E-Paper
Advertisement

సర్వీస్ ఖర్చు తక్కువ.. మైలేజ్ ఎక్కువ.. టాప్ 10 బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు ఇవే!

సర్వీస్ ఖర్చు తక్కువ.. మైలేజ్ ఎక్కువ.. టాప్ 10 బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు ఇవే!
Advertisement

Low Maintenance Cars in India 2026: కారు కొనేటప్పుడు ధర మాత్రమే కాదు, మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా ముఖ్యం. ప్రతి ఏడాది సర్వీస్,  స్పేర్ పార్ట్స్ ఖర్చు, ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ, సర్వీస్ సెంటర్ల అందుబాటు లాంటి అంశాలపైనా ఫోకస్ పెట్టాలి. ప్రస్తుతం భారతీయ కారు మార్కెట్ లో తక్కువ ధరలో లో మెయింటెనెన్స్ కార్లను ఎక్కువగా మారుతి సుజుకి అందిస్తుంది. హ్యుందాయ్, టాటా, హోండా, టయోటా కంపెనీలకు చెందిన కొన్ని మోడళ్లు కూడా తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో బెస్ట్ ఆప్షన్ గా మారువుతున్నాయి. వాటిలో టాప్ మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.మారుతి సుజుకి ఆల్టో K10

తొలిసారి కారు కొనేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, తక్కువ సర్వీస్ ఖర్చు, ఈజీగా లభించే విడి భాగాలు దీని ప్రత్యేకత. దీని ఎక్స్‌ షోరూమ్ ధర రూ.4.23 లక్షల నుంచి రూ.6.21 లక్షల వరకు ఉంటుంది. ఏడాదికి సర్వీస్ ఖర్చు రూ.3,500–5,000 వరకు అవుతుంది.

2.మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

Advertisement

విశాలమైన క్యాబిన్, మంచి మైలేజ్, CNG ఆప్షన్ తో కుటుంబ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. దీని ధర రూ.5.79 లక్షల నుంచి రూ.7.63 లక్షల వరకు ఉంటుంది. సర్వీస్ ఖర్చు ఏడాదికి రూ.4,000 నుంచి 5,500 వరకు అవుతుంది.

3.మారుతి సుజుకి స్విఫ్ట్

స్టైలిష్ లుక్, మంచి పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌ బ్యాక్‌ లలో ఒకటిగా కొనసాగుతోంది. ఈ కారు ధర రూ.6.49 లక్షల నుంచి రూ.9.65 లక్షల వరకు ఉంటుంది. సర్వీస్ ఖర్చు ఏడాదికి  రూ.4,500–6,500 వరకు ఉంటుంది.

4.హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్

Advertisement

ప్రీమియం ఇంటీరియర్, సౌకర్యవంతమైన డ్రైవింగ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఆకట్టుకుంటుంది. దీని ధర రూ.5.98 లక్షల నుంచి రూ.8.62 లక్షల వరకు ఉంటుంది. సర్వీస్ ఖర్చు రూ.4,000–6,000 వరకు ఉంటుంది.

5.టాటా టియాగో

భద్రతకు ప్రాధాన్య ఇచ్చే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. బలమైన నిర్మాణంతో పాటు నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. దీని ధర రూ. 5.00 లక్షల నుంచి రూ.8.75 లక్షల వరకు  ఉంటుంది. సర్వీస్ ఖర్చు రూ.5,000–6,500 వరకు ఉంటుంది.

6.హోండా అమేజ్

సెడాన్ కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ మోడల్. దీర్ఘకాలిక వినియోగంలో కూడా మంచి పనితీరును అందిస్తుంది.
దీని ధర రూ.8.15 లక్షల నుంచి రూ.11.25 లక్షల వరకు ఉంటుంది సర్వీస్ ఖర్చు  రూ.6,000–8,000 వరకు అవుతుంది.

7.టయోటా గ్లాంజా

టయోటా నాణ్యతతో పాటు మారుతి సర్వీస్ నెట్‌ వర్క్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. దీని ధర రూ.6.90 లక్షల నుంచి రూ.10.00 లక్షల వరకు ఉంటుంది. సర్వీస్ ఖర్చు రూ.5,000–6,500 వరకు ఉంటుంది.

8.మారుతి సుజుకి డిజైర్

అద్భుతమైన మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో కాంపాక్ట్ సెడాన్ విభాగంలో ఇప్పటికీ బెస్ట్ సెల్లర్ గా గుర్తింపు తెచ్చుకుంది. దీని ధర రూ.6.84 లక్షల నుంచి రూ.10.19 లక్షల వరకు ఉంటుంది. సర్వీస్ ఖర్చు రూ.5,000–6,500 అవుతుంది.

9.మారుతి సుజుకి బ్రెజ్జా

ఫ్యామిలీ SUV కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్. 1.5 లీటర్ K-సిరీస్ ఇంజిన్ తక్కువ మెయింటెనెన్స్ ను ఖర్చు అవుతుంది. దీని ధర రూ.8.69 లక్షల నుంచి రూ.14.14 లక్షల వరకు ఉంటుంది. సర్వీస్ ఖర్చు రూ.6,000–7,500 అవుతుంది.

10.టాటా పంచ్

స్టైలిష్ డిజైన్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, తక్కువ నిర్వహణ ఖర్చుతో మైక్రో SUV విభాగంలో బాగా పాపులర్ అయ్యింది. దీని ధర రూ.6.20 లక్షల నుంచి రూ.10.35 లక్షల వరకు ఉంటుంది. సర్వీస్ ఖర్చు రూ.5,500–7,000 వరకు ఉంటుంది.

Read Also: జూలైలో కొత్త కార్ల జాతర.. ఏకంగా 8 క్రేజీ మోడల్స్ లాంచ్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×