E-Paper
Advertisement

బిఎండబ్ల్యూ To మెర్సిడెస్.. 2026లో లాంచ్ కాబోయే టాప్ 5 లగ్జరీ కార్లు ఇవే!

బిఎండబ్ల్యూ To మెర్సిడెస్.. 2026లో లాంచ్ కాబోయే టాప్ 5 లగ్జరీ కార్లు ఇవే!
Advertisement

Upcoming Luxury Cars in India: ఈ ఏడాది ఇండియన్ మార్కెట్ లోకి సరికొత్త లగ్జరీ కార్లు అడుగు పెట్టబోతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు, హైబ్రిడ్ కార్లు విడుదల కాబోతున్నాయి. పలు పాపులర్ బ్రాండ్స్ కొత్త మోడళ్లను తీసుకురాబోతున్నాయి. ఇంతకీ ఈ ఏడాది లాంచ్ కాబోతున్న లగ్జరీ కార్లు ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ BMW iX3 LWB

బిఎండబ్ల్యూ iX3 LWB లాంగ్ వీల్‌ బేస్ వెర్షన్‌ గా మార్కెట్ లోకి అడుగు పెట్టబోతోంది. వెనుక సీట్లలో ఎక్కువ స్థలం ఉంటుంది. పూర్తి ఛార్జ్‌ పై ఈ కారు సుమారు 650 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కారు ధర సుమారు రూ. 75 నుంచి 85 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ప్రీమియం SUV సెగ్మెంట్‌ లో మంచి ఆప్షన్ కాబోతోంది.

⦿ Audi Q3

Advertisement

అటు ఆడి Q3 న్యూ జెనరేషన్ మోడల్ కూడా రాబోతోంది. కొత్త డిజైన్, అత్యాధునిక టెక్నాలజీతో వస్తుంది. డిజిటల్ డిస్‌ ప్లే, అడ్వాన్స్‌ డ్ డ్రైవింగ్ ఫీచర్లు, కొత్త లైట్ సిస్టమ్ ఇందులో ఉంటాయని భావిస్తున్నారు. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ తో సుమారు 205bhp పవర్ ఇస్తుంది. ధర రూ. 57-65 లక్షల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.

⦿ BMW i5 LWB

సెడాన్ విభాగంలో బిఎండబ్ల్యూ i5 LWB విడుదల కానుంది. ఎలక్ట్రిక్ కారుగా అందుబాటులోకి రానుంది. లాంగ్ వీల్‌ బేస్ ఉండటం వల్ల వెనుక కూర్చునే వారికి ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 600 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

⦿ Mercedes-Benz S-Class

Advertisement

ఇక మెర్సిడెస్ బెంజ్ S-Class PHEV కూడా భారత మార్కెట్‌ లోకి రానుంది. ఇది ప్లగ్ ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. అంటే పెట్రోల్‌తో పాటు ఎలక్ట్రిక్ పవర్ కూడా ఉపయోగించుకోవచ్చు. కొత్త ఫీచర్లు, పెద్ద టచ్‌ స్క్రీన్ లాంటి సౌకర్యాలు ఇందులో ఉంటాయి. లగ్జరీ సెడాన్ సెగ్మెంట్‌ లో ఇదో బెస్ట్ ఆప్షన్ కానుంది.

⦿ Mercedes-Benz GLC EV LWB

అటు మెర్సిడెస్ బెంజ్  GLC EV LWB కూడా విడుదల కానుంది. ఇది కొత్త తరం ఎలక్ట్రిక్ SUVగా రానుంది. సుమారు 650 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని తెలుస్తోంది.  ధర రూ. 80-85 లక్షల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. ప్లేస్, పర్ఫార్మెన్స్, రేంజ్ కలిసి దీనిని ఓ ప్రీమియం ఆప్షన్ గా మార్చుతుంది.

2026లో లగ్జరీ కార్ల మార్కెట్‌ లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లకు  ఎక్ఉ ప్రాధాన్యత పెరుగుతోంది. కొత్త మోడళ్లతో కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవేళ మీరు కూడా లగ్జరీ కార్లు తీసుకోవాలని భావిస్తే, వీటిలో ఒకదానిని సెలెక్ట్ చేసుకోవచ్చు.

Read Also: టైర్ పగిలినా నో టెన్షన్.. ఈ కారు మూడు చక్రాలతో పరుగులు తీస్తుంది!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×