E-Paper
Advertisement

సిటీ డ్రైవింగ్‌ కు బెస్ట్ కార్లు.. రూ.10 లక్షల్లో టాప్ 5 హ్యాచ్‌ బ్యాక్స్ ఇవే!

సిటీ డ్రైవింగ్‌ కు బెస్ట్ కార్లు.. రూ.10 లక్షల్లో టాప్ 5 హ్యాచ్‌ బ్యాక్స్ ఇవే!
Advertisement

Best City Cars Under Rs.10 Lakh: సిటీ ట్రాఫిక్ లో స్మాల్,  ఈజీ డ్రైవింగ్ కార్లు అవసరం అవుతాయి. ముఖ్యంగా రూ. 10 లక్షల లోపు బడ్జెట్‌ లో మంచి హ్యాచ్‌ బ్యాక్ కొనాలనుకునే వారికి భారత మార్కెట్‌ లో బోలెడు ఆప్షన్లు ఉన్నాయి. అందులో కొన్ని బాగా పాపులర్ అయ్యాయి. వాటిలో టాప్ 5 మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ మారుతి సుజుకి స్విఫ్ట్

ఈ కారు చాలా కాలంగా మార్కెట్‌ లో మంచి డిమాండ్ కలిగి ఉంది. తక్కువ ధర, స్టైలిష్ డిజైన్, మంచి మైలేజ్ తో యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో 3 సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. మంచి పవర్ ఇస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంది.

⦿ టాటా ఆల్ట్రోజ్

Advertisement

ఇది ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా గుర్తింపు పొందింది. డిజైన్, సేఫ్టీ ఫీచర్లు, బిల్డ్ క్వాలిటీ ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా, ఈ ధర రేంజ్ లో డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఉన్న అరుదైన మోడళ్లలో ఆల్ట్రోజ్ ఒకటి. పెట్రోల్ వెర్షన్ కూడా ఆకట్టుకుంటుంది. మాన్యువల్, AMT మరియు డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ను కలిగి ఉంది.

⦿ హ్యుందాయ్ i20

ఇది కూడా ప్రీమియం ఫీల్ ఇచ్చే హ్యాచ్‌ బ్యాక్. ఇందులో మంచి ఇంటీరియర్, ఆకట్టుకునే ఫీచర్లు ఉంటాయి. ఇంజన్ పనితీరు సాఫ్ట్‌ గా ఉంటుంది. సిటీ డ్రైవింగ్‌ కు అనుకూలంగా ఉంటుంది. మాన్యువల్, IVT ఆటోమేటిక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

⦿ టయోటా గ్లాంజా

Advertisement

ఇది మారుతి బాలెనో ఆధారంగా రూపొందించిన మోడల్. మంచి మైలేజ్ ఇస్తుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ తో  వస్తుంది. మాన్యువల్, AMT గేర్‌ బాక్స్ ఆప్షన్స్ ను కలిగి ఉన్నాయి. టయోటా బ్రాండ్ నమ్మకం అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

⦿ సిట్రోయెన్ C3X

సిట్రోయెన్ కారు కాస్త డిఫరెంట్ గా కనిపించే హ్యాచ్‌ బ్యాక్. SUV లుక్‌ లో ఆకట్టుకుంటుంది. తక్కువ ధరలో అందుబాటులో ఉండటం పెద్ద ప్లస్. ఇందులో రెండు రకాల పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉంటాయి. ఒకటి సాధారణ, మరొకటి టర్బోచార్జ్డ్ ఇంజిన్. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

ఈ 5 కార్లు సిటీ ట్రాఫిక్‌ లో సులభంగా నడిపించే అవకాశం ఉంటుంది. మంచి మైలేజ్  అందిస్తాయి. మెయింటెనెన్స్ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి.  అవసరం, బడ్జెట్, డ్రైవింగ్ స్టైల్‌ ను నచ్చిన కారును ఎంచుకోవచ్చు.

Read Also: కార్లకు కొత్త తెలివి.. నోటి మాటతో చెప్పిన పని చేసేస్తాయ్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×