E-Paper
Advertisement

జస్ట్ రూ.4.69 లక్షలకే EV.. BaaS స్కీమ్‌లో అందుబాటులో ఉన్న టాప్ 5 కార్లు ఇవే!

జస్ట్ రూ.4.69 లక్షలకే EV.. BaaS స్కీమ్‌లో అందుబాటులో ఉన్న టాప్ 5 కార్లు ఇవే!
Advertisement

Cheapest EVs with BaaS Option: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం నెమ్మదిగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరగడం లాంటి కారణాలతో చాలా మంది EVల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఎలక్ట్రిక్ కార్ల ప్రారంభ ధరలు సాధారణ కార్లతో పోలిస్తే ఎక్కువగా ఉండటం కొంతమందికి ఇబ్బంది అవుతోంది. ఈ సమస్యను తగ్గించేందుకు కొన్ని కంపెనీలు బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్(BaaS) స్కీమ్ ను అమలు చేస్తున్నాయి.

ఇంతకీ BaaS స్కీమ్ అంటే ఏంటి?

ఈ స్కీమ్ ద్వారా కారు ధరలో బ్యాటరీ ఖర్చును తొలగించి, వినియోగదారులు బ్యాటరీని రెంటెల్ పద్ధతిలో ఉపయోగించవచ్చు. ఈ కారు ప్రారంభ ధర గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో BaaS పథకం కింద అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన 5 ఎలక్ట్రిక్ కార్ల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.టాటా టియాగో EV

Advertisement

ఈ లిస్టులో మొదటి స్థానంలో టాటా టియాగో EV ఉంది. BaaS పథకం కింద దీని ప్రారంభ ధర రూ.4.69 లక్షలుగా నిర్ణయించారు. బ్యాటరీ అద్దె కిలోమీటరుకు రూ.2.60గా ఉంటుంది. టియాగో EVలో 19 kWh, 24 kWh బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. సిటీ ప్రయాణాలకు అనువైన ఈ కారు, తక్కువ ధరలో EV కొనాలనుకునేవారికి మంచి ఆప్షన్ గా మారింది.

2.MG కామెట్ EV

రెండవ స్థానంలో MG కామెట్ EV ఉంది. ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు BaaS ధర రూ.4.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బ్యాటరీ అద్దె కిలోమీటరుకు రూ.3.20గా ఉంటుంది. 17.3 kWh బ్యాటరీతో వచ్చే కామెట్ EV నగరాల్లో రోజువారీ ప్రయాణాల కోసం రూపొందించబడింది. కాంపాక్ట్ సైజ్ కారణంగా ట్రాఫిక్‌ లో సులభంగా నడపవచ్చు.

3.టాటా పంచ్ EV

Advertisement

మూడవ స్థానంలో టాటా పంచ్ EV నిలుస్తుంది. BaaS పథకం కింద దీని ధర రూ.6.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బ్యాటరీ అద్దె టియాగో మాదిరిగానే కిలోమీటరుకు రూ.2.60 ఉంటుంది. 30 kWh, 40 kWh బ్యాటరీ ప్యాక్‌ లతో అందుబాటులో ఉండే పంచ్ EV, ఎక్కువ రేంజ్‌ తో పాటు SUV తరహా అనుభూతిని అందిస్తుంది.

4.MG విండ్సర్ EV

నాలుగవ స్థానంలో MG విండ్సర్ EV ఉంది. ఈ కారు BaaS ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బ్యాటరీ అద్దె కిలోమీటరుకు రూ.3.99 ఉంటుంది. 38 kWh, 52.9 kWh బ్యాటరీ ఆప్షన్లతో వచ్చే ఈ కారు, విశాలమైన ఇంటీరియర్, అధునాతన ఫీచర్లు, మంచి రేంజ్‌ను అందిస్తుంది. సుదూర ప్రయాణాలకు కూడా ఇది అనువైన మోడల్‌ గా గుర్తింపు తెచ్చుకుంది.

5.మారుతి సుజుకి ఇ-విటారా

ఐదవ స్థానంలో మారుతి సుజుకి ఇ-విటారా ఉంది. BaaS పథకం కింద దీని ప్రారంభ ధర రూ.10.99 లక్షలు. బ్యాటరీ అద్దె కిలోమీటరుకు రూ.3.99గా నిర్ణయించారు. 49 kWh, 61 kWh బ్యాటరీ ఆప్షన్లతో రానున్న ఈ ఎలక్ట్రిక్ SUV, మారుతి నుంచి వచ్చిన తొలి గ్లోబల్ EVగా ప్రత్యేక గుర్తింపు పొందింది.

Read Also: షాపింగ్ నుంచి రోజువారీ అవసరాల వరకు.. బెస్ట్ స్టోరేజ్ EV స్కూటర్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×