E-Paper
Advertisement

Best Helmet Brands India: ఆక్సార్ To షార్క్.. ఇండియాలో బెస్ట్ హెల్మెట్ కంపెనీలు ఇవే!

Best Helmet Brands India: ఆక్సార్ To షార్క్.. ఇండియాలో బెస్ట్ హెల్మెట్ కంపెనీలు ఇవే!
Advertisement

గత కొద్ది సంవత్సరాలుగా ఇండియాలో హెల్మెట్స్ తయారీ సంస్థలు బాగా పెరుగుతున్నాయి. మోటార్ సైకిల్స్ నడిపే వాళ్లలో హెల్మెట్ ఉపయోగించాలనే అవేర్నెస్ రావడంతో హెల్మెట్ తయారీ కంపెనీలు చక్కటి హెల్మెట్స్ తయారు చేస్తున్నాయి. ఒకప్పుడు చాలా మంది రైడర్లు వైజర్, ISI మార్క్‌ తో కూడిన చౌకైన హెల్మెట్‌ను కోరుకున్నారు. కానీ, ఇప్పుడు హెల్మెట్ బ్రాండ్లు కొత్త టెక్నాలజీని తీసుకువస్తున్నాయి. భద్రతతో అద్భుతమైన ఫీచర్లతో హెల్మెట్లను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలోని టాప్ 5 హెల్మెట్ బ్రాండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ KYT

ఈ కంపెనీకి చెందిన హెల్మెట్ల ధర రూ. 6,500 నుంచి రూ. 57,000 వరకు ఉంటుంది. KYT రేసింగ్ హెల్మెట్లను ఎక్కువగా తయారు చేస్తుంది. ఈ కంపెనీ హెల్మెట్లను MotoGP, WorldSBK రైడర్లు ఉపయోగిస్తారు. ఈ బ్రాండ్ ఏరోడైనమిక్ డిజైన్లు,  టైట్, రేస్ రెడీ ఫిట్‌లపై ఫోకస్ పెడుతుంది. KYT ఇటీవలే భారత మార్కెట్‌లోకి అడుగు పెట్టింది. ఈ బ్రాండ్ అద్భుతమైన గ్రాఫిక్స్‌ తో కూడిన హెల్మెట్లను తక్కువ ధరకే అందిస్తోంది.

⦿ HJC

Advertisement

ఈ కంపెనీ హెల్మెట్లు రూ. 10,999 నుంచి రూ. 66,000 వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీని ప్రొడక్ట్స్ మంచి వెంటిలేషన్, సౌకర్యాన్ని అందిస్తాయి. ECE, DOT సర్టిఫికేషన్‌ తో అందుబాటులో ఉంటాయి. ఇవి ఎటువంటి అసౌకర్యం లేకుండా లాంగ్ రైడ్‌ల కంఫర్ట్ గా ఉంటాయి.

⦿ షార్క్

ఈ కంపెనీ హెల్మెట్లు రూ. 34,000 నుంచి రూ. 65,000 వరకు లభిస్తాయి. షార్క్ రేసింగ్‌లో మంచి గుర్తింపును పొందింది.  ప్రసిద్ధ ప్రీమియం హెల్మెట్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. దీని హెల్మెట్లు అధునాతన సేఫ్టీ ఫీచర్లు, అద్భుతమైన వెంటిలేషన్,  అధిక నాణ్యత నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. ECE, DOT సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంటాయి. సౌకర్యవంతమైన ఫిట్‌ తో ఎక్కువ సేపు రైడింగ్ చేసేలా షార్క్ హెల్మెట్లు ఉంటాయి.

⦿ ఆక్సార్

Advertisement

ఈ కంపెనీకి చెందిన హెల్మెట్లు రూ. 2,600 నుంచి రూ. 12,000 వరకు లభిస్తాయి. సరసమైన, భద్రతతో కూడిన హెల్మెట్‌లను అందించడం ద్వారా ఆక్సార్ మంచి గుర్తింపు పొందింది. ముఖ్యంగా అపెక్స్, స్ట్రీట్ మోడల్స్ టూరింగ్ ప్రియులలో బాగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ECE, ISI సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంటుంది.

Read Also: మూడు వేరియంట్లు, ఐదు రంగులు.. సుజుకి యాక్సెస్ 125 అదిరింది బ్రో!

⦿ ఆక్సార్‌బిస్

ఈ కంపెనీ చెందిన హెల్మెట్లు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. రూ. 6,499 నుంచి అందుబాటులో ఉంటాయి. ఆక్సార్‌బిస్ ఆఫ్ రోడ్, అడ్వెంచర్ రైడింగ్‌ లో ప్రసిద్ధి చెందింది. దీని హెల్మెట్‌లు తేలికైన నిర్మాణం, మంచి వెంటిలేషన్ తో రైడర్ కు లాంటి ఇబ్బంది కలిగించవు. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్, కంఫర్ట్  ఫిట్‌ తో, ఆక్సార్‌బిస్ హెల్మెట్‌లు ట్రైల్ రైడింగ్‌తో పాటు లాంగ్ రైడింగ్ లకు అనుకూలంగా ఉంటాయి.

Read Also: మీ కారును అస్సలు వాష్ చేయడం లేదా? అయితే, మీకు ఈ విషయాలు కచ్చితంగా తెలియాల్సిందే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×