E-Paper
Advertisement

నీటిలోనూ దూసుకెళ్లే.. బెస్ట్ ‘హై గ్రౌండ్ క్లియరెన్స్’ కార్లు.. వర్షాకాలం అస్సలు తగ్గేదేలే!

నీటిలోనూ దూసుకెళ్లే.. బెస్ట్ ‘హై గ్రౌండ్ క్లియరెన్స్’ కార్లు.. వర్షాకాలం అస్సలు తగ్గేదేలే!
Advertisement

High Ground Clearance Cars: వర్షాకాలంలో నగరం మోకాళ్ల లోతు నీటితో జలమయమవడం సహజమే. అలాంటి రోడ్లపై సాధారణ కార్లలో వెళ్లడమంటే సాహసమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ‘హై గ్రోండ్ క్లియరెన్స్’ ఉన్న కార్లు.. వర్షాకాలంలో బెస్ట్ ఆప్షన్లుగా నిలుస్తున్నాయి. కొనుగోలుదారులు సైతం ఇలాంటి కార్లవైపే ఎక్కువగా మెుగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ధరలో అధునాతన ఫీచర్లతో వస్తున్న టాప్-5 హై గ్రౌండ్ క్రియరెన్స్ కార్లను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

రెనాల్ట్ కైగర్ (Renault Kiger)

హై గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన మోడల్స్ లో అత్యంత తక్కువ ధరకు లభించే కారు రెనో కైగర్. దీని ప్రారంభ ధర రూ. 5.81 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా 205 మి.మీ భారీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. 405 లీటర్ల బూట్ స్పేస్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్, పెట్రోల్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో ఇది లభిస్తుంది.

టాటా నెక్సాన్ (Tata Nexon)

Advertisement

వర్షంలో నీటితో నిండిన రోడ్లపై ఎలాంటి భయం లేకుండా వెళ్లడానికి టాటా నెక్షాన్ భలే సెట్ అవుతుంది. ఈ కారు అత్యధికంగా 208 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉంది. దీని ధర రూ.7.37 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 1.2L టర్బో పెట్రోల్ ఇంజిన్ దీని ప్రత్యేకతలుగా చెప్పవచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO)

మహీంద్రా నుంచి వచ్చిన ఈ ఎస్‌యూవీ.. 201 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్‌ ను కలిగి ఉంది. ఇక ధర విషయానికి వస్తే ఇది రూ. 7.54 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. భారత్ ఎన్సీఏపీ ఇచ్చిన 5-స్టార్ రేటింగ్‌తో పాటు సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, అడాస్ సిస్టమ్ వంటి బోలెడన్ని ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue)

Advertisement

నగరంలోని రోడ్లకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే హ్యుందాయ్ వెన్యూ కారు.. 190 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను అందిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు. 120hp టర్బో-పెట్రోల్ ఇంజిన్, డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో పాటు 375 లీటర్ల బూట్ స్పేస్ ఇందులో లభిస్తుంది.

Also Read: సినిమాలు, జూలో కాకుండా.. పులిని అడవిలో చూడాలా? ఈ ప్రాంతాలకు వెళ్లు మామ!

మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza)

మారుతీ కార్లలో 1,685 మి.మీ ఎత్తుతో అత్యంత పొడవైన ఎస్ యూవీగా బ్రెజ్జా నిలుస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 200 మి.మీ. వరద నీరు ప్రవహిస్తున్న రోడ్లపై వెళ్లేందుకు ఈ కారు ఎంతగానో సహకరిస్తుంది. దీని ధర రూ. 8.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. నాణ్యమైన మారుతి సర్వీస్ నెట్ వర్క్ సపోర్టును ఇది కలిగి ఉండటం ప్రధాన అడ్వాంటేజ్ గా చెప్పవచ్చు.

Also Read: కిలాడీ భార్య క్రైమ్ స్టోరీ.. భర్తను ఫ్యాక్టరీలో పాతేసి.. విదేశాల్లో ఉన్నాడంటూ రెండేళ్లుగా డ్రామాలు..!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×