E-Paper
Advertisement

తక్కువ సీట్ హైట్ ఉన్న.. బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రైడింగ్ ఇక మరింత ఈజీ..!

తక్కువ సీట్ హైట్ ఉన్న.. బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రైడింగ్ ఇక మరింత ఈజీ..!
Advertisement

Electric Scooters: ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా క్రమంగా పెరుగుతోంది. అయితే కొత్తగా ఈవీ కొనుగోలు చేసేవారు మైలేజ్, ధరతో పాటు.. ‘సీట్ ఎత్తు’ ను సైతం పరిగణలోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా హైట్ తక్కువ ఉన్న మహిళలు, వయోవృద్ధులు ట్రాఫిక్‌లో ఈజీగా స్కూటర్ ను కంట్రోల్ చేసేందుకు తక్కువ సీటుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిమిత సైజులో, సీటు తక్కువ ఎత్తులో ఉన్న టాప్ – 5 ఈవీ స్కూటర్ల లిస్ట్ ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

హోండా క్యూసీ1 (Honda QC1)

ఇటీవలే విడుదలైన హోండా QC1.. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తోంది. దీని సీట్ ఎత్తు కేవలం ‘704 మిల్లీ మీటర్లు’ మాత్రమే. కాబట్టి హైట్ తక్కువ ఉన్నవారు సైతం ఎంతో ధైర్యంగా, నిరభ్యంతరంగా ఈ స్కూటర్ ను నడుపవచ్చు. దీని బరువు సైతం తక్కువగా ఉండటం వల్ల ట్రాఫిక్‌లో తేలిగ్గా వెళ్లిపోవచ్చు.

బీఎండబ్ల్యూ సీఈ 02 (BMW CE 02)

Advertisement

ప్రీమియం కేటగిరీలో సరికొత్త డిజైన్‌తో వచ్చిన BMW CE 02 మోడల్ సైతం.. రైడర్ కంఫర్ట్‌కు పెద్దపీట వేసింది. దీని సీట్ ఎత్తు ‘745 మి.మీ – 750 మి.మీ’ మధ్య ఉంటుంది. భిన్నమైన స్టైలిష్ లుక్‌తో పాటు.. సులభంగా కాళ్లు నేలకు ఆనేలా దీనిని రూపొందించారు.

టీవీఎస్ ఆర్బిటర్ (TVS Orbiter)

ఫ్యామిలీ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన టీవీఎస్ ఆర్బిటర్ ‘763 మి.మీ’ ఎత్తుతో లభిస్తుంది. కాంపాక్ట్ సైజ్, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, కంఫర్ట్ గా ఉండే సీటింగ్ పొజిషన్ వల్ల ఇది యూజర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది.

బజాజ్ చేతక్ సీ2501 (Bajaj Chetak C2501)

Advertisement

బజాజ్ చేతక్ ఈవీ సిరీస్‌లో C2501 మోడల్ ‘763 మి.మీ’ సీట్ ఎత్తు కలిగి ఉంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగినప్పుడు దీన్ని చాలా ఈజీగా బ్యాలెన్స్ చేయవచ్చు. ఈ స్కూటర్ క్లాసిక్ మెటల్ బాడీ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

Also Read: మార్కెట్లోకి ఖరీదైన స్పోర్ట్స్ బైక్.. ఒక్కసారి రోడ్డుపైకి వెళ్తే.. రేసింగ్ ప్రియులకు పూనకాలే!

సుజుకి ఈ-యాక్సెస్ (Suzuki e-Access)

సుజుకి చెందిన ఇ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘765 మి.మీ’ సీట్ ఎత్తును కలిగి ఉంది. తక్కువ హైట్ వారు నడిపినా కూడా.. ట్రాఫిక్ లో బండి ఆగినప్పుడు రెండు పాదాలు సులభంగా కిందకు తగులుతాయి.

Also Read: బైక్ లవర్స్‌కి అదిరిపోయే గుడ్ న్యూస్.. మార్కెట్‌లోకి బజాజ్ ఫస్ట్ ఈవీ బైక్.. ఎప్పుడో తెలుసా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×