోరుకుంటారు. ముఖ్యంగా రూ. 10 లక్షల లోపు మంచి సౌకర్యం, సాఫ్ట్ సస్పెన్షన్, విశాలమైన సీట్లు, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కార్ల కోసం చూస్తుంటారు. అలాంటి వారికి సూటయ్యే 5 టాప్ కార్లను ఇప్పుడు చూద్దాం..

⦿ టాటా ఆల్ట్రోజ్

ఈ ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ మంచి బిల్డ్ క్వాలిటీ, భద్రతతో పాటు కంఫర్టబుల్ రైడ్‌ ను అందిస్తుంది. గుంతలు ఎక్కువగా ఉన్న రోడ్లపై కూడా ఈ కారు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. వెనుక సీట్లలో కూర్చున్న వారికి మంచి హెడ్‌ రూమ్, లెగ్‌ రూమ్ అందుబాటులో ఉంటుంది. 90 డిగ్రీల వరకు ఓపెన్ అయ్యే డోర్లు ఉండటం ఈ కారు ప్రత్యేకత. దీని ప్రారంభ ధర సుమారు రూ. 6.65 లక్షలు.

⦿ మారుతి సుజుకి బాలెనో

Advertisement

సిటీలో ఎక్కువగా ప్రయాణించే వారికి ఈ కారు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. సీట్లు చాలా సాఫ్ట్‌ గా, కంఫర్టబుల్‌ గా ఉంటాయి. సస్పెన్షన్ సెటప్ కూడా సిటీ డ్రైవింగ్‌ కు అనుకూలంగా ఉంటుంది. చిన్న గుంతలు, స్పీడ్ బ్రేకర్లను పెద్దగా ఇబ్బంది లేకుండా దాటేస్తుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.5.99 లక్షలు.

⦿ రెనాల్ట్ ట్రైబర్

తక్కువ ధరలో ఎక్కువ స్థలం కావాలనుకునే కుటుంబాలకు ఈ కారు అనుకూలంగా ఉంటుంది. ఇందులో రెండో వరుస సీట్లు స్లైడ్, రిక్లైన్ సౌకర్యంతో వస్తాయి. క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది. సుదూర ప్రయాణాల్లో కూడా ప్రయాణికులకు అలసట తక్కువగా అనిపించేలా సాఫ్ట్ సస్పెన్షన్‌ ను కంపెనీ అందించింది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 5.76 లక్షలు.

⦿ మహీంద్రా XUV 3XO

Advertisement

ఇది కాంపాక్ట్ SUV అయినప్పటికీ, రోడ్లపై అగ్రెసివ్ గా కనిపిస్తుంది. సస్పెన్షన్ కొంచెం గట్టిగా ఉన్నా, పెద్ద గుంతలను కూడా సులభంగా తట్టుకుంటుంది. హైవేలపై ఎక్కువ వేగంతో నడిపినా ఎలాంటి షేకింగ్ ఉండదు. గ్రామీణ ప్రాంతాలు, బాగాలేని డు రోడ్లపై ఎక్కువగా తిరిగేవారికి ఇది సరైన SUVగా చెప్పొచ్చు. దీని ప్రారంభ ధర సుమారు రూ.7.28 లక్షలు.

⦿ హోండా అమేజ్

ఈ సెడాన్‌లో సీట్లు చాలా ప్రీమియంగా అనిపిస్తాయి. సస్పెన్షన్ చాలా సాఫ్ట్‌ గా ఉండటం వల్ల రోడ్డుపై గుంతలు ఎక్కువగా ఉన్నా ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది.  సుదూర ప్రయాణాల్లో కూడా మంచి కంఫర్ట్ ఇస్తుంది. సామాన్ల కోసం పెద్ద బూట్ స్పేస్ కూడా అందుబాటులో ఉంటుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.7.55 లక్షలు. రూ. 10 లక్షల లోపు మంచి కంఫర్ట్, విశాలమైన ఇంటీరియర్, సాఫ్ట్ రైడ్ కావాలనుకునే వారికి ఈ ఐదు కార్లు బెస్ట్ ఆప్షన్స్ గా చెప్పొచ్చు.

Read Also: బ్రెజ్జా టర్బో To గ్రాండ్ విటారా.. మారుతి నుంచి 4 క్రేజీ SUVలు వచ్చేస్తున్నాయ్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×