E-Paper
Advertisement

మారుతి To టాటా.. తక్కువ బడ్జెట్‌ లో సన్‌ రూఫ్ తో వచ్చే టాప్ 5 మోడల్స్ ఇవే!

మారుతి To టాటా.. తక్కువ బడ్జెట్‌ లో సన్‌ రూఫ్ తో వచ్చే టాప్ 5 మోడల్స్ ఇవే!
Advertisement

Best Sunroof Cars Under Rs 13 Lakh: భారతీయ కార్ల మార్కెట్లో సన్‌ రూఫ్‌ కు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. కారు క్యాబిన్‌ ను మరింత విశాలంగా కనిపించేలా చేయడమే కాకుండా, ప్రీమియం ఫీల్‌ను కూడా సన్‌ రూఫ్ అందిస్తుంది. అందుకే ఇప్పుడు తక్కువ బడ్జెట్ కార్లలో కూడా ఈ ఫీచర్‌ ను కంపెనీలు అందిస్తున్నాయి. ఇప్పుడు తక్కువ బడ్జెట్‌ లో సన్‌ రూఫ్ ఉన్న కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.మారుతి డిజైర్

ఈ లిస్టులో అత్యంత చవకైన సన్‌ రూఫ్ కారు మారుతి డిజైర్. మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, మెరుగైన భద్రతతో ఫ్యామిలీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. డిజైర్ టాప్-స్పెక్ ZXI+ వేరియంట్‌ లో ఎలక్ట్రిక్ సన్‌ రూఫ్ అందుబాటులో ఉంది. దీని ఆన్ రోడ్ ధర సుమారు రూ.10.37 లక్షలు. బడ్జెట్‌ లో సన్‌ రూఫ్ కారు కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

2.మహీంద్రా XUV 3XO

Advertisement

ఫీచర్ల పరంగా చూసినా, పనితీరు పరంగా చూసినా మహీంద్రా XUV 3XO మంచి SUVగా గుర్తింపు పొందింది. దీని RevX M (O) వేరియంట్‌లో సింగిల్ పేన్ సన్‌ రూఫ్ ఉంటుంది. ఈ వేరియంట్ ధర సుమారు రూ.10.54 లక్షలు. మరింత ప్రీమియం అనుభూతి కోరుకునే వారికి RevX A వేరియంట్‌లో డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్ అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.13.40 లక్షలు.

3.కియా సైరోస్

భారత మార్కెట్లోకి వచ్చిన తర్వాత కియా సైరోస్ డిజైన్‌ చాలా మందిని ఆకట్టుకుంది. ఫీచర్ల పరంగా ఇది మంచి వ్యాల్యూ అందించే SUVగా గుర్తింపు తెచ్చుకుంది. దీని HTE (O) వేరియంట్‌ లో సింగిల్ పేన్ సన్‌ రూఫ్ లభిస్తుంది. ఈ వేరియంట్ ధర సుమారు రూ.10.68 లక్షలు. మరోవైపు HTK+ వేరియంట్‌లో పనోరమిక్ సన్‌ రూఫ్ కూడా అందుబాటులో ఉంది. దీని ధర సుమారు రూ.12.72 లక్షలు, దీంతో ఈ బడ్జెట్‌లో పనోరమిక్ సన్‌ రూఫ్ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్ గా మారుతోంది.

4.హ్యుందాయ్ వెన్యూ

Advertisement

హ్యుందాయ్ ఇటీవల వెన్యూను కొత్త ఫీచర్లు, మెరుగైన భద్రతా అంశాలు, మంచి డిజైన్‌ తో అప్‌ డేట్ చేసింది. వెన్యూ HX5 వేరియంట్‌లో సన్‌ రూఫ్‌ ను అందిస్తోంది. ఈ వేరియంట్ ప్రారంభ ధర సుమారు రూ.11.20 లక్షలు. అయితే, పనోరమిక్ సన్‌ రూఫ్ కావాలంటే టాప్ వేరియంట్‌ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దాని ధర రూ.13 లక్షల బడ్జెట్‌ ను దాటుతుంది.

5.టాటా నెక్సాన్

ఈ జాబితాలో బెస్ట్ మోడల్ టాటా నెక్సాన్ ఒకటి. తక్కువ ధరకే సన్‌ రూఫ్‌ ను అందించే SUVలలో ముందుంటుంది. నెక్సాన్‌లో ప్యూర్+ PS వేరియంట్ పనోరమిక్ సన్‌ రూఫ్‌ తో వస్తుంది. దీని ఆన్ రోడ్ ధర సుమారు రూ.11.24 లక్షలు. ఈ ధరలో పనోరమిక్ స న్‌రూఫ్‌ ను అందించే అత్యంత సరసమైన SUVలలో టాటా నెక్సాన్ ఒకటిగా నిలుస్తోంది.

Read Also: టాటా సియెర్రా ఈవీకి QWD కన్ఫర్మ్.. డ్యూయల్ మోటార్‌తో వస్తున్న కొత్త SUV!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×