E-Paper
Advertisement

సిటీ రోడ్లకు పర్ఫెక్ట్ ఆటోమేటిక్ SUVలు ఇవే.. కొనేముందు ఈ లిస్ట్ చూడండి!

సిటీ రోడ్లకు పర్ఫెక్ట్ ఆటోమేటిక్ SUVలు ఇవే.. కొనేముందు ఈ లిస్ట్ చూడండి!
Advertisement

Top Automatic SUVs For Urban Driving: సిటీల్లో రోజురోజుకూ ట్రాఫిక్ భారీగా పెరుగుతోంది. గంటల తరబడి ట్రాఫిక్‌ లో ఇరుక్కుపోవడం, తరచూ క్లచ్ నొక్కడం, గేర్లు మార్చడం డ్రైవర్లకు విసుగును కలిగిస్తోంది. అందుకే ఇప్పుడు చాలా మంది ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఉన్న కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా SUV సెగ్మెంట్‌ లో ఆటోమేటిక్ మోడళ్లకు మంచి డిమాండ్ ఉంది. నగర ప్రయాణాలకు అనుకూలమైన కొన్ని ఆటోమేటిక్ SUVల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్

ఈ రెండు SUVలు స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తాయి. ట్రాఫిక్‌ లో నెమ్మదిగా ప్రయాణిస్తున్నప్పుడు చాలాసార్లు ఎలక్ట్రిక్ మోటార్‌ పైనే నడుస్తాయి. ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా డ్రైవింగ్ కూడా చాలా స్మూత్‌ గా ఉంటుంది. e-CVT గేర్‌ బాక్స్ వల్ల గేర్ మార్పులు అనిపించవు. నగరాల్లో ఎక్కువగా ప్రయాణించే వారికి అనుకూలంగా ఉంటాయి.

2.హోండా ఎలివేట్ CVT

Advertisement

సింపుల్‌ గా, సౌకర్యవంతంగా డ్రైవ్ చేయాలనుకునేవారికి హోండా ఎలివేట్ మంచి ఆప్షన్. ఇందులో ఉన్న CVT ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ చాలా సాఫీగా పనిచేస్తుంది. ట్రాఫిక్‌ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా నడపవచ్చు. మంచి విజిబిలిటీ, తేలికైన స్టీరింగ్, కంఫర్టబుల్ డ్రైవింగ్ ఉంటుంది.

3.కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా

భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన SUVల్లో సెల్టోస్, క్రెటా ముందుంటాయి. వీటిలో లభించే IVT ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ నగర డ్రైవింగ్‌ కు బాగా సరిపోతుంది. తక్కువ వేగాల్లో కూడా చాలా స్మూత్‌ గా స్పందిస్తుంది. అంతేకాకుండా అధునాతన ఫీచర్లు, సౌకర్యవంతమైన సీట్లు, మంచి సస్పెన్షన్ వల్ల ట్రాఫిక్‌లో ప్రయాణం సులభంగా అనిపిస్తుంది.

4.టాటా నెక్సాన్ EV,  పంచ్ EV

Advertisement

నగరాల్లో డ్రైవింగ్‌ కు ఎలక్ట్రిక్ వాహనాలు మరింత అనుకూలంగా ఉంటాయి. టాటా నెక్సాన్ EV, పంచ్ EV రెండూ గేర్‌ బాక్స్ లేకుండా సింగిల్ స్పీడ్ డ్రైవ్ సిస్టమ్‌ తో వస్తాయి. యాక్సిలేటర్ నొక్కగానే వెంటనే పవర్ అందుతుంది. ట్రాఫిక్‌ లో తరచూ బ్రేక్, యాక్సిలేటర్ వాడాల్సిన పరిస్థితుల్లో ఇవి చాలా సౌకర్యంగా ఉంటాయి. వన్ పెడల్ డ్రైవింగ్ ఫీచర్ కూడా డ్రైవర్ కు అనుకూలంగా ఉంటుంది.

5.మహీంద్రా XUV 3XO

ఈ SUVలో టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ అందుబాటులో ఉంటుంది. ఇది AMT గేర్‌ బాక్స్‌ లతో పోలిస్తే చాలా స్మూత్‌ గా పనిచేస్తుంది. ట్రాఫిక్‌ లో కారు ముందుకు కదిలే తీరు సహజంగా ఉంటుంది. శక్తివంతమైన ఇంజిన్, కంఫర్టబుల్ రైడ్ క్వాలిటీ కారణంగా నగరంతో పాటు హైవే ప్రయాణాల్లో కూడా బాగుంటుంది. ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ కావాలంటే గ్రాండ్ విటారా లేదంటే హైరైడర్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ కోసం ఎలివేట్, ఫీచర్ల కోసం క్రెటా లేదంటే సెల్టోస్, ఎలక్ట్రిక్ మొబిలిటీ కోసం నెక్సాన్ EV లేదంటే పంచ్ EV, పవర్ ఫుల్ పనితీరు కోసం XUV 3XOను కొనుగోలు చెయ్యొచ్చు.

Read Also: 246 కి.మీ రేంజ్‌ తో కొత్త సిట్రోయెన్ eC3 ఫేస్‌లిఫ్ట్.. ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×